ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!

Publish Date:Nov 5, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పోరు తదుపరి దశకు రంగం సిద్ధమైంది.  ఇందులో భాగంగా  గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్  విడుదలైంది.   పల్లె సీమల్లో  పొలిటికల్ హీట్ ను అమాంతంగా పెంచేసే   గ్రామ పంచాయతీలకు   వేర్వేరు విడతల్లో   ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.  

పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా,  సజావుగా పూర్తి చేసేందుకు వీలుగా మూడు దశలలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు పేర్కొంది.  ఇందు కోసం దశలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ను నవంబర్ 13, రెండో విడత నోటిఫికేషన్ ను నవంబర్ 18న, ఒక  మూడో విడత నోటిఫికేషన్‌ను నవంబర్ 19వ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయనుంది. 

ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ సమయాలను కూడా అధికారులు   ఖరారు చేశారు. ప్రతి విడత పోలింగ్ రోజున ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం ఒంటి  గంట వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎండ తీవ్రతను, గ్రామీణ ప్రాంతాల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.

 అలాగే ఏ రోజుకారోజు పోలింగ్ ముగిసిన వెంటనే, ఓట్ల లెక్కింపు, ఆ తరువాత ఫలితాల వెల్లడి ఉంటుంది.  గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని ఎన్నుకునే ఈ ఎన్నికల  కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్లెలు సన్నద్ధమవుతున్నాయి. గ్రామాల్లో తమ పట్టును నిలుపుకోవడానికి,  స్థానిక నాయత్వాన్ని కైవసం చేసుకోవడానికి   రాజకీయ పార్టీలు, స్థానిక నాయకులు ఇప్పటికే  వ్యూహ, ప్రణాళికా రచనల్లో నిమగ్నమయ్యారు.  

ఇది కూడా చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికలు: కూటమి టార్గెట్ 94 పర్సంట్ స్ట్రైక్ రేట్.. దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.!

ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన తరుణంలో జిల్లాల యంత్రాంగాలు కూడా అప్రమత్తమయ్యాయి. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, బ్యాలెట్ బాక్సులు  సిద్దం చేయడం, అలాగే సిబ్బందికి తగిన శిక్షణనివ్వడం వంటి   ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతిభద్రతల పరిరక్షణకు  క చర్యలు తీసుకుంటున్నారు.

నోటిఫికేషన్లు వెలువడే తరుణం సమీపిస్తుండటంతో పల్లెల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్ ముగిసే వరకు ప్రతి దశలోనూ  ఎన్నికల నిబంధనలు అమలవుతాయని యంత్రాంగం హెచ్చరిస్తోంది. ఈ ఎన్నికల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు మరింత వేగవంతం అవుతాయని మరియు ప్రజల ఆకాంక్షలకు తగిన స్థానిక పాలన అందుతుందని స్థానికులు భావిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు: ఎంపీటీసీజడ్పీటీసీ పోలింగ్ : పులివెందుల మండలం ఎర్రిపల్లిలో బాంబు దాడులు, ఉద్రిక్తత.!

మురసు తుపాను నష్టాలపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.!

[AP Gram Panchayat Elections Schedule, AP Village Elections, Three Phases Polling, Panchayat Voting, Counting, Results, Telugu One]

By
en-us Political News

  
  4 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు  19 మున్సిపాలిటీలు నగర పంచాయతీలు ఉన్నాయి. గతంలో కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 
నష్టంపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. కేంద్రానికి సమగ్ర నివేదిక.!
హరిత మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.!
రాప్తాడు  ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి, బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో చెవిరెడ్డి నుంచుంటే మాస్, కూర్చుంటే మాస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకపక్ష అరాచకాలు, బెదిరింపు రాజకీయాలతో చెలరేగిపోయేవారు. అటువంటి   చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి.. పరిషత్ పోలింగ్ వేళ చుక్కలు చూపించారు పులవర్తి నాని సతీమణి పులవర్తి సుధారెడ్డి.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది.
కీలకమైన జడ్పీటీసీ స్థానాల్లో  వైసీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వీరు అనూహ్యంగా చివరి క్షణంలో పోటీ నుంచి వైదొలగడం వైసీపీకి తేరుకోలేని ఎదురుదెబ్బగా పరిణమించింది.  కడప జిల్లా మైదుకూరు,  అన్నమయ్య జిల్లా చిన్నమండెం జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి వైకాపా అభ్యర్థులు రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది.  
ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించాలని  పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించిపోయేలా  94 శాతం స్ట్రైక్ రేట్‌  దాటాలన్న టార్గెట్ నిర్దేశించారు.
పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తెలుగుదేశం  శ్రేణులకు, వైసీపీ కార్యకర్తలకు  వాగ్వాదం చెలరేగింది. క్షణాల వ్యవధిలో ఈ వివాదం  ముదిరి ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణ సందర్భంగా పెట్రోలు బాంబులతో దాడి జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 వేల721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ-2026 (ఏపీటీఆర్టి-2026)  నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
బాధితుడు మార్పూరి శ్రీరామ్   ఫిర్యాదు మేరకు.. తన భూమిని తన   పెద్దనాన్న కుమారుడు మార్పురి వెంకటేష్ కు 2023లో రాసిచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి,  డప జిల్లా పులివెందుల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కోనేటి సులోచన ఆ భూమిని  అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య చెలరేగిన ఆధిపత్య పోరు, ఘర్షణలు పలు గ్రామాల్లో భయాందోళనలకు గురిచేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్ల నియామకం, ఓటర్ల కదలికలు తదితర అంశాలపై ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర ఆరోపణలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ ఎన్నికల్లో మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల కోసం మొత్తం 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.