ఫార్ములా ఈరేస్ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా.!

Publish Date:Sep 18, 2026

Advertisement

ఫార్ములా ఈ రేసు కేసు విచారణను నాంపల్లి ఏసీబీ కోర్టు వచ్చే నెల  30కి వాయిదా వేసింది. శుక్రవారం (సెప్టెంబర్ 17) జరిగిన విచారణకు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఆయనతోపాటు ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ 3గా ఉన్న మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డీ కూడా కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టిన తెలంగాణ ఏసీబీ  ఈ కేసులో కేటీఆర్‌ను ఏ 1గా, అరవింద్‌ కుమార్‌ను ఏ 2గా, బీఎల్‌ఎన్‌ రెడ్డీని ఏ 3గా పేర్కొంటూ ఏసీబీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

అనంతరం కోర్టు ఛార్జ్‌షీట్‌ను స్వీకరించి నిందితులకు హాజరు కావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నుంచి విదేశీ సంస్థ ఫార్ములా ఈ ఆపరేషన్స్‌  కు సుమారు రూ.55 కోట్ల నిధులు బదిలీ చేసిన వ్యవహారంపై  గా ఏసీబీ దర్యాప్తు సాగుతోంది. అవసరమైన అనుమతులు, ఆర్థిక నిబంధనలను పాటించకుండా చెల్లింపులు జరిగాయన్నది దర్యాప్తు సంస్థ ఆరోపణగా ఉంది. ఈ ఆరోపణలను కేటీఆర్‌ గతంలో ఖండించారు. ఇప్పటికే పలుమార్లు కోర్టు విచారణకు వచ్చిన ఈ కేసులో తాజా విచారణ అనంతరం తదుపరి విచారణను అక్టోబర్‌ 30కి నాంపల్లి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.  


[KTR, Nampally ACB Court, Formula E Case, Arvind Kumar, BRS party, RS 55 Crores, Hearing, Adjourned]

By
en-us Political News

  
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.