TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తాజా వార్తలు మరిన్ని →

రాజకీయంమరిన్ని →

political-news-img

మీడియా సమావేశాల్లో జగన్ బోరింగ్.. విజయసాయి ఇంట్రెస్టింగ్.!

కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ఎంపీ విజయసాయిరెడ్డి, వరుస ప్రెస్ మీట్లతో ఒకదాని వెంట ఒకటిగా సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఆయన వైజాగ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన విషయాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చెప్పిన విషయం, ప్రస్తావించిన అంశం, వెల్లడించిన వివరాలను అలా ఉంచితే.. పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది పక్కనపెడితే.. వైసీపీ అధినేత జగన్‌ సమావేశాల కంటే సాయిరెడ్డి ప్రెస్‌మీట్లే ప్రజల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివిధ అంశాలపై వైఎస్ జగన్ సుదీర్ఘంగా ప్రసంగించడమే కాకుండా, గణాంకాలు, పోలికలపైనే ఎక్కువ దృష్టిపెడుతుంటారు. దీంతో ఆయన విలేకరుల సమావేశాలు సాగదీతగా, రొడ్డకొట్టుడు ప్రసంగాలుగా మీడియా ప్రతినిథులు చెబుతుంటారు. అంతే కాకుండా జగన్ ప్రెస్ మీట్లలో గణాంకాల విషయంలో ఫ్యాక్చువల్ ఎర్రర్స్ సర్వసాధారణమి చెబుతారు.దీంతో ఆయన మాట్లాడే విషయంలోని తప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవ్వడమే కాకుండా, జగన్ ను కూడా ట్రోల్ మెటీరియల్ గా మర్చేస్తుండటం కద్దు. అయితే అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశాలు రంజుగా, పసందుగా, పదునుగా, స్ట్రాటజిక్ గా సాగుతుంటాయి. గణాంకాల జోలికి పోకుండా, ప్రజలను, మీడియాను ఇట్టే ఆకట్టుకునే సంచలన రాజకీయ విమర్శలకు విజయసాయి ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం, మత మార్పిడులు, వైసీపీలో సజ్జల ఆధిపత్యం, పార్టీలో అంతర్గతంగా ఆయన సాగిస్తున్న అరాచకం, తననే స్వయంగా కొట్టారంటూ సజ్జలపై సంచలన ఆరోపణలు, విశాఖపట్నం వర్సెస్ మావిగున్ వంటి వాటిని ఆయన ప్రస్తావిస్తూ, ఇటు మీడియానూ, అటు ప్రజలనూ ఏకకాలంలో ఆకట్టుకోగలుగుతున్నారు. అన్నిటికీ మించి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికీ, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ కు సన్నిహితంగా మెలిగిన విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను సహజంగా జనం నమ్ముతున్నారు. కేవలం సంచలన వ్యాఖ్యలుగా కొట్టిపారేయకుండా, అందులో వాస్తవం ఉండే ఉంటుందన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే జనం విజయసాయి ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు? ఏ సంచలన విషయాలు వెల్లడిస్తారు? అని ఆసక్తిగా చూస్తున్నారు. [Vijayasai Reddy Jagan, AP Politics, Visakhapatnam, Press meet, YSR Congress Party, Vijayasai, New Party, Telugu One]

Published on: Thu Oct 1, 2026 12:46PM

political-news-img

వైసీపీలో పేర్ని నాని సీన్ అయిపోయిందా: కార్యకర్తల సమావేశంలో అసహనం సంకేతం ఏంటి.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బందర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని ఎప్పుడు వార్తల్లో ఉంటుంటారు. తనదైన వాగ్ధాటితో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు రేకెత్తడానికి దోహదపడుతుంటారు. అసలు పేర్ని నాని పరిచయం అక్కర్లేని పేరు. అయితే తాజాగా ఆయన తన సహజ శైలికి భిన్నంగా ఇటీవల ఎక్కడ లేని అసహనాన్నీ ప్రదర్శించారు. విషయమేంటంటే.. ఇటీవల బందర్ లో ఆయన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ కార్యకర్తలతో పేర్ని నాని భేటీ అవ్వడం కొత్తేం కాదు. చాలా మంది నేతల కంటే చాలా చాలా ఎక్కువ సార్లు ఆయన కార్యకర్తలతో సమావేశం అవుతుంటారు. వారిలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంటారు. అలా నింపడానికి ఆయనకున్న వాగ్ధాటి దోహదపడుతుంటుంది. అందుకే పేర్ని నాని సమావేశం ఏర్పాటు చేశారంటే కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భేటీకి తరలి వస్తుంటారు. అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది. అందుకు కారణమేంటంటే.. ఐదేళ్ల వైసిపి హయాంలో తన సొంత సామాజిక వర్గానికి, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయలేదంటూ ఈ సమావేశంలో కార్యకర్తలు పేర్ని నానిని నిలదీశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందిన పేర్ని నాని.. కార్యకర్తలు నిలదీయడంతో సహనం కోల్పోయారు. పొలిటీషియన్లు, ఎమ్మెల్యేలకు కులాలేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన కార్యకర్తలపై ఒక్క సారిగా సామాజిక సమీకరణాలంటారేంటి అంటూ విరుచుకుపడ్డారు. దీంతో కార్యకర్తలు విస్మయానికి గురయ్యారు. సామాజికవర్గం పేరు చెప్పుకుని ఎదిగిన నాని ఒక్కసారిగా ఇలా రివర్స్ అవ్వడమేంటంటూ విస్తుపోయారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేతకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను సొంత పార్టీ నేతలకు నిలదీస్తుంటే.. వారిని సముదాయించడం చాతకాక, మంత్రి కొల్లు రవీంద్రపై నోరు పారేశసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారని, తాను మాత్రం కేవలం విధేయత చూపిన వాళ్లకే పదవులు ఇచ్చాననీ పరోక్షంగా కొల్లును విమర్శిస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతోంది. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. పేర్ని తీరు, వ్యాఖ్యలు.. బందర్ లో వైసీపీ సీన్ అయిపోయిందా? లేక వైసీపీలో పేర్ని నాని సినిమా అయిపోయిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బందర్ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి బలోపేతం అయ్యిందనీ, ఇందు కోసం మంత్రి కొల్లు రవీంద్ర చురుకుగా వ్యవహరిస్తున్నారనీ, ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీని నడిపించడంలో విఫలమైన నాని, డిఫెన్స్ లో పడి.. అసహనంతో రగిలిపోతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దానికి తోడు.. తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని ఆశించిన పేర్ని కిట్టూ కూడా ప్రజాక్షేత్రంలో ఆకట్టుకోవడంలో విఫలం కావడం కూడా పేర్ని నాని అసహనానికి కరాణంగా చెబుతున్నారు. [Perni Nani, Machilipatnam, Kollu Ravindra, Y CP , AP Politics, Andhra Pradesh Politics, Restlessness, Telugu One]

Published on: Thu Oct 1, 2026 12:02PM

political-news-img

తెలుగుదేశం కూటమికే జనం జై: అయితే, ఆ సమస్యలు అధిగమించాలి.. చాణక్య స్ట్రాటజీస్ సర్వే.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చాణక్య స్ట్రాటజీస్ నిర్వహించిన తాజా రాజకీయ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు నెలల పాటు నిర్వహించిన ఈ సర్వేలో ప్రజాభిప్రాయం, స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పాలన, కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన బీజేపీ మధ్య సమన్వయం, వైసీపీ బలం వంటి పలు అంశాలను పరిశీలించినట్లు చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వేలోని అంశాలు ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుంది. వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తియిన సందర్భంగా.. కూటమి పాలనపై ప్రజాల అభిప్రాయం, జనం మూడ్ ఎలా ఉందన్న అంశాన్ని తాజా సర్వే పరిశీలించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, జాబ్ క్యాలెండర్, పెంచిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలు అమలవుతున్నప్పటికీ.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో క్షేత్రస్థాయి నాయకత్వం, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదన్న అభిప్రాయం చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, నెల నెలా ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ వంటి అంశాలు ప్రజలకు చేరుతున్నాయని సర్వే పేర్కొంది. అయితే గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన పెన్షన్ పంపిణీ సమయంలో కనిపించిన ప్రచార స్థాయి ఇప్పుడు కనిపించడం లేదన్న అభిప్రాయం జనంలో వ్యక్తమౌతోంది. ఇక తల్లికి వందనం పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ కూటమి నేతలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సర్వే ఫలితంలో వెల్లడైంది. అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రభుత్వంపై వైసీపీయులు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ తెలుగుదేశం వినా, కటమిలోని మిగిలిన రెండు భాగస్వామ్య పార్టీల నేతలూ పెద్దగా ముందుకు రావడం లేదన్న అభిప్రాయం కూడా ఈ సర్వేలో తేటతెల్లమైంది. జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన పాలనపై ప్రజల్లో విశ్వాసం ఇసుమంతైనా సడలలేదని సర్వే స్పష్టం చేసింది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లగలరన్న విశ్వాసం ప్రజల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమౌతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మాత్రం క్షేత్రస్థాయిలో జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో తేలింది. ఇసుక, మట్టి, ఇతర స్థానిక వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లపై వస్తున్న ఫిర్యాదులు, చిన్న చిన్న ప్రజా సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదన్న అసంతృప్తి క్షేత్రస్థాయిలో ప్రజలలో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. ఏపీలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. ఆ పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు వాస్తవంగా ఎప్పుడు ప్రారంభమవుతాయన్న చర్చ ప్రజలలో విస్తృతంగా జరుగుతోందని సర్వే పేర్కొంది. కొన్ని పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినప్పటికీ.. అనేక చోట్ల నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. అమరావతి నిర్మాణ పనులకు ప్రతిరోజూ అప్‌డేట్లు వస్తున్నట్టే.. పరిశ్రమలు, పెట్టుబడి ప్రాజెక్టుల పురోగతిపై కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందిస్తే విశ్వాసం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. శంకుస్థాపనలు ఎప్పుడు పూర్తవుతాయి.. పరిశ్రమలు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయన్న ప్రశ్నలకు జనం సమాధానం కోరుకుంటున్నారని తేలింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెమ్మదించిన పలు సాగునీటి ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసిందన్న అంశాన్ని కూడా సర్వే ప్రస్తావించింది. వెలిగొండ, పోలవరం ఎడమ గట్టు కాలువ, కుప్పం ప్రాంతానికి తాగు, సాగునీరు, పులివెందులకు తాగునీరు అందించే ప్రాజెక్టులు వంటి వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని పేర్కొంది. అయితే ఈ పనుల గురించి ప్రజల్లోకి బలంగా వెళ్లే స్థాయిలో ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం అధికార కూటమికి ఇబ్బందికరంగా మారుతోందని సర్వే విశ్లేషించింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై విమర్శలను విస్తృతంగా ప్రచారం చేస్తోందని, వాటికి దీటుగా కౌంటర్ ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం, కూటమి భాగస్వామ్య పార్టీలో విఫలమౌతున్నాయని సర్వే తేల్చింది. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పార్టీలలో కీలకమైన జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలపై జరుగుతున్న ప్రచారం కూడా జనంలో చర్చనీయాంశంగా మారిందని సర్వే పేర్కొంది. వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా వలసలు జరుగుతుండటం ఆ అభిప్రాయానికి కారణంగా సర్వే పేర్కొంది. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న కాలంలో.. స్థానికంగా టీడీపీ నాయకులతో రాజకీయంగా తలపడిన నేతలు జనసేనలో చేరుతుండటం, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ నాయకులతో ముందుముందు జనసేన సమన్వయం దెబ్బతినే అవకాశం ఉందన్న అభిప్రాయం, ఆందోళన అయా ప్రాంతాలలోని స్థానికులలో బలంగా వ్యక్తమౌతోందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే పేర్కొంది. మరీ ముఖ్యంగా ఈ పరిస్థితి స్థానిక ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇక తెలుగుదేశం సీనియర్ నాయకులకు, మంత్రి నారా లోకేష్‌కు మధ్య సమన్వయం, ప్రాధాన్యత వంటి అంశాలపై కూడా సర్వేలో పరిశీలించింది. పార్టీలో సీనియర్లకు గతంలో ఉన్నంత ప్రాధాన్యత ప్రస్తుతం లేదన్న అభిప్రాయం కొంతమంది నాయకుల్లో ఉందని పేర్కొంది. కీలక పదవులు, నిర్ణయాల్లో సీనియర్ల అభిప్రాయాలను తగిన స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి కూడా ఉందని తెలిపింది. అదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేష్ మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు వంటి ప్రచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోందని సర్వే పేర్కొంది. అయితే బహిరంగంగా మాత్రం ఇరువురు నేతలు కూటమి కొనసాగుతుందని చెబుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ తరహా ప్రచారానికి కూటమి అగ్రనాయకత్వం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వేలో వ్యక్తమైంది. భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూటమి ఐక్యతపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొంది. ఇక వైసీపీ విషయానికి వస్తు.. వైసీపీ, కూటమి మధ్య అంతరం తగ్గుతోందన్న అభిప్రాయం ముఖ్యంగా కడప, కర్నూలు జిల్లాల్లో కనిపిస్తోందని సర్వే పేర్కొంది. కడప జిల్లాలో కమలాపురం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వైపు ఓటర్ల మొగ్గు కనిపిస్తోందని తెలిపింది. కర్నూలు జిల్లాలోనూ కూటమి నాయకులు ఆశించిన స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్న అసంతృప్తి ప్రజలలో బలంగా వ్యక్తమైందని సర్వే పేర్కొంది. కూటమి వైఫల్యాలను వైసీపీ నిర్మాణాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఆ పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉందన్న విశ్లేషణను సర్వే చేసింది. అయితే ఇది సర్వే సంస్థ అభిప్రాయం మాత్రమేనని, వాస్తవ ఎన్నికల ఫలితాలను ముందుగానే నిర్ణయించే అంశంగా చూడలేమని చాణక్య స్ట్రాటజీస్ పేర్కొంది. అలాగే స్థానిక ఎన్నికల విషయానికి వస్తే.. కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాట్లే కీలకమని సర్వే పేర్కొంది. జనసేన నాయకులు ఎక్కువ సంఖ్యలో స్థానాలను కోరుతున్నారని, రోవైపు ఇప్పటికే గ్రామస్థాయిలో తమకు బలమైన పట్టు ఉందని భావిస్తున్న టీడీపీ నాయకులు సీట్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరన్న అభిప్రాయం కూడా ప్రజలలో ఉందని సర్వే పేర్కొంది. టీడీపీ, జనసేన నాయకత్వం క్షేత్రస్థాయిలో విభేదాలను ముందుగానే పరిష్కరించకపోతే వాటి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందని సర్వే విశ్లేషించింది. గతంలో పరస్పరం పోటీ చేసిన లేదా విమర్శలు చేసుకున్న నాయకులు ఇప్పుడు కలిసి ప్రచారం చేయాల్సిన పరిస్థితి రావడం కూడా కూటమికి కీలక సవాలుగా మారనుందని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. చాణక్య స్ట్రాటజీస్ తాజా సర్వేలో కూటమి ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన ఉన్నప్పటికీ.. స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరు, కూటమి పార్టీల మధ్య సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం, పెట్టుబడుల అమలు, జనసేనలో చేరికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకం వంటి అంశాలు కీలకంగా మారుతున్నట్లు పేర్కొంది. ఈ అంశాలను కూటమి నాయకత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందన్నది రాబోయే రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారనుంది. [AP Political Survey, Chanakya Strategies Survey, AP Political Survey, Chandrababu, TDP, Janasena, BJP, YCP, AP Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]

Published on: Thu Oct 1, 2026 10:27AM

political-news-img

ఖైరతాబాద్ బరిలో జనసేన: బీజేపీ ఓట్లకు గండేనా?

తెలంగాణలో ఎన్నికల వేడి రగిలింది. ఒకవైపు శాసనమండలి ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. మరోవైపు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక రాజకీయాలను వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతుండగా, తాజాగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరి నిలిచేందుకు సై అంటున్నది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయం రసకందాయంలో పడింది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తమ స్థానాన్ని కాపాడుకోవడానికి పట్టుదలగా ఉండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా సత్తా చాటుకోవడానికి ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. . ఇక భారతీయ జనతా పార్టీ సైతంఖైరతాబాద్ లో విజయం సాధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉనికిని చాటుకోవడానికి శ్రమిస్తోంది. ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమతమ అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తును ప్రారంభించాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ కూడా ఖైరతాబాద్ బైపోల్‌‌లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన ఏదో నామ మాత్రపు పోటీ మాదిరిగా కాకుండా.. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలని భావిస్తోంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తగిన అంగబలంతో పాటు ఆర్థిక బలం ఉన్న బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు పొత్తులో ఉండటమే కాకుండా, అధికారంలో కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అయితే తెలంగాణ కు వచ్చే సరికి మాత్రం బీజేపీ, జనసేనలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులు ఉంటాయని చెబుతున్నాయి. ఇదే జరిగితే జనసేన పోటీ బీజీపీ ఓట్లకు గండి కొట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ (కల్వకుంట్ల కవిత) బరిలో ఉండటం బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందేనని చెబుతున్నారు. [Janasena, Khairatabad Bypoll, Telangana Politics, Khairatabad Assembly Election, Pawan Kalyan, Danam Nagender Disqualification, Kalvakuntla, Kavita, Trs, Telugu One]

Published on: Wed Sep 30, 2026 3:21PM

political-news-img

ఒకే వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్: వైసీపీ సైలెన్స్.. విభేదాల ప్రచారానికి ఎండకార్డ్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య సమన్వయం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ స్థిరత్వంలో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే కూటమి భాగస్వామ్య పార్టీల ఐక్యతకు ఊతంగా నిలుస్తోంది. గత కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు. ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. ఇందుకు పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య కారణం. గత కొంత కాలంగా ఆయన పలు కేబినెట్ భేటీలకు హాజరు కాలేదు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలలోనూ కనిపించలేదు. దీంతో వైసీపీ తెలుగుదేశం, జన సేన మధ్య విభేదాలు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎడముఖం పెడముఖం అంటూ కథనాలు వండి వార్చాయి. కూటమిలో చీలిక అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాయి. అయితే వైసీపీ ఆరోపణలు, విమర్శలు, ప్రచారాన్ని పూర్వ పక్షం చేస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య సయోధ్య ఇసుమంతైనా సడలలేదనడానికి నిదర్శనంగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మంగళవారం (సెప్టెంబర్ 29)న నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేదిక పంచుకున్నారు. చాలా కాలం తరువాత, పొలిటికల్ భాషలో చెప్పాలంటే సుదీర్ఘ విరామంతరువాత ఈ ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఇటు తెలుగుదేశం శ్రేణుల్లోనూ, అటు జనసేన క్యాడర్ లోనూ ఉత్సాహాన్ని నింపింది. భుజం నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్.. ఆ తరువాత కేరళలో చికిత్స, పునరావాసం తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ క్రియాశీలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, పార్టీ వ్యవహరాలలోనూ క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ఈ పరిణామంతొ వైసీపీ సైలెంట్ అయిపోయింది. విభేదాలంటూ ఆ పార్టీ పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి పవన్ కల్యాణ్ చంద్రబాబులు ఒకే వేదికపై కనిపించడం చెక్ పెట్టింది. [Palle Panduga, Chandrababu Naidu, Pawan Kalyan, Andhra Pradesh Rural Development, Nellore Ramapuram Meeting, Check, YCP Rumors, Telugu One]

Published on: Wed Sep 30, 2026 11:44AM

political-news-img

చంద్రబాబు దంపతుల హాలీడే ట్రిప్: వైసీపీ దుష్ప్రచారంపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్.!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆ పార్టీ ఆరోపణలు, విమర్శలకు ఆధారాలు ఉండాలని భావించదు. ఆ పార్టీ ఎకో సిస్టమ్ (వ్యవస్థ)లోనే ఈ లోపం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటనపై కూడా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది. ఏపీ పొలిటికల్ ఎరీనాలో వైసీపీ తీరు ఎప్పుడూ విలక్షణమే. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో గత రెండు రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు రహస్యంగా వియత్నాం పర్యటనకు వెళ్లారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చెప్పాపెట్టకుండా చంద్రబాబు చేపట్టిన ఈ విదేశీ పర్యటన వెనుక భారీ కుట్ర ఉందంటూ క్యాంపెయిన్ ఆరంభించింది. వైసీపీ ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ కొట్టి పారేశారు. ఎదుటి వారి మీద పడి ఏడవడం మాని మీ పని చూసుకోండంటూ సుతిమెత్తగా కాకుండా ఘాటుగా, దీటుగా ఆ దుష్ప్రచారానికి చెక్ పెట్టారు. చంద్రబాబు దంపతులు వారి మనవడితో కలిసి చిన్న హాలీడే ట్రిప్ కు వెళ్లారని లోకేష్ స్పష్టం చేశారు. పనీ పాటా లేని వైసీపీ చంద్రబాబు పర్యటనపై అర్ధంపర్ధం లేని ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ప్రచారంపై సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన లోకేష్.. సీఎం చంద్రబాబు, భువనేశ్వరి తమ మనుమడు దేవాన్ష్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారనీ, అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కూడా మనుషులేనన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. పొలిటికల్ యాక్టివిటీస్ తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి కదా. చంద్రబాబు అందుకు మినహాయింపు కూడా ఏమీ లేదు. అయినా.. స్థానిక ఎన్నికల వేళ విదేశీ పర్యటనకు సిద్ధమైన జగన్ ను వదిలేసి వైసీపీయులు, చంద్రబాబు మనవడిని తీసుకుని భార్యతో హాలీడే ట్రిప్ కు వెళ్లడంపై దుష్ప్రచారం ఏంటని పరిశీలులు విమర్శస్తున్నారు. అది పక్కన పెడితే.. విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ మాత్రం ఆయన విదేశీ పర్యటనపై పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వారుస్తోంది. [Chandrababu Naidu, YCP, AP Politics, Personal Tour, YCP Social Media, Naralokesh, Telugu One]

Published on: Wed Sep 30, 2026 9:18AM