Publish Date:Aug 23, 2012
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి తాజాగా పీసిసి చీఫ్ అయ్యే అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అఖిలభారత కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. అయితే అందరూ మాత్రం పీసిసి కళ్లాలు చిరంజీవికి అప్పగిస్తే మటుకు కేంద్రమంత్రి పదవి గురించి మర్చిపోవాలన్న విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది. జోడు పదవులు ఇస్తే రాజ్యసభలో రాష్ట్ర అంశాలపై చిరంజీవి రగడ చేసే అవకాశాలున్నాయని నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండుస్థానాల్లోనూ మాజీ పీఆర్పీనేతలు ఉండటంతో చిరంజీవి తన వాచాలతను ప్రదర్శించారని సోనియా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎక్కువ అవకాశాలు కల్పిస్తే తమను చిరంజీవి లెక్కచేయకపోవచ్చనే ఢల్లీ నేతలు సోనియాతో చర్చిస్తున్నారు. అయితే మేడమ్ దృష్టిలో చిరంజీవికి పీసిసి అప్పగించాలని ఉందని, అందుకే చర్చను ఇంకో రోజు పొడిగించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారని తెలుస్తోంది. ఒకవేళ చిరంజీవి కాకపోతే సౌమ్యంగా పార్టీని నడపగల నేతల జాబితానూ ఎఐసిసి పరిశీలిస్తోంది. దానిలో మంత్రి కన్నాలక్ష్మినారాయణ, జెసి దివాకరరెడ్డి పేర్లు కూడా ఉన్నాయి. అలానే తెలంగాణా ప్రాంతం నుంచి మంత్రి జానారెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణా గొడవలను అదుపు చేయటానికి జానారెడ్డికి పీసిసి చీఫ్ ఎందుకు ఇవ్వకూడదని ఆలోచించాలని రాష్ట్రం నుంచి సూచనలు వెళ్లాయి. ఏమైనా ఇంకో రెండు రోజుల్లో కొత్తచీఫ్ పేరును ఎఐసిసి ప్రకటించనున్నది. అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, జార్కండ్ రాష్ట్రాల పీసిసి చీఫ్‌లు కూడా మారుతారని తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/if-chiranjeevi-gets-pcc-chief-post-cabinet-minister-post-will-not-be-given-24-16801.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.