జగన్ విదేశీ ఆస్తులపై సిబీఐ ఆరా, పలు దేశాలకు లేఖలు
Publish Date:Apr 10, 2012
Advertisement
వై.ఎస్. జగన్ పెట్టుబడులపై దర్యాప్తు చేస్తున్న సిబీఐ ఇప్పటిదాకా దేశంలో ఏ ఏ సంస్థలు, వ్యక్తులు ఎంతెంత పెట్టుబడులు పెట్టారు, ఆ పెట్టుబడులు నిబంధనలకు లోబడి జరిగాయా? లేదా అన్న విషయాలు పరిశీలించి ఛార్జ్ షీట్ కూడా తయారు చేసింది. ఇప్పుడు జగన్ సంస్థల్లోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడులపైన, విదేశాల్లో జగన్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఎక్కౌంట్ ల పైనా కేంద్ర దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతకాలతో కూడిన లేఖలను వర్జిన్ ఐలాండ్స్, మారిషస్. సింగపూర్, హాంకాంగ్, బ్రిటన్ లకు పంపారు. జగన్ కంపెనీల్లోకి ఆయా దేశాలనుంచి నిధులు వచ్చాయి. ఇలా నిధులు పంపిన వ్యక్తులు, సంస్థలు సరైనవేనా లేక బోగస్ వా అన్న వివరాలు తెలపాల్సిందిగా సిబీఐ తన లేఖల్లో ఆయా దేశాలకు సంబంధిత అధికారులను అభ్యర్థించింది. అలాగే జగన్, ఆయన కుటుంబ సభుఉల పేరా ఏమైనా ఆస్తులు కొనుగోలు చేసినట్టు సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని సిబీఐ కోరినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/foreign-investments-24-13284.html





