Publish Date:Aug 24, 2012
మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారంపై అధిష్ఠానం వెంటనే తన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆయన రాజీనామాను ఇప్పటికే ఆమోదించి ఉండాల్సిందని అధిష్ఠానం ఆభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన సీఎం కిరణ్ కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోనీలతో అరగంట చొప్పున సమావేశమయ్యారు.
రాత్రి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌తో గంటన్నరపాటు, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా భేటీ అయ్యారు. శుక్రవారం ఆయన సోనియా, ప్ర«ధాని మన్మోహన్‌లను కలుసుకోనున్నారు. ధర్మాన రాజీనామా వ్యవహారంపై పార్టీ పెద్దలందరికీ కిరణ్ వివరణ ఇచ్చారు. "మంత్రులు ఆరోపణలు ఎదుర్కోవటం ఒక ఎత్తు. విచారణ సంస్థ ఏకంగా అభియోగాలు నమోదు చేయడం ఒక ఎత్తు.
ధర్మాన రాజీనామా చేయటాన్ని పార్టీ, ప్రభుత్వం స్వాగతించాలి'' అని కోర్ కమిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రిని కూడా కేబినెట్‌లో కొనసాగిస్తే, అవినీతి ప్రభుత్వం అన్న ముద్ర పడుతుందని... అలా జరగటం పార్టీకి కూడా మంచిది కాదని హితవు పలికారు. ఈ నేపథ్యంలో ధర్మాన రాజీనామాను ఆమోదించాలని ఆజాద్, అహ్మద్ పటేల్ సీఎంకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dharmana-prasada-rao-resigns-24-16804.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!