కోమటిరెడ్డి సోదరులకు కష్టకాలం
Publish Date:May 7, 2012
Advertisement
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పార్టీనాయకుల మధ్య కలహాలు కార్యకర్తలకు తీవ్రకలవరాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యనాయకులు ఎవరికీ వారే యనునాతీరే అన్నట్లు ఉండటంతో జిల్లా పార్టీశ్రేణుల్లో నిరాశ వ్యక్తమవు తోంది. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాలుగైదు గ్రూపులుగా విడిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదరరెడ్డి, ఉప్పునూతల పురుషోత్తమరెడ్డి మధ్య నాలుగుస్తంభాలాట నడుస్తోంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కోమటిరెడ్డి సోదరులు ఒకవైపు, మిగతావారంతా మరోవైపు చేరారు. వై.ఎస్. సిఎంగా ఉన్నంత కాలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కాంగ్రెస్ ను శాసించారు. కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. గత ఐదేళ్ళుగా స్తబ్దంగా ఉన్న ఉత్తమకుమార్ రెడ్డికి మంత్రి పదవి రావటంతో ఆయన మళ్ళీ కోమటిరెడ్డి వ్యతిరేకులను ఏకం చేస్తున్నారు. ఈ వ్యతిరేక వర్గం కార్యక్రమాలతో కొమరితెద్ది సోదరులు ఇబ్బందులకు గురవు తున్నారు. దీనికి తోడు ఉప్పునూతల పురుషోత్తమరెడ్డికి, చక్కిలం శ్రీనివాసరావుకు, ఉప్పునూతల-జానారెడ్డికి, జానారెడ్డికి-కోమటిరెడ్డికి ఇలా ఒకరంటే ఒకరికి ఏమాత్రం పడని పరిస్థితి ఉంది. వీటితో పాటు పాల్వాయిగోవర్థనరెడ్డి మరో గ్రూపును పెంచి పోషిస్తున్నారు. నాయకులు పరస్పరం కలహించుకుంటూ పార్టీని బలహీనపరుస్తుండటంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఇప్పటికీ జిల్లా అధ్యక్ష సారథ్య బాధ్యతలను పూర్తిస్థాయిలో ఎవరికీ అప్పగించకుండా ఇన్ ఛార్జితో నెట్టుకోస్తున్నారు. డిసిసి అధ్యక్షుని నియామకంపై కూడా ఈ నాయకుల మధ్య ఏకాభిప్రాయం ఏమాత్రం కనిపించటం లేదు. అగ్రనాయకుల మధ్య సయోధ్య లేకపోవటం, ఒకరి ఆధిపత్యానికి మరొకరు గండికొట్టే చర్యలతో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోంది.
http://www.teluguone.com/news/content/bad-time-for-komatireddy-brothers-in-nalgonda-district-24-13886.html





