ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా నరసింహన్ కొనసాగింపు
Publish Date:Apr 10, 2012
Advertisement
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడేంత వరకూ నరసింహన్‌నే గనర్నర్‌గా కంటిన్యూ చేయాలనే తలంపుతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ అంశంతో పాటు త్వరలో జరగనున్న 18 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల నేపథ్యంలో నరసింహన్‌ను కొనసాగించాలన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా నరసింహన్ సోమవారం ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, హోంమంత్రి చిదంబరంలను కలుసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను వివరించడంతో పాటు వివిధ అంశాలపై సమగ్ర నివేదికలు అందించినట్లు సమాచారం. మద్యం సిండికేట్ల వ్యవహారం, తెలంగాణలో ఆత్మహత్యలు, వరుసగా చోటు చేసుకుంటున్న మత ఘర్షణలు తదితరాలపై వారితో చర్చించినట్లు తెలిసింది. చిదంబరంతో భేటీ అనంతరం నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌గా తన పదవీ కాలాన్ని పొడిగించే అంశంపై చిదంబరాన్నే అడగాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/ap-governor-narasimhan-24-13283.html





