కానిస్టేబుల్ కృూరత్వం.. మహిళపై భౌతిక దాడి.. జుట్టు పట్టుకు ఈడ్చుకెళ్లిన వైనం.!
Publish Date:Sep 19, 2026
Advertisement
రక్షక భటుడే భక్షక భటుడిగా మారి ఓ మహిళపై దాడికి పాల్పడిన ఉదంతమింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ విచక్షణ మరిచి ఓ మహిళపై భౌతిక దాడికి పాల్పడటమే కాకుండా జుట్టు పట్టుకుని ఈడ్చుకెడుతున్న సంఘటనకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం, నిరసన వ్యక్తం అవుతోంది. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ లోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఒక మహిళపై ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. స్టేషన్ బయట సదరు కానిస్టేబుల్ ఓ మహిళను కర్రతో కొట్టి, ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తు న్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో కానిస్టేబుల్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. విధుల్లో ఉన్నపోలీసు ఒక మహిళ దారుణంగా దాడికి పాల్పడడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే.. సదరు మహిళ కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించిందని, ఇష్టానుసారంగా దూషిం చిందనీ, నేపథ్యం లోనే కానిస్టేబుల్ , మహిళ మధ్య వివాదం తలెత్తి నట్లు అక్కడి వారు చెబుతున్నారు. అయితే మహిళ అనుచితంగా ప్రవర్తించినా, చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన కానిస్టుబుల్ చట్టాన్నితన చేతుల్లోకి తీసుకోవడం క్షంతవ్యం కాదని అంటున్నారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వారు మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ పై పోలీసు ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
[Constable Cruelty, Viral Video, Police Harassment Woman, Cop Drags Woman, Telugu One]
http://www.teluguone.com/news/content/constable-cruelty-24-231889.html




