సీఈసీపై బొద్దింకల దాడి: జ్ణానేశ్వర్ ను టార్గెట్ చేసిన సీజేపీ.!

Publish Date:Sep 23, 2026

Advertisement

దేశంలో ఎన్నికల నిర్వహణ తీరు, ఈవీఎంల పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ వంటి   అంశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం పని తీరు వివాదాస్పదంగా ఉందనీ,  నిష్పాక్షిత, పారదర్శకత కరవైందనీ కాంగ్రెస్ సహా ఎన్డీయేతర పార్టీలు విమర్శిస్తున్నాయి.

ముఖ్యంగా, ఎస్ఐఆర్ అంటూ పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు పట్ల దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమౌతోంది.  మరీ ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన   కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలిపై సర్వత్రా వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  

సరిగ్గా ఇదే సమయంలో బొద్దింకల పార్టీ.. కాక్రోచ్ జనతా పార్టీ.. సీఈసీని టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన పోస్టులో గురువారం (సెప్టెంబర్ 24) హస్తినలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

ఆ పోస్టులో ఆయన ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయలని పేర్కొంటూ.. సీఈసీని ఉద్దేశించి జ్ణానేష్ నీ పని ఫినిష్ భాయ్ అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  ఈ ప్రకటన ద్వారా  కాక్రోచ్ జనతా పార్టీ సీఈసీ టార్గెట్ గా ఉద్యమానికి తెర లేపిందని అవగతమౌతోంది. ఇక గురువారం (సెప్టెంబర్ 24)  ప్రెస్ మీట్‌లో ఎన్నికల ప్రక్రియ లోపాలను ఎండగట్టడమూ కాకుండా, ఈసీ వ్యవస్థ పనితీరుపై, సీఈసీ వ్యవహార శైలిపై  సీజేపీ సంచలన విషయాలు వెల్లడించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

గతంలో కేంద్ర విద్యా  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విధానాలకు వ్యతిరేకంగా సీజేపీ ఆందోళన.. ఆయన పదవికి రాజీనామా చేసేలా చేసిన సంగతి తెలిసిందే. అటువంటి సీజేపీ ఇప్పుడు సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై సమరశంఖం పూరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఎన్నికల సంఘం సంస్థాగత పారదర్శకతపై   విపక్షాలు, స్వతంత్ర సంస్థలు ఇప్పటికే ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తూ, ఆందోళన బాట పట్టాయి. ఓటర్ల జాబితాల రూపకల్పన, ఈవీఎంల విశ్వసనీయతపై చాలా కాలంగా అనుమానాలూ, సందేహాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సు తరుణంలో   సీఈసీని టార్గెట్ చేస్తూ బొద్దింకల పార్టీ సమరభేరి మోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  బొద్దింకల పార్టీ  డిజిటల్ వేదికలపైనే  కాకుండా, క్షేత్రస్థాయిలోనూ ఉద్యమాలకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.  

[CJP, Election Commissioner Gyanesh Kumar, Cockroach Janata Party, Abhijeet Dipke, Election Commission of India,Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.