నెల్లూరు టీడీపీలో వర్గ విభేదాలు.. బీద రవిచంద్రపై మంత్రి ఆనం ఆగ్రహం.!

Publish Date:Oct 27, 2026

Advertisement

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, జిల్లా టీడీపీ అబ్జర్వర్ గుండి రాకేష్ వ్యవహారంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తూ, తనకు తెలియకుండానే జెడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు ఎలా అందజేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

జిల్లా టీడీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసే కార్యక్రమం సందర్భంగా ఈ వివాదం చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారి సూచనల మేరకు అభ్యర్థులకు బీ ఫారాలు ఎలా ఇస్తారని మంత్రి ఆనం ప్రశ్నించినట్లు సమాచారం. అలాంటి వ్యక్తులను పార్టీ కార్యాలయానికి ఎలా రానిస్తారంటూ తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

'ఇన్ని జరుగుతున్నా తలవంచుకుని పోతున్నా.. తల ఎత్తితే మీరు రాజకీయాలు చేయలేరు' అంటూ మంత్రి ఆనం వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఈ వ్యాఖ్యలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

జిల్లా రాజకీయాల్లో వర్గపోరుకు కారణం ఎవరు.?

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన దృష్టి సారించాలని మంత్రి ఆనం సూచించినట్లు సమాచారం. రాజకీయ వ్యవహారాలపై అవగాహన ఉన్న చంద్రమోహన్‌రెడ్డి వంటి నేతల నుంచి నేర్చుకోవాలంటూ హితవు పలికినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ టీడీపీలో విభేదాలు తలెత్తినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని అభ్యర్థిగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచించగా, బీద రవిచంద్ర మాత్రం వంటేరు వేణుగోపాల్‌రెడ్డికి మద్దతు తెలిపినట్లు ప్రచారం సాగింది. చివరకు వేమిరెడ్డి సూచించిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలిచినట్లు సమాచారం.

ఈ పరిణామాలు సద్దుమణగకముందే జెడ్పీటీసీ బీ ఫారాల పంపిణీ అంశం మరోసారి పార్టీలో చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని భావిస్తున్న కన్నబాబుకు బీద రవిచంద్ర ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, మంత్రి ఆనం దృష్టికి తీసుకురాకుండానే జెడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

టీడీపీకి నష్టం తప్పదా.?

జిల్లాలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, అభ్యర్థుల ఎంపికలో సమన్వయ లోపాలు, నేతల మధ్య విభేదాలు టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నాయకత్వం వర్గ విభేదాలను నియంత్రించకపోతే భవిష్యత్తులో రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే, ఈ వివాదంపై సంబంధిత నేతల అధికారిక స్పందనలు వెలువడాల్సి ఉంది.కాగా, జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

 

 

 

[ Anam Ramanarayana Reddy, Beeda Ravichandra, Gundi Rakesh, Nellore TDP, Nellore Politics, TDP Internal Disputes, TDP Group Politics, ZPTC Candidates, ZPTC B-Forms, Vemireddy Prabhakar Reddy, Polamreddy Srinivasulu Reddy, Vanteru Venugopal Reddy, Atmakur Politics, Andhra Pradesh Politics ]

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.