రెడ్ల ఆధిపత్యానికి చెక్ పెడుతున్న సోనియా?

Publish Date:Apr 30, 2012

Advertisement

త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న 18 నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకే సామాజికవర్గానికి చెందిన వారినే ఎక్కువమందిని ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపికలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ రోజు కొత్తగా జరుగుతున్న వ్యవహారం కాదు, ఆరు దశాబ్దాలుగా జరుగుతున్నది. రాష్ట్ర జనాభాలో 7శాతం కూడా లేని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు శాసన సభ్యులుగానే కాకుండా ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు.

 

 

ఈ సామాజికవర్గ ఆధిపత్యాన్ని అధిగమించడం కోసం రాష్ట్రంలో మరో ముఖ్యమైన కమ్మ సామాజికవర్గం చేసిన ప్రయత్నాలు విఫలమై చివరకు తామే ఒక పార్టీ పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం వున్నా ద్వితీయశ్రేణి నాయకత్వానికే పరిమితం కావడంవల్ల విసుగుచెందిన కాపు సామాజికవర్గం కూడా చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగినా తెలుగుదేశంపార్టీలా విజయం సాధించ లేకపోయింది. అయితే వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణాంతర పరిణామాలలో చిరంజీవిని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడంతోపాటు కాపు సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలో కనీసం ద్వితీయ ప్రాధాన్యత కూడాలేదు.

 

 

జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన పార్టీగా భావిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ప్రాధాన్యత తగ్గిపోవడాన్ని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు భరించలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే బాధతో వీలున్న మేరకు రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో కూడా రెడ్డి సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇవ్వగా, ప్రస్తుతం ఉపఎన్నికలు జరగబోయే 18 నియోజకవర్గాలకు కూడా మెజారిటీ అభ్యర్థులను రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారినే ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిపాదించిన అభ్యర్థులలో మెజారిటీ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు వున్నారని, బిసి అభ్యర్థులు లేరా? అంటూ సోనియా వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో కనీసం నేతికైనా కాంగ్రెస్ పార్టీలో ఇతర సామాజికవర్గాల గురించి ఆలోచించడం పట్ల ఆ పార్టీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.