జగన్ ది జైలు బాట.. చంద్రబాబుది అభివృద్ధి జాడ!

Publish Date:Jul 10, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జగన్ పాలనను జనం ఎంత తీవ్రంగా తిరస్కరించారో తేటతెల్లం చేశారు. అదే సమయంలో చంద్రబాబు సుపరిపాలన రాష్ట్రానికి ఎంత అవసరమో కూడా జనం గ్రహించారని ఫలితాలు తెలియజేశాయి. అయితే తన పట్ల, తన పాలన పట్ల వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగానే తాను పరాజయం పాలయ్యాననీ, విభజిత ఆంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు సాగించిన సుపరిపాలనను దూరం చేసుకున్నందుకు పశ్చాత్తాపం కూడా వ్యక్తమైనందునే ఈ స్థాయిలో తన పార్టీని ఓడించారని జగన్ గ్రహించడం లేదు. కాదు కాదు అంగీకరించడం లేదు.

విభజిత ఆంధ్రప్రదేశ్ లో తొలి ఐదేళ్లు చంద్రబాబు పాలనను, మలి ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూసుకుని మరీ, రాష్ట్రం బాగుండాలంటే, జగన్ విధ్వంసం నుంచి కోలుకుని ప్రగతి బాట పట్టాలంటే చంద్రబాబు పాలన ఒక్కటే మార్గమన్న కృత నిశ్చయంతో , చంద్రబాబును ను గెలిపించుకోవాలన్న పట్టుదలతో, అలాగే జగన్ ను గద్దె దింపాలన్న కసితో పోలింగ్ బూత్ లకు వెల్లువెత్తారనీ తేటతెల్లమైనా దానికి అంగీకరించి, తప్పులు ఒప్పుకుని పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలన్న ఉద్దేశం జగన్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు. పైగా తానేదో తన జేబులో డబ్బులు ఇచ్చినట్లు సంక్షేమం అంటే వేలకు వేల రూపాయలు బటన్ నొక్కి పందేరం చేసినా జనం ఎందుకు ఓట్లు వేయలేదని నెపం వారిపైనే నెట్టేస్తున్నారు. అలాగే గతంలో తాను గట్టిగా సమర్ధించిన ఈవీఎంలే తన ఓటమికి కారణమని చెప్పుకుంటున్నారు.  

జగన్ ఓటమికి కారణాలేమిటి అన్న దానిపై పరిశోధనలు, విశ్లేషణలు అవసరం లేదు. చాలా సింపుల్.. రాష్ట్ర విభజన  తరువాత గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు ప్రజలు చెరో  అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ   పార్టీల పాలనను ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు పనితీరును, అలాగే జగన్   పనితీరును గమనించారు. దీంతో  అధికారం ఎవరికి ఇవ్వాలి.. మరోసారి సీఎంగా ఎవరు కావాలి అనేది జనం నిర్ణయించుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్రాంతాలు,  సామాజిక వర్గాలు, యువత, వయోవృద్ధులు అన్న తేడా లేకుండా జనం దాదాపుగా ఏకాభిప్రాయానికి వచ్చేశారు.  ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన తరువాత  ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం, తాము బాగుంటాము అన్న విషయంలో వారిలో కన్ఫ్యూజన్ అన్నది ఇసుమంతైనా కనిపించలేదు.  అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత, సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా  అన్ని అంశాలలో జగన్ పాలనను, చంద్రబాబు పాలనతో పోల్చి చూసి జగన్ ను తిరస్కరించారు. 

గత ఐదేళ్లలో అరకొర సంక్షేమం తప్ప అభివృద్ధి అన్న మాటకు అర్ధమే లేకుండా, అసలా పదమే వినపడకుండా పాలన సాగించిన జగన్ ను జనం ఛీకొట్టారు. జగన్ పాలనలో కొత్త పరిశ్రమ మాట అటుంచి... ఉన్న పరిశ్రమలే రాష్ట్రం వదిలి పారిపోయిన పరిస్థితిని గమనించిన జనం.. రాష్ట్రం బాగుండాలంటే.. తమ బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావలసిందేనన్న కృత నిశ్చయానికి వచ్చేశారు. అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం కూటమికి అంత అనుకూలంగా వచ్చాయి. ఆ ఫలితాలు జనాభిప్రాయానికి పట్టం కట్టాయి. 

సరే ఆ విషయాన్ని గ్రహించడానికి జగన్ సిద్ధంగా లేరు. అది ఆయన ఇష్టం. కానీ తన ఐదేళ్ల పాలనలో అధికారాన్ని అడుపెట్టుకుని వైసీపీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి సాగించిన అవినీతిపై, అధికార మదంతో పాల్పడిన అక్రమదందాలు, అడ్డగోలు దాడులు, దౌర్జన్యాలపై ఇప్పుడు తెలుగుదేశం కూటమి చర్యలకు ఉపక్రమించింది. అది సహజం కూడా. అవినీతికి పాల్పడిన, నేరాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఉండాలి కూడా. అలా తెలుగుదేశం కూటమి సర్కార్ చర్యలకు పాల్పడుతుంటే జగన్ మాత్రం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈవీఎంలను ధ్వంసం చేసి అరెస్టై జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యేను పరామర్శించి, ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడన్నంత బిల్డప్ ఇచ్చారు. గతంలో ఓదార్పు యాత్రలు చేసిన జగన్ ఇప్పుడు జైలు యాత్రలు చేస్తున్నారు. అది ఆయన ప్రాధాన్యత. 

మరో వైపు  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ చంద్రబాబు పర్యటనల మీద పర్యటనలు చేస్తున్నారు. పోలవరం, అమరావతిలలో పర్యటించిన చంద్రబాబు జగన్ అసమర్థ పాలన, అహంకార వైఖరి కారణంగా ఆ రెండింటి విషయంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడమే కాకుండా.. ఆ రెండింటి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎండిపోతున్న కృష్ణా డెల్టాకు పట్టిసీమద్వారా నీటిని అందించి ఆదుకోవడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అదే సమయంలో జగన్ హయాంలో గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు.   బీపీసీఎల్ సంస్థ ఏపీలో 60 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు బందర్ ఎంపీ బాలశౌరి తెలిపారు. మచిలీపట్నం కేంద్రంలో ఈ సంస్థ ఏర్పాటు కానున్నది.   జగన్ సర్కార్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో కనీసం ఒక్కటంటే ఒక్క కొత్త పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయింది.  సరికదా రాష్ట్రంలో ఉన్న జాకీ, అమర్ రాజా, లూలూ వంటి సంస్థలను తరిమేసింది.  

అదే చంద్రబాబు అధికార పగ్గాలు అందుకున్న నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు బాటలు పరిచారు. దీంతో జనం జగన్ జైలు ములాఖత్ లలో బిజీబిటీగా ఉన్నారు. ఆయన ప్రాధాన్యత అది.  చంద్రబాబు  రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తూ, పారిశ్రామిక వేత్తలతో భేటీలతో  క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఈయన దార్శనికత ఇదీ అని నెటిజనులు పోల్చి చూపుతూ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. 

By
en-us Political News

  
రోజుల వ్యవధిలో రాష్ట్రంపై దాడి చేసిన అర్నాబ్, మురసు తుపానులను ఎదుర్కొనడంలోనూ చంద్రబాబు వినూత్న  ఆలోచనలు, వేగవంతమైన నిర్ణయాలు ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.   ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం ద్వారా ఆయన తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. 
2019 ఎన్నికలు, ఆ తరువాత 2021 స్థానిక ఎన్నికలలో తిరుగులేని విజయాలను దక్కించుకున్న వైసీపీ, ఆ తరువాత 2024 ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయానికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా జరిగిన మునిసిల్, పరిషత్ ఎన్నికలలో కూడా ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైంది.
రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తి.. రాష్ట్రంలో మాత్రం వారిని ఒక రోజే, మహా అయితే రెండు రోజులకు మించి మకాం వేయరు. ఇలా వచ్చి అలా బెంగళూరు వెళ్లిపోతుంటారు.  
ఈ ఎన్నికల సంగ్రామంలో ఒకప్పుడు రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహించిన కాంగ్రెస్ పార్టీ  సోదిలోకి కూడా కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మౌనంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో జగన్ కు తేరుకోలేని పరాభాం ఎదురైంది. వైనాట్ 175, వైనాట్ కుప్పం నినాదాలు మరుగున పడిపోయాయి. సొంత అడ్డా పులివెందులలో జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గింది. కడప జిల్లాలోనూ పలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి వశమయ్యాయి. అలా   2024 ఎన్నికల్లో   జగన్ పార్టీ ఊహించని విధంగా ఘోర ఓటమిని చవిచూడటమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
గతంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన అమిత్ షా తన తాజా పర్యటనలో మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల పదును తగ్గించారు. ఇందుకు కారణం తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ అవసరం కోసం తన సింగిల్ నినాదాన్ని మడిచి జేబులో పెట్టుకుని ఇండియా కూటమితో కలిసి నడవడానికి రెడీ అయిపోయారు.  జాతీయ స్థాయిలో వైసీపీ వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ బాహాటంగా స్పష్టత ఇవ్వని జగన్.. లోపాయికారీ మద్దతు మాత్రం మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికే ఇస్తూ వచ్చారు.
కాగా కేటీఆర్ మారిన ధోరణి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మారారా? గతంలో తాను చేసిన విమర్శలు మరిచారా అన్న చర్చ జరుగుతోంది. ఏపీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ జగన్ తో మైత్రి కంటే.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకీ దగ్గరవ్వడమే తెలంగాణలో బీఆర్ఎస్ కురాజకీయంగా ఒకింత మేలు జరుగుతుందన్నభావనతోనే కేటీఆర్ స్వరం మార్చారని పరిశీలకులు అంటున్నారు.  
పులివెందుల, కడప వంటి చోట్ల వైపీపీని ఎంత అధికార పార్టీ అయినా తెలుగుదేశం అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇది అందరికీ తెలిసిన సత్యమే అయినా ఏకగ్రీవం అన్న సాంకేతిక కారణాన్ని చూపి వైసీపీ అధికార దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది.
దర్యాప్తు సంస్థల నుంచి కేంద్ర ఎన్నికల సంఘంవరకూ అన్నిటిపైనా ప్రజా విశ్వాసం ఒకింత మసకబారింది. రాజ్యంగ సంస్థల విశ్వసనీయత దెబ్బతింది. పార్లమెంటు,  , ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు పట్ల ప్రజలలో అసహనం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
తాజాగా స్థానిక ఎన్నికల వేళ  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తీరు, దూకుడు పట్ల పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  పార్టీ   నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలు సోషల్ మీడియాలో ప్రతికూల ప్రచారానికి దోహదం చేస్తున్నాయి.  ముఖ్యంగా, జనసేన పార్టీకి చెందినవిగా చెప్పుకునే కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీసే పోస్టులు కనిపించడం సంచలనం సృష్టిస్తోంది.  
ఆ రెబల్స్ ను పోటీ నుంచి ఉపసంహరింప చేసుకునేలా బుజ్జగించడమో, హెచ్చరించడమో చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం, జనసేన అధినాయకత్వంపై ఉంది. అది పొత్తు ధర్మం కూడా. కానీ ఈ పొత్తు ధర్మాన్ని పాటించే విషయంలో తెలుగుదేశం మాత్రమే ముందుకు వచ్చింది. జనసేన నుంచి పొత్త ధర్మం పాటిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.