గలాటాకే అయితే... గల్లీలు చాలు... అసెంబ్లీ ఎందుకు?

Publish Date:Sep 10, 2016

Advertisement

చట్ట సభల్లో గొడవలు, ఆందోళనలు మామూలే. అఖరుకి మైక్ లు విరిచేయటాలు, పేపర్లు విసిరేయటాలు కూడా కామన్ అయిపోయాయి. కాని, ఏ రాష్ట్ర చట్టసభలో అయినా హంగామా చెలరేగటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. పార్లమెంట్లో కూడా పేప్పర్ స్ప్రే ఉదంతాలు అడపాదడపా జరుగుతూనే వుంటాయి. కాని, మన ఏపీ అసెంబ్లీ మరీ దారుణంగా తయారైంది. అప్పుడప్పుడు సభలో గందరగోళం కాదు అసలు సభే గందరగోళంగా నడుస్తోంది!

తెలంగాణ విభజనతో ఏర్పడ్డ నవ్యాంధ్ర అసెంబ్లీ ఏనాడూ ప్రశాంతంగా ముందుకు పోవటం లేదు. వాయిదాల మీద వాయిదాలు, వివాదాల మీద వివాదాలు... ఇంతే తప్ప ప్రజా సమస్యలు ఎంత మాత్రం పట్టింపులో వుండటం లేదు. మరో వైపు తెలంగాణ అసెంబ్లీ ఎంతో కొంత హుందాగా నడుస్తోంది. అక్కడా వెల్ లోకి వెళ్లటం లాంటివి జరుగుతూనే వున్నా ఆంధ్రా శాసన సభంత దయనీయంగా వుండటం లేదు! దీనికి కారణం ఏంటి? 

కేవలం తెలంగాణతో పోల్చుకోవటం కాదు అసలు మొత్తం దేశంలోనే మన ఆంధ్రా చట్టసభలంత గందరగోళంగా మరేక్కడ జరగటం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షమనే చెప్పాలి. అధికార పక్షానిది ఎలాంటి తప్పు లేదని ఏ ఒక్కరూ అనలేరు. కాని, టీడీపీ ప్రభుత్వం కాస్త ఆధిపత్యం చెలాయించినా ప్రజా సంక్షేమం కోసం ఓపిక పట్టాల్సిన ప్రతిపక్షం అంతకంతకూ మొండికేస్తోంది. లోపల స్పీకర్ సమక్షంలో, బయట మీడియా సమక్షంలో రెండు చోట్లా వైసీపీ ఎమ్మేల్యేలు నిప్పు తొక్కినట్లు చిందులేస్తున్నారు. పోని ఇదంతా జనం బాగు కోసమా అంటే అదేం కాదు. ప్రభుత్వం ప్రతి పక్షం కోరినట్టు చర్చ చేపట్టినా ఎవ్వరూ పెద్దగా గవర్నమెంట్ ను బోనులో నిలబెట్టింది ఏమీ వుండటం లేదు. ప్రతీసారి చర్చ జరిగినప్పుడు ఆంధ్రా అసెంబ్లీలో వినిపించే ఆరోపణ జగన్ కు తగినంత టైం ఇవ్వలేదు అని! కాదంటే అసలు మైకే ఇవ్వలేదని!

ప్రతిపక్షం నేతలు సభలో కూడా బహిరంగ సభల్లో మాట్లాడినట్టు తమకు తోచినంత సేపు మాట్లాడితే ఏ స్పీకర్ అయినా చర్యలు తీసుకోక తప్పదు. అప్పుడు ఇక ఆయన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు మన ప్రతిపక్షం వారు! ఆయన పక్షపాతం వహిస్తున్నారని రొటీన్ గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాని, తాము , తమ ప్రవర్తన ఎలా వుంటుందో విశ్లేషించుకోవటం లేదు!

అధికార పక్షంలో కూడా కొందరు నోటి దురుసు నేతలు వుండొచ్చు. కాని, ప్రతిపక్ష నేతలు పదే పదే ఉన్మాద చర్యలకు పాల్పడటం క్షమించరానిది. జనం కోసం ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం చేయాలిగాని... చంద్రబాబు వర్గాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా అరుపులు, కేకలు, విపరీత చేష్టలు, సైగలు... వీటి వల్ల అపోజిషన్ కే నష్టం! ఇతర రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ప్రతిపక్షం ఎలా పని చేస్తుందో కాస్త గమనిస్తే ఎంతో మంచిది. లేకపోతే ఇప్పుడు సంవత్సరం పాటూ, నెలల పాటూ సస్పెండ్ అవ్వటమే కాక వచ్చే ఎన్నికల్లో జనం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది! అప్పుడు అధికార పక్షం మమ్మల్ని సభలో మాట్లాడనీయలేదు అంటే ప్రజలు హర్షించరు. ప్రతిపక్ష ఎమ్మేల్యేలుగా మీరెంత కృషి చేశారు అన్నదే ఆలోచిస్తారు!
 

By
en-us Political News

  
ఎలాన్ మస్క్.. సోషల్ మీడియా వేదికగా..   ప్రియమైన ప్రధాని అంబానీ  అంటూ  షేర్ చేసిన పోస్ట్ పెను సంచలనంగా మారింది.  భారతదేశానికి నిజమైన బాస్ అంబానీయే అంటూ.. ఆ విషయాన్ని తాను గుర్తించలేకపోయానని, క్షమించమంటూ ఎలాన్ మస్క్ ఆ పోస్టులో తన వ్యంగ్య వైభవాన్నంతా కుమ్మరించారు.
తమ దారికి రాకపోతే ఇరాన్ ను ప్రపంచపటంలో లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించిన నోటితోనే నోబెల్ శాంతి బహుమతికి తన కంటే అర్హుడెవరున్నారని ప్రశ్నిస్తున్నారంటే ట్రంప్ ధైర్యానికి మెచ్చుకోవలసిందేనని అంటున్నారు.
కోనసీమ కంటే ఓ అడుగు ముందుకు వేసి పచ్చదనం, పారిశ్రామీకరణలో దేశంలోనే నంబర్ వన్ గా రాయలసీమ రూపుదిద్దుకోబోతోందని చంద్రబాబు ఘంటాపధంగా చెబుతున్నారు.
ఇక భీమిలిలో మరో ప్రధాన సవాలు కూటమి పార్టీల  బలం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉండటంతో, స్థానిక స్థాయిలో ఆ పార్టీల మధ్య ఉన్న సమన్వయం స్థానిక ఎన్నికల్లో వైసీపీకి తలనొప్పగా మారుతుందని అంటున్నారు.  
 డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో జనసేనాని పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణే ఈ వలసలకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం జనసేన శిబిరంలో ఆనందోత్సాహాలను, నూనత ఉత్తేజాన్నీ నింపుతుంటే, వైసీపీ శిబిరం డీలా పడుతోంది. ఆ పార్టీ నేతలు కార్యకర్తలలో నిరుత్సాహం, నిస్తేజం పెరుగుతోంది.  
సొంత నియోజకవర్గంలోనే పార్టీని కాపాడలేక బొత్స మల్లగుల్లాలు పడుతున్నారు. స్థానిక ఎన్నికల వేళ చీపురుపల్లి వైసీపీలో  మొదలై, కొనసాగుతున్న వలసలు ఆయన ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి.  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.