చంద్రబాబు ఉన్నచోట అవినీతికి చోటే లేదు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!

Publish Date:Sep 21, 2026

Advertisement

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున నీటి లభ్యత, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వాతావరణ పరిస్థితులు, నీటి సంరక్షణ, వ్యవసాయం, నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. నీటి కొరత ఉన్న పరిస్థితుల్లో వరి సాగు చేస్తే రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. నీటిని అధికంగా వినియోగించే పంటలకు బదులుగా మిల్లెట్లు, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. 

దీంతో రైతులకు ఆదాయంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, ప్రజలు, రైతులు సమష్టిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నీటి వనరులు పరిమితంగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటికి అనుగుణంగా పంటల విధానంలో మార్పులు తీసుకురావాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. 

కుప్పంలో త్వరలో ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మరో రెండు రైళ్లను కుప్పంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుప్పం-బెంగళూరు కొత్త రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పం నుంచి చిత్తూరు, తిరుపతికి నేరుగా రైలు సౌకర్యం కల్పించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. రహదారి, రైల్వే, విమానయాన సౌకర్యాలు మెరుగుపడితే కుప్పం ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలోని భూ సమస్యలపై కూడా చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. వచ్చే మార్చి నాటికి కుప్పంలో ఏ ఒక్కరికీ భూ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

రాజముద్రతో పట్టాదారు పుస్తకాలను అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా భూ రికార్డుల సంస్కరణ, కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ల జారీకి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.కుప్పం రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 2019-24 మధ్య కుప్పం ప్రాంతాన్ని రౌడీలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. తాను తన ఇంటికి వచ్చిన సమయంలో తనను అడ్డుకున్న ఘటనను తాను మర్చిపోలేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ చేసినట్లు తాను పేర్కొన్న ‘చంపడానికి, చావడానికి సిద్ధం’ వంటి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో ఇలాంటి భాష, హింసాత్మక వ్యాఖ్యలకు తావు ఉండకూడదని చెప్పారు. ‘రక్తాభిషేకం చేస్తాం’ వంటి మాటలు వినడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ఇది మంచి వాళ్లు ఉండే అడ్డా.. నేరస్థులకు చోటు లేదు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరాలకు పాల్పడేవారు తమకు అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లాలని, లేకపోతే ప్రజలే తరిమికొడతారని అన్నారు. ‘మీకు శాంతి కావాలా? రౌడీయిజం కావాలా?’ అంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు.తన పాలనలో అవినీతికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడ చంద్రబాబు ఉంటే అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి, మౌలిక వసతులు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని తెలిపారు. రాష్ట్రమంతా పర్యటిస్తూ రైతులను చైతన్యపరుస్తానని కూడా సీఎం పేర్కొన్నారు.

 

 

 

[ Chandrababu Naidu, N Chandrababu Naidu, Andhra Pradesh, AP Politics, Chandrababu Governance, Corruption Free Governance, Kuppam Tour, El Nino effect, Nara lokesh, Telugu One, Telugu News ]


                    

By
en-us Political News

  
ఎండల తీవ్రత, ఎల్ నినో ఎఫెక్ట్ తో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం  అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నీటి పొదుపు, సమర్థవంతమైన నీటి యాజమాన్య చర్యలను ప్రారంభించింది
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.