రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం.!

Publish Date:Sep 18, 2026

Advertisement

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో శనివారం (సెప్టెంబర్ 19) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.  గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొని తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు,  ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట్ మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన   కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి   కారులో ప్రయాణిస్తూ తమ సొంతూరికి బయలుదేరారు. మార్గమధ్యంలో శంషాబాద్‌లోని పాలమాకుల వద్దకు వచ్చేసరికి..  వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును  ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే, కారు  పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ   ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిని 54 ఏళ్ల కేతవత్ లింబ్యా), ఆయన భార్య 45 ఏళ్ల కేతవత్ జమున, 48ఏళ్ల కత్రొవత్ మానసింగ్, 45 ఏళ్ళ కేతవత్ వాస్రామ్ గా   గుర్తించారు. 

మృతులలో ముగ్గురు వ్యాపార రంగంలో ఉండగా, జమున గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు   రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామైన మెట్టుగడ్డ  విషాద చ్ఛాయలు అలుముకున్నాయి.   ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డ్రైవర్ సబావత్ అశోక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు.  పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కొరకు ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.  

[Shamshabad Accident, Hyderabad Road Accident, Car Hit Culvert, Four Killed, One Family, Palamakula Accident, Telangana news, Telugu One]

By
en-us Political News

  
రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దేవరయంజాల్ సర్వే నంబర్ 437 పరిధిలో ఉన్న ఆ ఒక్క ఎకరం వ్యవసాయ భూమి విలువ నాటి అఫిడవిట్ లో  50 వేల రూపాయలుగా ఉంది.  
ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.