జగన్ పిటిషన్ మళ్లీ డిస్మిస్.. ఈసారి హైకోర్టు డివిజన్ బెంచ్.!
Publish Date:Oct 19, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, యు భద్రతా ఏర్పాట్ల అంశంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు మళ్లీ డిస్మిస్ చేసింది. స్థానిక ఎన్నికల కోసం రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్.. డిస్మిస్ చేయడాన్నిసవాల్ చేస్తూ జగన్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించగా, డివిజన్ బెంచ్ కూడా ఈ పిటిషన్ ను డిస్మిస్ చూస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాష్ట్రంలో సరిపడా పోలీసు బలగాలు ఉన్నాయని ఈ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో భద్రతా భయాలు వ్యక్తమవుతున్నాయని, స్థానికఎన్నికలు సజావుగా సాగేందుకు కేంద్ర బలగాల రక్షణ అవసరమని కోరుతూ జగన్ కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ అంశంపై గతంలో విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ధర్మాసనం కేంద్ర బలగాల మోహరింపు అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌ను తాజాగా పరిశీలించిన డివిజన్ బెంచ్, దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ఎలాంటి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ సోమవారం(అక్టోబర్ 19) విస్పష్ట తీర్పు వెలువరించింది. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, ఎన్నికల సంఘం పర్యవేక్షణలో స్థానిక పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా విధులు నిర్వహించగలదని న్యాయస్థానం పేర్కొంది. ప్రతి చిన్న విషయానికి కేంద్ర బలగాలను రప్పించడం సాధ్యం కాదని, రాష్ట్ర పోలీసులే నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికలను సజావుగా ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి , పోలీస్ శాఖకు కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. [AP High Court Division Bench Dismiss Jagan Petition, Central Forces, Y CP Local Body Elections, TeluguOne. AP Politics]
http://www.teluguone.com/news/content/ap-high-court-division-bench-dismiss-jagan-petition-43-234815.html





