ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ఉన్న 12 గ్రామాలు అనాథలుగా మారాయి. ఈ గ్రామాలు మాకు చెందాలంటే కాదు మాకు చెందాలంటూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు ఎక్కాయి. 15 ఏళ్ళుగా ఈ కోర్టుకేసు ఒక కొలిక్కి రాలేదు. కేసు కోర్టులో ఉండటంతో ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ఆ గ్రామాలు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ తాగునీటికి సైతం నోచుకోక అల్లాడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది. గత 15 ఏళ్ళుగా ఈ 12 గ్రామాలకు అటు మహారాష్ట్ర అధికారులు కానీ, ఇటు ఆంద్ర అధికారులు కానీ వెళ్ళటం లేదు. వారికి రేషన్ కార్డులు కానీ, ఇతర సదుపాయాలూ కానీ లభించటం లేదు. గ్రామాల్లో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి.
ఈ గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అమలు కాకపోవటంతో గ్రామస్థులు మైళ్ళ తరబడి కాలినడకన ఇతర ప్రాంతాలకు వచ్చి నీటిని తీసుకువెళ్ళాల్సి వస్తోంది. గ్రామంలో నీరు, రహదారులు లేకపోవటంతో మిగిలిన ప్రాంతంలో వీటికి సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లోని యువతీ, యువకులకు పెళ్ళిళ్ళు కావటం కూడా కష్టంగా మారింది. 15 ఏళ్ళుగా తమ గోడును ఎవరూ పట్టించుకోవటం లేదనీ, తమ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా మారిందని ఈ 12 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-maharashatra-border-24-13885.html
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!
సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు.