తాగునీటిని వృథా చేస్తే రూ.20 వేల జరిమానా.!

Publish Date:Sep 19, 2026

Advertisement

 

తాగునీటిని దుర్వినియో గం చేస్తే ఎంతటివారైనా చర్యలు తప్పవని హైదరాబాద్ జలమండలి హెచ్చరించింది. జూబ్లీ హిల్స్‌లో తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్‌కు వినియోగించిన ఓ వినియోగదారురాలికి జలమండలి అధికారులు  20 వేల రూపాయలు జరిమానా విధించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో ఓ వినియోగదా రురాలు తాగునీటిని ఫ్లోర్‌ క్లీనింగ్‌ కోసం వినియోగిస్తు న్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు. దీంతో నిబంధనల మేరకు అధికారులు  ఆమెకు   జరిమానా విధించారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్‌లు కడగడం వంటి అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యతపై ఆందోళనలు నెలకొని, ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంంటుంటే.. మరోవైపు తాగునీటిని ఇలా వృథా చేయడం సరికాదని అధికారులు పేర్కొన్నారు. ప్రతి చుక్క నీటిని బాధ్యతగా వినియోగించాలన్నారు. తాగునీటిని దుర్వినియో గం చేస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవని జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌   అశోక్‌ రెడ్డి హెచ్చరించారు. తాగు నీటిని ఇతర అవసరాలకు వినియో గించకుండా ప్రజలంతా బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నారు.

తాగునీటి దుర్వినియోగంపై ఇకపై తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించిన ఆయన.. ఎక్కడైనా తాగునీటిని వృథా చేస్తున్నట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తామన్నారు. ఎవరైనా తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే జలమం డలి వాట్సాప్‌ నంబర్‌ 99499 30003కు ఫిర్యాదు చేయాలని  ప్రజలకు సూచించారు. 

[Drinking Water Waste Fine, Water Penalty Jalamandali, Save Water Rules,  Water Wastage Penalty, Telugu One]

By
en-us Political News

  
రాష్ట్రంలో కనిపిస్తున్న కరవు పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తినవి కావన్నారు.  ఇందుకు పూర్తిగా రేవంత్ సర్కార్  అసమర్థ  విధానాలే కారణమని విమర్శించారు.  కృష్ణా నదీ జలాల నిర్వహణ,  వాటిని వినియోగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.  
 స్టేషన్‌ బయట సదరు కానిస్టేబుల్‌ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్‌ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాలా కబ్జాలు, బఫర్ జోన్ ఆక్రమణలు జరిగాయని గతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలో సుమారు 14 గుంటల మేర నాలా ఆక్రమణ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.