డిసెంబర్ లోనే వడగాల్పులు: ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు.!

Publish Date:Oct 12, 2026

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఎల్ నినో   ప్రభావం తీవ్రరూపం దాలుస్తోంది.  వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. సాధారణంగా చలికాలంలో ఉండాల్సిన ఆహ్లాదకరమైన వాతావరణం కనుమరుగై, పగటిపూట ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ప్రజారోగ్యంపై కూడా ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితి దుష్ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. రానున్న రోజులలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో చలికి వణకాల్సిన జనం.. వడగాల్పుల కారణంగా వడదెబ్బలకు గురయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ సారి శీతాకాలం ఉండదు సరే.. ఎల్ నినో ప్రభావంతో నవంబర్ చివరి వారం నుంచే వేసవి ప్రవేశించే అవకాశం ఉందనీ, డిసెంబర్ లోనే రోళ్లు పగిలే ఎండలు జనాలను బెంబేలెత్తిస్తాయనీ అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలూ దాదాపు ఎనిమిది నెలల పాటు వేసవి వేడిని అనుభవించాల్సిన పరిస్థితులు దాపురించనున్నాయన్న మాట. 


ఇప్పటికే పగటి వేళల్లో విపరీతమైన వేడి వాతావరణం నెలకొనడంతో  జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తమ దైనందిన కార్యక్రమాల కోసం బయటికి వెళ్లాలంటే  ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, కార్యాలయాలకు వెళ్లేవారికి ఈ అసాధారణ వాతావరణం అసౌకర్యాన్ని కలిగిస్తోంది. రాత్రి సమయాల్లో కూడా ఎలాంటి చల్లదనం లభించకపోగా, ఉక్కబోత రోజు రోజుకూ  పెరుగుతోంది. వర్షాకాలం ముగిసి శరదృతువు ప్రవేశించినప్పటికీ, చలి జాడఇసుమంతైనా కనిపించడం లేదు. 

తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మామూలుగా కంటే రాత్రులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  ఎల్ నినో ప్రభావం వల్ల  చలికాలం అనేదే లేకుండా పోయింది. ఇక బెజవాడ, అక్టోబర్ నెలలోనే బ్లేజ్ వాడ అన్నట్లుగా మారిపోయింది.  ఎల్ నినో పుణ్యమా అని వేసవి ఏకంగా ఎనిమిది నెలల పాటు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్ నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా వేడి పెరిగి వృద్ధుల మరణాలకు కూడా దారితీయవచ్చని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.   

పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఆవర్తనంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్లే డిసెంబర్‌లోనే వడగాల్పులు వీచే పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.   వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ ఎల్ నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందంటున్న వాతావరణ నిపుణులు.. ఫిబ్రవరి తరువాత వచ్చేది మళ్లీ వేసవే కావడంతో  వాతావరణం 2026 టు 2027 ఏడాది మొత్తం వేసవే అన్నట్లుగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటివరకు ఈ ఏడాది వర్షపాతం 34 శాతం లోటుగా నమోదు అయిన సంగతి తెలిసిందే. నైరుతి దారుణంగా దెబ్బతినడంతో ఈ ఏడాది వానా కాలం కూడా వేసవినే తలపించింది. 

ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితి కారణంగా వ్యవసాయ రంగం కుదేలౌతోంది. సెప్టెంబర్‌లో కురిసిన నామమాత్రపు వర్షాలతో కృష్ణా నదికి నీరు వచ్చిందని రైతులు సంతోషించే లోపే మళ్లీ వేడి వాతావరణం ఆ సంతోషాన్ని ఆవిరి చేసింది. ఉత్తరరాయలసీమలో వర్షాభావం పరిస్థితులు,  అకాలంలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వ్యవసాయం దెబ్బతింది. అయితే పట్టిసీమ పుణ్యమా అని  పంటలు పూర్తిగా ఎండిపోలేదు. అయితే మెట్ట ప్రాంతాల పరిస్థితి దారుణంగా, దయనీయంగా మారింది. 

అనంతపురం, చిత్తూరు వంటి జిల్లాల్లో మెట్ట పంటలు వేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండలకు పంటలు పూర్తిగా ఎండిపోతుండటంతో రైతుల కన్నీరు కూడా ఆవిరైపోతోంది. ఈ ఏడాది వరి,  ఇతర పంటల ఉత్పత్తి దాదాపు 30 నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, సాగునీరు, తాగునీటి కొరతతో పాటు వాతావరణ మార్పులు తీవ్ర రూపం దాలుస్తాయనీ హెచ్చరిస్తున్నారు.  కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తరహాలోనే.. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు   రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఎల్ నినోను కూడా కరోన లాగే పెను విపత్తుగా భావించి ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికను పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.  

[El Nino impact Telugu states, December heatwaves AP Telangana, weather news Telugu agriculture, El Nino effect on crops, Telugu One]

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.