TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

వరల్డ్ హీరో: ఫ్లై దుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం.!

ప్రాణాలొడ్డి పోరాడి వందల మంది ప్రాణాలను కాపాడిన ఫ్లై దుబాయ్ విమానం పైలట్ కెప్టెన్ స్మిత మచ్చర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. గత నెల 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెడుతున్న ఫ్లైదుబాయ్ విమానం గాల్లో ఉండగా ఒమన్‌కు చెందిన కో పైలట్ హమామ్ అల్-హమామీ, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. విమానాన్ని కూల్చివేయాలనే దురుద్దేశంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ అనూహ్య దాడి కారణంగా రెండు నిమిషాల్లోనే విమానం 17 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు దిగిపోయింది. దీంతో వెంటనే హైజాకింగ్ డిస్ట్రెస్ సిగ్నల్ జారీ అయ్యింది. సహ పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా, కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. సర్వశక్తులు ఒడ్డి కాక్‌పిట్ డోర్‌ను అన్‌లాక్ చేశారు. దీంతో ఇతర ప్రయాణికులు లోపలికి దూసుకువచ్చి దాడికి పాల్పడిన కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్మిత్ మచ్చర్ ను వరల్డ్ హీరోగా అభివర్ణించారు. బెంజమిన్ నెతన్యాహు స్వయంగా కెప్టెన్ మచ్చర్‌కు ఫోన్ చేసి 9/11 తరహా పెను విపత్తును అసాధారణ ధైర్యంతో నివారించారని కొనియాడారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 'పవిత్ర జ్యోతిని వెలిగించాలని, నరేంద్ర మోదీతో పాటు కెప్టెన్ మచ్చర్‌ను ఆయన ఆహ్వానించారు. సాధారణంగా ఇజ్రాయెల్‌లో ఈ అత్యున్నత గౌరవం కేవలం ఆ దేశ పౌరులకు మాత్రమే దక్కుతుంది. ఈ ఫోన్ సంభాషణలో ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటానని వెళ్లిన సహ పైలట్ తన తల వెనుక భాగంలో గొడ్డలితో తీవ్రంగా కొట్టాడని మచ్చర్ తెలిపారు. తొలి దెబ్బలకే తన కంటిచూపు దాదాపుగా మందగించిందని, అయినప్పటికీ తనలో మిగిలిన చివరి శక్తిని కూడగట్టుకుని డోర్ వైపు దూసుకెళ్లి తెరిచానని వివరించారు. మచ్చర్ చూపిన సమయస్ఫూర్తి, పోరాట పటిమ ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని నెతన్యాహు ప్రశంసించారు. [Smith Macher, Benjamin Netanyahu, Indian Pilot, FlyDubai Flight, Israel Independence Day, Heroic Pilot,World Hero Telugu One]

Published on: Sun Oct 4, 2026 7:44AM

political-news-img

హీరో పైలట్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్.!

ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ఊహించని విపత్తు ముంచుకొచ్చిన వేళ, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ సాహసం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఈ అనూహ్య ఘటనలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చూపిన తెగువ అసాధారణమైనది. ప్రయాణ సమయంలో కో-పైలట్ ఒక్కసారిగా విమానం కాక్‌పిట్‌లో దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలపాలైనప్పటికీ, స్మిత్ మచ్ఛర్ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చాకచక్యంగా వ్యవహరించారు. విమానంలో మొత్తం 172 మందికి పైగా ప్రయాణికులు సిబ్బంది ఉండగా, వారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఆయన తీవ్ర రక్తస్రావమవుతున్నా కాక్‌పిట్ డోర్‌ను తెరిచి సకాలంలో సహాయం కోరారు. ఈ ప్రమాద సమయంలో విమానం కేవలం 30 సెకండ్ల వ్యవధిలో సౌదీ అరేబియా గగనతలంపై 14,000 అడుగులకు పైగా కిందికి పడిపోయినట్లు ఫ్లైట్ రాడార్ డేటా వెల్లడించింది. సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ కాగా, అక్కడ ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను మెరుగైన వైద్యం కోసం అబుదాబికి తరలించారు.ఈ సాహసోపేత చర్యను గుర్తించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ యూఏఈ ఉప ప్రధాని షేక్ హందాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా అబుదాబి ఆసుపత్రిని సందర్శించి కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి, తీవ్రమైన విపత్కర పరిస్థితులలోనూ ఆయన చూపిన అత్యున్నత స్థాయి ధైర్యం, బాధ్యతాయుత ప్రవర్తనను కొనియాడారు. మానవ జీవితాలపై ఆయన చూపిన అంకితభావాన్ని ప్రశంసిస్తూ, యూఏఈ నాయకత్వం తరఫున పూర్తి కృతజ్ఞతలు ప్రశంసలు తెలియజేశారు. "మా బందంలో ఆయన భాగం కావడం మాకెంతో గర్వకారణం, మా దేశ చరిత్రలో ఆయన ఒక భాగం, అలాగే శాంతి, కరుణ, మరియు జీవన విలువలకు ప్రతీకగా నిలిచే మా దేశ ఆదర్శాలకు ఆయన నిలువెత్తు రూపం" అని షేక్ హందాన్ తన అధికారిక ప్రకటనలో మరియు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన సమయంలో స్మిత్ మచ్ఛర్ కేవలం సెకనులో వంతు భాగంలోనే తీసుకున్న తక్షణ నిర్ణయాలు వందలాది కుటుంబాలను రోడ్డున పడకుండా కాపాడాయని, ఆయన కుటుంబానికి దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అంతటా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. [ Smit Machchhar, flydubai pilot, Sheikh Hamdan, Dubai Crown Prince, Indian hero pilot, cockpit attack incident, Flydubai FZ1073 flight, Nina Maneesh, TeluguOne news, Telugu News]

Published on: Sat Oct 3, 2026 8:08PM

political-news-img

మిడ్-ఎయిర్ డ్రామా: ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు ఓమన్ పైలట్ కుట్ర!

దుబాయ్ నుండి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో ఆకాశంలోనే ఊహించని విధంగా అత్యంత నాటకీయమైన, తీవ్ర భయాందోళనకరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఇస్రాయెల్ ప్రయాణికులతో నిండిన ఈ విమానాన్ని కూల్చివేసేందుకు ఓమన్ దేశానికి చెందిన కో-పైలట్ యత్నించడం సంచలనం సృష్టించింది. తీవ్ర మత తీవ్రవాద భావజాలం కలిగిన ఈ ఓమన్ పైలట్, తన తోటి పైలట్‌పై ఒక్కసారిగా దాడికి తెగబడి విమానాన్ని కిందకు దించేందుకు ప్రయత్నించాడు. అతని ఉన్మాద చర్యల కారణంగా విమానం కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే ఏకంగా 14,000 అడుగుల కిందకు పడిపోయింది. అలాగే కేవలం రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలో మొత్తం 17,000 అడుగుల ఎత్తు నుండి విమానం వేగంగా కిందకు దూసుకుపోవడంతో విమానంలోని ప్రయాణికులు మరణభయంతో అల్లల్లాడిపోయారు. ఈ భయంకరమైన సన్నివేశంలో విమాన పైలట్-ఇన్-కమాండ్, భారతీయ మూలాలున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. సుమారు 13 సంవత్సరాలకు పైగా కమర్షియల్ విమానయాన అనుభవం, దాదాపు 9,750 గంటల ఫ్లయింగ్ రికార్డ్ ఉన్న స్మిత్ మచ్చర్, గతంలో స్పైస్‌జెట్‌లో 11 ఏళ్ల పాటు లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా సేవలు అందించారు. కో-పైలట్ జరిపిన రక్తసిక్తమైన దాడిలో కెప్టెన్ స్మిత్ తీవ్రంగా గాయపడి, రక్తం ఓడుతున్నప్పటికీ, ఏమాత్రం ఉపేక్షించకుండా కాక్‌పిట్ తలుపులను అన్‌లాక్ చేయడంలో విజయం సాధించారు. విమానం నిటారుగా కిందకు పడిపోతున్న క్లిష్ట సమయంలో ఆయన కాక్‌పిట్ డోర్ తెరవడమే ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో అతిపెద్ద మలుపుగా మారింది. కాక్‌పిట్ డోర్ తెరచుకోగానే యామివ్ హయూన్ అనే ఇస్రాయెలీ ప్రయాణికుడు తక్షణమే స్పందించి కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లాడు. దాడికి తెగబడిన ఓమన్ పైలట్‌ను విమాన నియంత్రణ ప్యానెల్ నుండి వెనక్కి లాగి, ఇతర ప్రయాణికులు మరియు సిబ్బంది సాయంతో అతనిని పూర్తిగా లొంగదీసుకున్నాడు. అనంతరం విమానాన్ని సురక్షితంగా రక్షించి, సౌదీ అరేబియాలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ భయంకర సంఘటనలో కాక్‌‌పిట్ మొత్తం రక్తసిక్తమైనట్లు ప్రయాణికులు తెలిపారు. ఈ విపత్తు సమయంలో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అద్భుతమైన సమయస్ఫూర్తి, సాహసాన్ని ఇస్రాయెల్ ప్రధాని బెెంజమిన్ నెతన్యాహు స్వయంగా కొనియాడారు. సహచర పైలట్ల కథనం ప్రకారం, దాడికి పాల్పడిన ఓమన్ పైలట్ ఎనిమిది నెలల క్రితమే ఫ్లైదుబాయ్‌లో చేరాడని, ఆయన తీవ్ర మత తీవ్రవాద భావాలు కలిగిన వ్యక్తి అని వెల్లడైంది. రోజులో విపరీతంగా ప్రార్థనలు చేయడం, మహిళలకు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నిరాకరించడం వంటి ప్రవర్తన అతనిలో కనిపించేదని తెలిసింది. ఈ ఊహించని విమాన ప్రమాద ముప్పుపై ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు జరుగుతుండగా, ఫ్లైదుబాయ్ సంస్థ ఇస్రాయెల్‌కు రాకపోకలు సాగించే తన విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. [flydubai, Dubai Tel Aviv Flight, Flight Incident, Oman Co-Pilot, Captain Smith Machar, Israeli Passengers, Cockpit Attack, Emergency Landing Saudi Arabia, Israel Flight Incident, Aviation Security]

Published on: Thu Oct 1, 2026 2:18PM

political-news-img

చలికాలం ముందు ఉక్రెయిన్‌‌కు ఊహించని షాక్: రష్యా ‘స్టీల్ కటర్’ ఆయుధం వెనుక కథ!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక సరికొత్త భయానక అధ్యాయం ప్రారంభమైంది. ఉక్రెయిన్ ఇంధన రంగాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు రష్యా తన అధునాతన ఆయుధ సంపత్తి నుంచి ఒక కొత్త విధ్వంసక ఆయుధాన్ని రణరంగంలోకి దించింది. అదే అత్యంత వేగంగా ప్రయాణించే జెట్ ఆధారిత 'స్టీల్ కటర్' (Steel-Cutter) డ్రోన్. చరిత్రలోనే మొదటిసారిగా రష్యా ఈ కొత్త రకం క్రుములేటివ్-కటింగ్ (KRSN) వార్‌హెడ్ కలిగిన జెట్ డ్రోన్‌ను ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పైకి ప్రయోగించింది. ఈ భయంకరమైన డ్రోన్ దాడితో ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోగా, అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం మంచు తుఫానులు సమీపిస్తున్న తరుణంలో, కోట్లాది మంది ప్రజలు చీకటిలో, గడ్డకట్టే చలిలో అలమటించే ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ జెట్ ఆధారిత ఆక్రమణ డ్రోన్ సాధారణ డ్రోన్ల కంటే పూర్తిగా భిన్నమైనది మరియు అత్యంత విధ్వంసకరమైనది. ఈ కొత్త వార్‌హెడ్ బరువు ఏకంగా 40 కిలోగ్రాములుగా ఉంది. దీని లోపల ప్రధాన పేలుడు పదార్థంతో పాటు 4 ప్రత్యేక విధ్వంసక మాడ్యూళ్లను అమర్చారు. గాలిలో అత్యంత వేగంగా దూసుకొచ్చే ఈ డ్రోన్, విద్యుత్ సరఫరా చేసే భారీ హై-వోల్టేజ్ ఐరన్ పైలాన్‌లు (High-Voltage Pylons) మరియు ఉక్కు వంతెనలను క్షణాల్లో కత్తిరించి ముక్కలు చేసేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. సాధారణంగా విద్యుత్ లైన్లకు స్వల్ప నష్టం జరిగితే ఉక్రెయిన్ ఇంజనీర్లు కొద్ది గంటల్లో పునరుద్ధరించేవారు. కానీ, ఈ 'స్టీల్ కటర్' వార్‌హెడ్లు ఐరన్ పైలాన్ల పునాదులనే పూర్తిగా కత్తిరించి వేయడంతో, ఆ స్థానంలో కొత్త టవర్లను నిర్మించడం వారాలు లేదా నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, సెప్టెంబర్ 30న జరిగిన భారీ క్షిపణి మరియు డ్రోన్ దాడి తర్వాత ఉక్రెయిన్‌లోని సుమారు 3 కంటే ఎక్కువ ప్రధాన ప్రాంతాల్లో అత్యవసర విద్యుత్ కోతలు (Emergency Power Outages) అమల్లోకి వచ్చాయి. రాజధాని కీవ్‌లోని సిహెచ్‌పిపి నంబర్ 5 (CHPP No. 5) పవర్ ప్లాంట్ సమీపంలో ఉన్న ప్రధాన విద్యుత్ టవర్‌ను ఈ జెట్ డ్రోన్ నేరుగా తాకడంతో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఒక్కసారిగా వేలాది గృహాలు, ఆసుపత్రులు, అత్యవసర కేంద్రాలు చీకటిమయమయ్యాయి. గడిచిన ఏడాది కాలంలోనే రష్యా ఉక్రెయిన్‌పైకి 63,000 కంటే ఎక్కువ దాడి డ్రోన్లను ప్రయోగించగా, అందులో 7,700 కి పైగా జెట్-పవర్డ్ షాహెడ్ (Shahed) డ్రోన్లు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంప్రదాయ వాయు రక్షణ వ్యవస్థలతో ఈ జెట్ డ్రోన్లను అడ్డుకోవడం ఉక్రెయిన్ సైన్యానికి చాలా కష్టతరంగా మారింది. ఉక్రెయిన్ శీతాకాలంలోకి అడుగుపెడుతున్న వేళ, దేశీయ ఇంధన నిరోధక ప్రణాళికలు ఇప్పటివరకు 50 శాతానికి కంటే తక్కువగానే పూర్తయ్యాయి. అంటే సగానికి పైగా ఇంధన మౌలిక సదుపాయాలు ఇప్పటికీ రష్యా దాడులకు బలికాక తప్పని పరిస్థితి నెలకొంది. రాబోయే 2 నెలల కాలంలో రష్యా తన వద్ద ఉన్న పూర్తి ఆయుధ సంపత్తిని మరియు సరికొత్త డ్రోన్ నిల్వలను ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థలపై ప్రయోగించడానికి సిద్ధమవుతోందని ఉక్రెయిన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారాలు మరియు పరిశ్రమలు గంటపాటు మూతపడటం వల్ల ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థకు ప్రతి గంటకు 45 మిలియన్ డాలర్ల వరకు భారీ నష్టం వాటిల్లుతోంది. కఠినమైన చలికాలం ముంచుకొస్తున్న వేళ, రష్యా ప్రయోగించిన ఈ కొత్త 'స్టీల్ కటర్' డ్రోన్ ఉక్రెయిన్ భవిష్యత్తును తీవ్రమైన అంధకారంలోకి నెట్టివేస్తోంది. [Russia Ukraine War, Steel-Cutter Drone, Russia Drone Attack, Ukraine Power Grid, KRSN Warhead, Shahed Drones, Ukrainian Energy Crisis, Volodymyr Zelensky, Kyiv Power Outage, Russia Ukraine Conflict]

Published on: Thu Oct 1, 2026 2:09PM

political-news-img

180 ప్రాణాలను కాపాడిన హీరో పైలట్: ఫ్లైదుబాయ్ విమానంలో అసలు ఏం జరిగింది.. ?

అంతర్జాతీయ విమానయాన చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కో పైలట్ విమానాన్ని హైజాక్ చేయడానికి లేదా కూల్చి వేయడానికి చేసిన ప్రయత్నాన్ని అత్యంత సాహసోపేతంగా అడ్డుకున్న పైలట్ ఉదంతమింది. దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్ జడ్ 1073 లో ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ గాలిలో ఉండగా, కాక్ పిట్ లో ఓమానీ జాతీయత కలిగిన కో-పైలట్ ఫ్లైట్ ను హైజాక్ చేయడానికి లేదా కూల్చివేయడానికి ప్రయత్నించాడు. ఇందులో భాగంగా కత్తిలో పైలెట్ కెప్టెన్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రాణాలను ఫణంగా పెట్టి ఆ దాడిని ఎదుర్కొంటూనే.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. 13ఏళ్లః పైగాఅనుభవం, నైపుణ్యం ఉన్న కెప్టెన్ స్మిత్ మచ్చర్.. క్లిష్ట సమయంలో అనితర సాధ్యమైన సంయమనం ప్రదర్శించి.. కో పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడి స్ఫృహ కోల్పోయే పరిస్థితిలో కూడా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ కాక్‌పిట్ తలుపులు తెరుచుకునేలా చేసి ప్రయాణికులకు, సిబ్బందికి సమాచారం అందించారు. ఆయన చూపిన సమయస్ఫూర్తి, తెగువ వల్ల ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు, ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే అప్రమత్తమై ముందుకు వచ్చి దుండగుడిని దాడికి పాల్పడిన కో పైలట్ ను అదుపు చేసి, విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. సౌదీ అరేబియా అధికారులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన అనితర సాధ్యమైన తెగువ, సమయస్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల అగ్రనేతలు ప్రశంసల్లో ముంచెత్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్మిత్ మచ్చర్ ను రియల్ హీరోగా అభివర్ణించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, కెప్టెన్ స్మిత్ మచ్చార్ చూపిన ధైర్యం వందల మంది ప్రాణాలను కాపాడిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. అచంచలమైన సంకల్పాన్ని అభినందించిన మోడీ.. ఇండియా మొత్తం స్మిత్ మచ్చర్ ను చూసి గర్విస్తోందని పేర్కొన్నారు. [Indian Pilot, Flydubai Flight, Smit Machchhar, Cockpit Attack, Tabuk Emergency Landing, Modi, Trump. Netanyahu, Praise, Telugu One]

Published on: Thu Oct 1, 2026 9:47AM

political-news-img

Russia: కూలిన టీయూ-95 బాంబర్‌: ఆరుగురు సిబ్బంది మృతి.!

అంతర్జాతీయ వార్తల్లో ఇప్పుడు రష్యాకు చెందిన శక్తివంతమైన సైనిక విమాన ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. రష్యాలోని తూర్పు దిశగా ఉన్న అముర్ ప్రాంతంలో రక్షణ రంగానికి చెందిన ప్రసిద్ధ 'టీయూ-95' (Tu-95) స్ట్రాటజిక్ బాంబర్ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. రొటీన్ శిక్షణ కొనసాగుతున్న సమయంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో మొత్తం ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి అధికారులు తక్షణమే స్పందించి, తీవ్రంగా గాయపడిన సిబ్బందిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఈ విమాన ప్రమాదం సంభవించిన సమయంలో ఒక పెద్ద పెను ప్రమాదం తప్పిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఎందుకంటే ఈ విమానం అత్యంత జనసాంద్రత తక్కువగా ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో కూలిపోవడంతో పెను ప్రాణనష్టం తప్పినట్లయింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసేందుకు రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్ కమిషన్ ప్రత్యేక సభ్యులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటనే దానిపై ప్రస్తుతం లోతైన అన్వేషణ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ టీయూ-95 బాంబర్‌‌కు సంబంధించిన చారిత్రక, వ్యూహాత్మక ప్రాముఖ్యత ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొట్టమొదటగా 1952వ సంవత్సరంలో సోవియట్ యూనియన్ డిజైన్ చేసి తయారు చేసిన ఈ టీయూ-95 విమానం విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. దశాబ్దాలుగా రష్యా సైనిక బలగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ భారీ బాంబర్‌ను, ప్రస్తుతం ఆధునిక కేహెచ్-101 (Kh-101) క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు రష్యా ప్రధానంగా వినియోగిస్తోంది. అంతేకాకుండా, ఉక్రెయిన్‌‌పై దాడులు జరపడంలో కూడా రష్యా ఈ బాంబర్‌ను విస్తృతంగా వాడుతున్నట్లు సమాచారం. అత్యంత శక్తివంతమైన థర్మోన్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను సైతం సునాయాసంగా మోసుకెళ్లగల సామర్థ్యం ఈ టీయూ-95 బాంబర్‌ సొంతం. ఈ నేపథ్యంలో ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన స్ట్రాటజిక్ బాంబర్ కూలిపోవడం రష్యా సైనిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. [ Tu-95 bomber crash, Russia bomber accident, Amur region, Russian Defense Ministry, Kh-101 missiles, strategic bomber, Telugu One, Telugu News ]

Published on: Wed Sep 30, 2026 4:39PM

political-news-img

ఇరాన్ తో చర్చలకు నో: ఒప్పందానికి అవకాశం.. ట్రంప్ ద్వంద్వ వైఖరి.!

ప‌శ్చిమాసియాలో ఏడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకు తెచ్చిన కొత్త శాంతి ఒప్పంద ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. చర్చల పునఃప్రారంభానికి ఇరాన్ కోరుతున్న రాయితీలుఆమోదయోగ్యం కావనీ అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ఐరాసలో అమెరికా ప్రతినిథి మైక్ వాల్ట్జ్ స్పష్టం చేశారు. ఇరాన్ ఓడిపోతోందన్న ఆయన.. అందుకే ఇప్పుడు ఒప్పందం కోసం కాళ్లావేళ్లాపడుతోందన్న ట్రంప్ వ్యాఖ్యను ఆయన పునరుద్ఘాటించారు. కేవలం చర్చలు ప్రారంభించేందుకే తమ నౌకాశ్రయాలపై అమెరికా నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, అంతర్జాతీయ ఆంక్షలను తొలగించాలని, బిలియన్ల డాలర్ల ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ చేసినది కపట ప్రయత్నం. అందుకే ట్రంప్ ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారని మైక్ వాల్ట్జ్ తెలిపారు. ఇరాన్ హామీలను నిలబెట్టుకుంటుందన్న నమ్మకం లేదని కుండబద్దలు కొట్టారు. వివరాల్లోకి వెడితే.. గత వారం ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి శాంతి ప్రణాళికను ప్రకటించారు. దీని ప్రకారం.. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి, ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి, ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ముగించాలి. ఇక అమెరికా తమ ప్రతిపాదనను తిరస్కరించడంపై అరాఘ్చి స్పందించారు. అమెరికా చేస్తున్న ఆరోపణలు చాలా చాలా పాతవని, వాటికి ఆధారాలు లేవని కొట్టిపారేశారు. అమెరికా కొన్ని పనులు చేస్తే జలసంధిని తెరవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ డిమాండ్లు కొత్తవి కావు, ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఇవి మా హక్కులు అపి ఆయన పునరుద్ఘాటించారు. అయితే, గత రెండేళ్లుగా ట్రంప్ ప్రభుత్వ ప్రవర్తన చూసిన తర్వాత వారితో మళ్లీ చర్చలు జరపడానికి తమకు ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. అయితే ఇరాన్ ప్రతిపాదనను అమెరికా నిర్ద్వంద్వంగా తిరస్కరించినప్పటికీ.. రానున్న రోజుల్లో చర్చలు పునఃప్రారంభమవుతాయని తాను ఆశిస్తున్నట్లు ట్రంప్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరాన్ ఒప్పందం కోరుకుంటోంది.. అయితే అది తాను ఆశిస్తున్న ఒప్పందం కాదన్న ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉందని మాత్రం అంగీకరించారు. [Donald Trump, US Iran Talks, Iran Peace Proposal, America Reject, Middle East Conflict, Abbas Araghchi]

Published on: Mon Sep 28, 2026 9:45AM

political-news-img

దక్షిణాఫ్రికాలో భారీ కాల్పులు: 27 మంది మృతి.!

సౌతాఫ్రికా దేశంలో వరుసగా జరిగిన రెండు ఘోర సామూహిక కాల్పుల ఘటనలు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జోహెన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ సమీపంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ హింసాత్మక దాడిలో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనలో మరో 26 మంది తీవ్రంగా గాయపడటంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి, నేరాల నియంత్రణపై ఈ ఘటన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటి ఘటన జోహెన్నెస్‌బర్గ్ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెడెలా టౌన్‌షిప్‌లోని ఒక బార్‌లో శనివారం రాత్రి దాదాపు 9:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఎనిమిది మంది సాయుధ దుండగులు ఏకకాలంలో బార్‌లోకి చొరబడి ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కిరాతక దాడిలో 13 మంది పురుషులు, 4 మహిళలు సహా మొత్తం 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణకాండతో పాటు దుండగులు రెండు వాహనాలకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ భయానక ఘటన మరవకముందే, కేప్‌టౌన్ శివారు ప్రాంతమైన ల్వాండ్లేలో ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మరో సామూహిక కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక వినోద వేదిక, బార్‌క్యూ సెంటర్ వద్ద గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో మరో 11 మంది గాయపడ్డారు. ఈ రెండు దారుణకాండలకు గల అసలు కారణాలు ఇప్పటివరకు స్పష్టంగా తెలియరాలేదని, పోలీసులు నిందితుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారని అధికారులు తెలిపారు. సౌతాఫ్రికాలో ఇటీవలి కాలంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం కొన్ని రోజుల క్రితం డర్బన్ సమీపంలో జరిగిన మరో గృహ వేడుకలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక హత్యల రేటు ఉన్న దేశాలలో సౌతాఫ్రికా ఒకటిగా నిలిచింది. ఇల్లీగల్ ఆయుధాలు, గ్యాంగ్ వార్స్, వ్యవస్థీకృత నేరాలు దేశ భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నవంబర్ నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ భద్రతా వైఫల్యాలు రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దేశంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. [ South Africa shooting, mass shootings South Africa, Johannesburg bar attack, Lwandle shooting, South Africa 27 dead, international news updates, Telugu One, Telugu News ]

Published on: Sun Sep 27, 2026 4:28PM

political-news-img

అమెరికా విద్యార్థులకు చైనా ఆహ్వానం: అమెరికాతో చెలిమి దిశగా ముందడుగు.!

అంతర్జాతీయ రాజకీయాలు, దౌత్య సంబంధాల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా యువతను తమ దేశానికి ఆహ్వానించారు. వచ్చే ఐదేళ్లలో లక్ష మంది అమెరికా యువతను చైనాలో పర్యటించేందుకు వెల్ కమ్ చెప్పారు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకే ఈ ఆహ్వానమని పేర్కొన్న ఆయన.. ఇది, అమెరికా, చైనా మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు దోహదం చేస్తుందన్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో జిన్‌పింగ్ అమెరికా విద్యార్థులను చైనాకు ఆహ్వానిస్తూ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా ఇరు దేశాల మధ్యా ఉన్న అంతరాలు సమసిపోయే దిశగా వేసిన ముందడుగుగా అంతర్జాతీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. , చైనా-అమెరికా సంబంధాలు బలోపేతం కావాలన్ ఆశ ప్రజల్లోనే నిక్షిప్తమై ఉందని, వాటి భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని జిన్ పింగ్ అన్నారు. 2023లో ప్రకటించిన 50 వేల మంది యువత ఆహ్వాన లక్ష్యం, నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తయిందని వెల్లడించారు. ఆ స్ఫూర్తితోనే రాబోయే ఐదేళ్లలో విద్యా మార్పిడి, పర్యటనల నిమిత్తం లక్ష మంది యువ అమెరికన్లను చైనాకు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చైనా, అమెరికా ప్రజలు ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా భుజం భుజం కలిపి పోరాడిన విషయాన్నిఈ సందర్బంగా జిన్‌పింగ్ గుర్తు చేశారు. చరిత్రలోని ఆ సువర్ణాధ్యాయాన్ని ఇరు దేశాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్న ఆయన.. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ, చారిత్రక చొరవను ప్రదర్శిస్తూ.. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహ భావాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరు దేశాల సంబంధాలపై సానుకూలంగా స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా చైనాకు అమెరికా అందించిన చారిత్రక సాయాన్ని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. భద్రత, అత్యాధునిక సాంకేతికత, అలాగే సూపర్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన కీలక రంగాల్లో తాము తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల పాటు ప్రపంచ శాంతిని, సౌభాగ్యాన్ని ప్రోత్సహించగలవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తున్నాయని, చరిత్రలో మనం కలిసికట్టుగా ఎంతో సాధించగలమనే గట్టి నమ్మకం తనకు ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో గ్లోబల్ పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులకు నాంది పలుకుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. [Xi Jinping Offer, American Students, Study China, White House Meeting, Donald Trump, US China Relations]

Published on: Sun Sep 27, 2026 9:43AM

political-news-img

ఉగ్ర మద్దతుకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు?.. పాక్ ప్రధానిని నిలదీసిన మీడియా.!

పాకిస్థాన్ ప్రధానికి చేదు అనుభవం ఎదురైంది. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, తమ భూభాగాన్ని ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చిన పాకిస్థాన్ కు ఇప్పుడు అన్ని వైపుల నుంచీ వంమతిక్త వ్యక్తమౌతోంది. అమెరికాలోని ఐరాస కార్యాలయం వద్ద ఇదే విషయమై పాకిస్థాన్ ప్రధానిని జర్నలిస్టులు నిలదీశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని అమెరికా వెళ్లారు. ఆయనను ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద మీడియా చుట్టుముట్టి ఉగ్రవాదానికి మద్దతు పై ప్రశ్నల వర్షం కురిపించింది. అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే అంశంపై మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నల పరంపరకు ఆయన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే ఆయన వారిని తప్పించుకు వెళ్లిపోవడం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పాక్ ప్రధాని ఐరాస కార్యాలయంలోకి వెడుతుండగా మీ దేశం ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించడం ఎప్పుడు మానుకుంటుందంటూ ఓ జర్నలిస్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ ను సూటిగా ప్రశ్నించాడు. ఈ అనూహ్య పరిణామంలో కంగుతిన్న షరీఫ్ సమాధానం ఇవ్వకుండా ఐరాస జనరల్ అసెంబ్లీలో పాల్గొనేందుకు లోనికి వెళ్లిపోయారు. ఆ సమావేశాలు ముగించుకుని బయటకు వస్తున్న తరుణంలోనూ మీడియా ఆయనను వదలలేదు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ చీఫ్ హాఫీజ్ సయీద్‌పై మీ ప్రభుత్వం ఎప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని నిలదీసింది. అయితే దీనికీ పాకిస్థాన్ ప్రధాని నుంచి జవాబు రాలేదు. మీడియా ప్రతినిధులను తప్పించుకుని అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. అది పక్కన పెడితే.. ఐరాస జనరల్ అసెంబ్లీ వేదికగా భారత్ పాక్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భారత డిప్లొమాట్.. పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నదో ప్రపంచ దేశాల కళ్లకు కట్టారు. అనవసరమైన అంశాలపై దృష్టి పెడుతూ అంతర్జాతీయ వేదికలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. [UN General Assembly, Pakisthan PM, Shehbaz Sharif, Lashkaretoiba, Hafiz Saeed, United Nations, Pakistan Terrorism, UNGA News, Media, Questions, Telugu One]

Published on: Sat Sep 26, 2026 12:30PM