జగన్‌ కార్యాలయంగా మారిన చంచల్‌గూడ జైలు?

Publish Date:Aug 23, 2012

Advertisement

ఒక రిమాండు ఖైదీతో ప్రవర్తించినట్లు చంచల్‌గూడజైలు అధికారులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్మోహనరెడ్డితో ప్రవర్తించటం లేదు. నిబంధనల ప్రకారం అనుమతించాల్సిన ములాఖత్‌ల కన్నా అదనంగానే ఆయనకు జైలు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా విఐపి ఖైదీలందరి లోనూ జగన్‌ను ప్రభుత్వ అతిధిగా చూసుకుంటున్నారు. ఆయన కోరిన తిండి సదుపాయం కల్పిస్తున్నారు. అలానే జ్యూస్‌లూ అందిస్తున్నారు. కొత్తగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కాలుమోపాలనుకునే వారికి చంచల్‌గూడాజైలులో ముందు వరసలో ములాఖత్‌ కల్పిస్తున్నారు. అసలు రోజుకు ఎన్ని ములాఖత్‌లు జరిగినా జైలు అధికారులు ఆయనను ఇష్టపడి మరీ అవకాశం కల్పిస్తున్నారు. ఎవరో అన్నట్లు సేవ చేయవచ్చు కానీ, బానిసచాకిరీలు ఎందుకు అని ఎవరన్నా కూడా జైలు అధికారులు స్పందించటం లేదట. ఇప్పటికే రోజూ ఈ జైలుకు వచ్చే వాహనాల సంఖ్య పెరిగిపోతోందని, ఒక్కోసారి ట్రాఫిక్‌ సమస్య కూడా ఎదుర్కొంటున్నామని పోలీసులు చెబుతున్నారు. కానీ, జైలు అధికారులు మాత్రం ములాఖత్‌ల సంఖ్య పెంచటానికి వీలులేదన్న కోర్టు తీర్పునూ బేఖాతరు చేస్తున్నారు. రోజూ జగన్‌ను కుటుంబసభ్యులు, అభిమానులు, కొత్తగా పార్టీలో చేరాలనుకున్న వారు కలుస్తున్నారు. చంచల్‌గూడ జైలు బయట నుంచి చూసేవారికి ఆ జైలు జగన్‌ కార్యాలయమా అనే అనుమానం వస్తోంది.

By
en-us Political News

  
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్‌ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.