ఇండియాకు చమురు సెగ.!

Publish Date:Aug 24, 2026

Advertisement

 పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్, అమెరికా యుద్ధం ప్రభావం ఇండియాపై తీవ్రంగా కనిపిస్తున్నది.   గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతుండటంతో.. ఆ ప్రభావం ఇండియాపై పడుతోంది.  సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.  ఇంధన ధరలు పెరగడం వల్ల రవాణ  రంగానికి అయ్యే ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా చుక్కలను తాకుతున్నాయి.

పశ్చిమాసియాలో ఫిబ్రవరి నెల నుంచి కొనసాగుతున్న  ఉద్రిక్తతల ప్రభావం  చమురు విపణిపై భారీగా పడింది. ఒక దశలో భారత్ కొనుగోలు చేసే   క్రూడ్ ధర బ్యారెల్‌కు 69 డాలర్ల నుంచి ఏకంగా 113 డాలర్ల మార్కును దాటేసింది. ఆ తర్వాత కొంత వ్యవధి పాటు ధరల్లో కొంత స్థిరత్వం కనిపించినప్పటికీ, ఆగస్టు నాటికి మళ్లీ పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి.  బ్రెంట్ క్రూడ్ ధర  బ్యారెల్‌కు 90 డాలర్లకు పైగానే  ఉంది. 

ఈ  పరిణామాల ప్రభావం ఇండియన్  రిటైల్ ఇంధన మార్కెట్‌పై నేరుగా పడింది.  మే నెలలో పెట్రోల్ ,  డీజిల్ పై లీటరుకు సగటున రూ. 7.50 చొప్పున ధరలు పెరిగాయి. ఈ   పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.12కు, డీజిల్ రూ. 95.20కి చేరగా, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ రేట్లు అంతకంటే ఎక్కువ స్థాయిలో  ఉన్నాయి. 

డీజిల్ ధరల పెంపుతో రవాణా రంగానికి అయ్యే నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో  కూరగాయలు, పాలు, తృణధాన్యాలు, ఇతర ప్యాకేజ్డ్ నిత్యావసర వస్తువుల సరఫరా ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.  సరుకుల రవాణా ఖర్చు పెరగడంతో వ్యాపారులు కూడా ఆ భారాన్ని వినియోగదారులపైనే వేస్తున్నారు. ఫలితంగా రిటైల్ ద్రవ్యోల్బణం జులై లో ఏకంగా 4.45 శాతానికి ఎగబాకింది. 

దీంతో వేతన జీవులు,  దిగువ మధ్యతరగతి కుటుంబాలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదాయంలో మార్పు లేకపోవడం,   నెలవారీ గృహ బడ్జెట్‌లో సరుకులు, ప్రయాణ ఖర్చులు రెట్టింపు కావడంతో వారి ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది.   ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా నెలకొన్న  ఉద్రిక్తతలు తగ్గి, క్రూడ్ ఆయిల్ సరఫరా పునరుద్ధరిస్తే తప్ప చమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరిగి సామాన్యుడిపై భారం మరింత పడే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 

Crude Oil Prices Impact, Petrol Diesel Hike India, Essential Commodities Inflation, West Asia Crisis Fuel Rates, Hyderabad Fuel Prices

By
en-us Political News

  
 పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనలో నెలకొన్న పేటీ నేపథ్యంలో అధికారుల తొలగింపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్  సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్టు హల్ చల్ చేస్తోంది.
రాజస్థాన్ లోకల్ బాడీ ఎన్నికలలో ప్రతిపక్ష కాంగ్రెస్ అద్భుత ఫలితాలను సాధిస్తూ.. పరిశీలకులను విస్మయపరుస్తోంది.   జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ దూసుకుపోతుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్ర  కదలికలు, సిక్కిం గగనతలంలో చైనా యుద్ధ విమానం సంచారం వంటి పరిణామాలను చూపుతున్నారు. ఈ పరిణామాలు దేశ భద్రతా వర్గాల్లో   చర్చకు దారితీశాయి. 
వయోభారం,  ఇతర అనారోగ్య సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక  సైడ్ ప్లేయర్ గా మారిపోయిందని రాహుల్ చికాగో  వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు.  గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం..  ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని  విమర్శించారు.
మైసూరులో విలేకరుల సమవేశంలో మాట్లాడిన  వచ్చే ఎన్నికల బరిలో  తాను ఉండబోననీ, ఇది ఖాయమనీ కుండబద్దలు కొట్టారు. తన వయసు,   ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదన్నారు. 
జాతీయ జెండాను నేలపై ఉంచకూడదనే స్పృహతో దానిని   తన జేబులో దాచుకున్నారు. పక్కనే నిలబడి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  మోదీ చేసిన ఈ పనికి ముగ్ధులైన ట్రంప్, ఆ జెండా గుర్తును అలాగే భద్రపరుచుకోవాలని సూచించారు. 
 అమెరికా, చైనా వంటి దేశాలను వెనక్కి నెట్టి భారత ఆర్థిక వ్యవస్థ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  ఇన్ఫోఇన్‌డేటా నివేదిక ఈ విషయాన్ని విస్పష్టంగా పేర్కొంది.  అంతర్జాతీయంగా నెలకొన్న బాహ్య ఆర్థిక సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొంటూ భారత్ తన సత్తాను చాటుకుంటోంది.
కొద్ది రోజుల క్రితం కుల్గాం ప్రాంతంలో సీఆర్పీఎఫ్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనకు కొనసాగింపుగా భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు.  ఈ నేపథ్యంలోనే తారసపడిన ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు తెగబడటంతో, భద్రతా దళాలు దీటుగా స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. 
ఇటీవల కొన్ని రోజులుగా హస్తిన వాసులను ఉక్కిరి బిక్కిరి చేసిన వాయుకాలుష్య స్థాయిలు తగ్గుముఖం పట్టాయి. అలాగే పొగమంచు బెడద కూడా గణనీయంగా  తగ్గింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఇన్ని రోజులుగా ఉన్న నిబంధనలను అధికారులు తగ్గించారు. 
ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషుల శిక్షలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారికి బెయిల్ మంజూరు చేయడంపై బాధితురాలు బిల్కిస్ బానో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా, తన తరఫు వాదనలు వినకుండానే ఈ ఉత్తర్వులు వెలువడటం తనను విస్మయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.