కోరంగి మహా విషాదం: సైక్లోన్ పదం పుట్టుకకు మూలం.!

Publish Date:Nov 1, 2026

Advertisement

ప్రకృతి వైపరీత్యాలను సూచించడానికి మనం నిత్యం వాడే  సైక్లోన్  అనే పదం వెనుక ఒక మహా విషాద చరిత్ర ఉంది. మనసు బరువెక్కే బాధామయ గాథ ఉంది. సైక్లోన్ పదం పుట్టుక వెనుక లక్షల మంది కన్నీళ్లు, ఒక మహానగర వినాశనం ఉంది.   ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని కుదిపేసిన ఒక మహా విపత్తు తుపానుల విషాదాలను, విలయాలను కళ్లకు కట్టేలా సైక్లోన్ పదం పుట్టింది. ఆ మహా విషాదమే   ప్రపంచానికి సైక్లోన్ పదాన్ని  పరిచయం చేసింది.

 18వ శతాబ్దంలో కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి  ప్రాంతం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన  అంతర్జాతీయ రేవుపట్నంగా వెలుగొందింది. నాటి కాలంలో డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ దేశాల నుంచి భారీ నౌకలు ఇక్కడికి వచ్చి వాణిజ్య లావాదేవీలు నిర్వహించేవి. బర్మాలో స్థిరపడిన తెలుగువారిని సైతం నాటి రోజుల్లో  కోరంగీలు  అని పిలిచేవారంటే ఆ రేవు ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. విదేశీ నౌకలతో ఎల్లప్పుడూ కళకళలాడే ఆ ప్రాంతానికి అప్పట్లో   వాణిజ్య విశిష్ఠ గుర్తింపు ఉండేది. 

 1839 నవంబర్ 25 అర్ధరాత్రి సమయంలో బంగాళాఖాతంలో ఊహించని రీతిలో ప్రళయం ముంచుకొచ్చింది. నిద్రపోతున్న కోరంగి నగర ప్రజలపైకి ప్రకృతి  ప్రళయరూపం దాల్చి విరుచుకుపడింది.  సముద్రం నుంచి ఏకంగా నలభై అడుగుల ఎత్తున ఎగిసిపడిన రాకాసి అలలు కోరంగిని ముంచేశాయి. క్షణాల వ్యవధిలో వేలాది ఇళ్లు నీట మునిగి నేలమట్టం కాగా, లంగరు వేసి ఉన్న భారీ ఓడలు కొట్టుకుపోయాయి. ఈ మహా విలయంలో దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారేసరికి ఆ ప్రాంతమంతా శవాల దిబ్బగా మారింది. మ్యాప్ నుంచే కోరంగి అనే పేరు  తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కరాత్రి వ్యవధిలో శతాబ్దాల నాగరికత సముద్ర గర్భంలో కలిసిపోయింది.  ఈ ఘోర విషాదాన్ని కళ్లారా వీక్షించిన నాటి బ్రిటిష్ అధికారి హెన్రీ పిడ్డింగ్టన్.. ఆ మహా విపత్తుకు సైక్లోన్ అని పేరు పెట్టారు. 

ఆ పెను ఉప్పెన సమయంలో పాములా చుట్టలు చుట్టుకుంటూ విరుచుకుపడిన ఆ బలమైన సుడిగాలి తీవ్రతను పరిశీలించిన ఆయన, గ్రీకు భాషా పదం ఆధారంగా ఆ విపత్తును  సైక్లోన్ గా పిలిచారు. అదే ఇక తుపానులకు పర్యాయపదంగా మారిపోయింది.  అలా ఆంధ్రప్రదేశ్ తీరంలో సంభవించిన ఒక పెను విషాదం ద్వారా సైక్లోన్ పదం పుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలోకి వచ్చిది.  నాటి కోరంగి ప్రాంతం నేడు కాలగర్భంలో కలిసిపోయినా, చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అయితే అదే తీరప్రాంతంలో కాలక్రమేణా ప్రకృతి తనదైన రీతిలో రక్షణ వలయాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మడ అడవులు   విస్తరించి ఉన్నాయి.   సునామీ వంటి విపత్తుల సమయంలోనూ ఈ దట్టమైన అడవులే కాకినాడ తీరాన్ని కాపాడినట్లు నిపుణులు చెబుతుంటారు.

[Cyclone Word Origin History, Korangi, Tragedy, Henry Piddington, Cyclone Name, 
Andhra Pradesh, Historical Storms, Telugu One] 

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.