వాట్ ఏ కామెడీ బొత్సా...నువ్వు కూడా ఇలా..!

Publish Date:Nov 24, 2017

Advertisement


నంది అవార్డులపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ అవార్డులపై పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే స్పందించి... ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అవార్డుల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఇక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినందుకు గాను మంత్రి లోకేశ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఇక లోకేశ్ వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే రేపాయి. లోకేశ్ వ్యాఖ్యలపై స్పందించిన పోసాని అయితే.. సంచలన వ్యాఖ్యలే చేశాడు. ఇప్పుడు అందరూ అయిపోయారు నా వంతు అన్నట్టు... బొత్స కూడా ఇప్పుడు రెడీ అయ్యాడు. తానేదో ఉత్తముడిని అన్నట్టు లెక్చర్లు ఇస్తున్నాడు. లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి.. లోకేశ్ మదంతో, అహంభావంతో మాట్లాడుతున్నారని.. అన్నాడు. అంతేకాదు.. అక్కడితో ఆగకుండా.. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే ఏపీలో ఆధార్ కార్డు అడుగుతారా..? ఏపీలో కార్డులు ఉన్నవారే జ్యూరీలోకి తీసుకున్నారా..? అంటూ ప్రశ్నించాడు.  ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని..పంచభూతాలను ప్రభుత్వ నేతలు దోచుకు తింటున్నారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్ వ్యవహారంలో ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాక మంత్రి అశోక్ గజపతి రాజులు దోచుకుతింటున్నారని మైక్ ముందు ఓ రెచ్చిపోయాడు.

 

అంతే లోకేశ్ వ్యాఖ్యలేమో కానీ.. లోకేశ్ పై బొత్స చేసిన వ్యాఖ్యలు మాత్రం మాంచి కామెడిగా ఉన్నాయి అనుకుంటున్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.. దోచుకోవడం గురించి బొత్స నే మాట్లాడాలి మరి అంటున్నారు. అసలు బొత్సా బ్యాక్ గ్రౌండ్ కి, బొత్సా చేసిన నిర్వాకాలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఏమైనా సంబంధం ఉందా? అని అంటున్నారు పలువురు. వైఎస్ హయాంలో అందినకాడికి దోచుకొన్నారు..మీకు ఎన్ని బినామీలు ఉన్నాయో తెలుసు, సినిమాలు, ఛానెళ్లు, ఇసుక దందాలు, మద్యం సిండికేట్లు అబ్బో ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందుకే అన్నా బొత్సన్నా.. లోకేశ్ గురించి మాట్లాడేముందు.. నీ గురించి ఒక్కసారి ఆలోచించుకో అన్నా అని పులువురు కౌంటర్లు వేస్తున్నారు. ఏంటో మరి మైక్ చూస్తే సత్తిబాబు నోరు పాపం కంట్రోల్ లో ఉండదేమో..

By
en-us Political News

  
ఇంతకీ స్థానిక ఏకగ్రీవాలపై ఆయన చేసిన హెచ్చరికలేంటని ఓ సారి చూస్తే..  స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు జరిగితే ఆయా నియోజకవర్గాల ఇంచార్జిలకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించబోనని జగన్ స్పష్టమైన  హెచ్చరిక జారీ చేశారు.   ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఈ నిబంధనను స్వయంగా ఆయన సొంత నియోజకవర్గంతో పాటు పార్టీ సీనియర్ నేతలకే  ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. 
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.