ఎన్నికల సంఘంలో ముసలం

Publish Date:Sep 24, 2026

Advertisement

కేంద్ర ఎన్నికల సంఘంలో(ఈసీఐ)లో ముసలం పుట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ణానేశ్వర్ నిర్ణయాలను మిగిలిన ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కొన్ని  తీసుకుంటున్న కొన్ని   నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు ఇద్దరూ   అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో  కలకలం రేపుతోంది. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై గత కొంత కాలంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలకు ఈ పరిస్థితి బలం చేకూరుస్తోంది. 

 గత కొద్ది నెలల వ్యవధిలో ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు   పద్నాలుగు సార్లు తమ అసమ్మతిని  అధికారికంగా నమోదు చేశారు.   ముఖ్యంగా ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారమ్ 6 మార్పులు వంటి కీలక అంశాలపై సీఈసీతో మిగిలిన ఇద్దరు కమిషనర్లు విభేదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తమతో సంప్రదించకుండానే సీఈసీ జ్ణానేశ్వర్   కీలక విధానపరమైన నిర్ణయాలను ఏకపక్షంగా అమలు చేశారని   కమిషనర్లు ఆరోపిస్తున్నారు.ఈ అంతర్గత వివాదంలో డిజిటల్ ఓటరు డేటాబేస్ నిర్వహణ, సాఫ్ట్‌వేర్ కేంద్రీకరణ వంటి అంశాలు ఉన్నాయి. 

క్షేత్రస్థాయిలో ఉండే రిజిస్ట్రేషన్ అధికారుల అధికారాలను పక్కనపెట్టి, కేంద్ర స్థాయి ఐటీ విభాగాల ద్వారా సాఫ్ట్‌వేర్ నియంత్రణను జ్ణానేశ్వర్ చేతుల్లోకి తీసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాంకేతిక మార్పుల వల్ల అర్హులైన  ఓటర్లు సైతం జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని, ఇది సంప్రదాయ వికేంద్రీకరణ భద్రతను బలహీనపరుస్తుందని జ్ణానేశ్వర్ తో విభేదిస్తున్న కమిషనర్లు ఇద్దరూ చెబుతున్నారు.  

.బహుళ సభ్యులు ఉన్న ఎన్నికల సంఘంలో సమష్టి నిర్ణయాలు తీసుకోవాలనే నిబంధనలకు విరుద్ధంగా జ్ణానేశ్వర్ కుమార్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలో ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు చోటుచేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల సంఘం ఉన్నత స్థాయిలోనే ఇటువంటి విభేదాలు రికార్డుకెక్కడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  


Election Commission of India, Internal Rift, CEC Gyanesh Kumar controversy, Special Intensive Revision, SIR, Election Commissioners dissent, voter list database centralization, Telugu One

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.