TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

తెలంగాణలో తీవ్ర కరవు పరిస్థితులు..రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం: కవిత

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అలుముకున్న కరవు ఛాయలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా సరిగా వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు. సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయని, దీనివల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలు ప్రకటించి కేంద్ర సహాయం కోసం చర్యలు తీసుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పటికీ అధికార యంత్రాంగం మంత్రులు కనీస సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించలేదని కవిత తప్పుబట్టారు. కేవలం పూజలు మరియు యాగాలకే పరిమితమైతే ప్రజల సమస్యలు పరిష్కారం కావని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. పంటలను కాపాడుకోవడానికి రైతులకు నిరంతరం విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో బోర్ల కింద ఉన్న పంటలు కూడా ఎండిపోయే దుస్థితి నెలకొందని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని దక్షిణ భారతదేశంలోని కరవు పీడిత రాష్ట్రాలను ప్రత్యేకంగా ఆదుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. లేనియెడల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి రైతులు సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి ప్రత్యేక మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర కార్యాచరణను రూపొందించాలని ఆమె డిమాండ్ చేశారు. అన్నదాతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. [ Telangana drought, Kalvakuntla Kavitha, Telangana government, farmer problems, drought mandals, CM Revanth reddy, Telugu One, Telugu News ]

Published on: Sun Oct 4, 2026 6:17PM

political-news-img

సికింద్రాబాద్‌లో.. లారీ బరువుకు కుప్పకూలిన జంక్షన్ పైకప్పు.!

సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వాటర్ వర్క్స్ జంక్షన్ వద్ద ఉన్న పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ జంక్షన్ పైకప్పుపై నుంచి వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లారీ బరువును తట్టుకోలేక పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో.. భారీ నిర్మాణ శిథిలాలు లారీ చుట్టూ పడిపోయాయి. దీంతో లారీ జంక్షన్‌లోనే ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా నిర్మాణం కూలిపోవడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలిస్తూ.. జంక్షన్‌లో చిక్కుకున్న లారీని సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. భారీ లోడ్‌తో ఉన్న వాహనం వెళ్లడంతోనే పైకప్పు కూలిందా? లేదా నిర్మాణం బలహీనంగా ఉండటమే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది. [ Secunderabad, Water Works Junction, Cantonment, Junction Roof Collapse, Lorry Accident, Hyderabad Accident, Telangana, Road Accident, Roof Collapse, Heavy Vehicle Accident ]

Published on: Sun Oct 4, 2026 4:50PM

political-news-img

అడిగింది ఆడదే.. న్యాయం జరగాలని: నెక్లెస్ రోడ్డుపై అర్ధరాత్రి మహిళలు నిరసన.!

మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.! హైదరాబాద్ నెక్లెస్ రోడ్ మరోసారి అర్ధరాత్రి సందేశాలతో మార్మోగింది. శనివారం రాత్రి మహిళలు, క్వీర్ కమ్యూనిటీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి “మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి వేళల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు స్వేచ్ఛగా సంచరించే హక్కును చాటిచెప్పడమే ఈ మార్చ్ ప్రధాన ఉద్దేశం. మహిళల భద్రత పేరుతో వారినే ఇంటికే పరిమితం చేయడం కాకుండా.. రాత్రి వేళల్లోనూ మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, భద్రత కల్పించాలన్న డిమాండ్‌తో ఈ కార్యక్రమం సాగింది.“ఈ రోడ్లు పురుషులకేనా..?ఈ నగరం పగటి పూట మాత్రమే మాదా..?రాత్రి అయితే మహిళలు ఎందుకు భయపడాలి..?” అంటూ మిడ్నైట్ మార్చ్ ద్వారా ప్రశ్నలు సంధించారు. హైదరాబాద్‌లో మిడ్నైట్ మార్చ్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. 2013లో ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత హైదరాబాద్‌లోనూ ఇదే తరహాలో మిడ్నైట్ మార్చ్ నిర్వహించారు. అప్పట్లో నెక్లెస్ రోడ్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని.. మహిళలు అర్ధరాత్రి వేళల్లోనూ బహిరంగ ప్రదేశాలను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కు తమదేనని చాటిచెప్పారు.ఆ ఉద్యమం కేవలం ఓ నిరసనగా మాత్రమే కాకుండా.. “మహిళలు రాత్రి వేళల్లో బయటకు రావద్దు” అనే సామాజిక భావనకు సవాల్‌గా నిలిచింది. మహిళలకు వేధింపులు ఎదురయ్యే అవకాశం ఉందని వారిపైనే ఆంక్షలు విధించడం కంటే.. వేధింపులకు పాల్పడే వారిని ప్రశ్నించాలన్న ఆలోచనను ముందుకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో క్వీర్ కమ్యూనిటీతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు. మహిళల భద్రతతో పాటు లింగ గుర్తింపుల కారణంగా అసురక్షిత పరిస్థితులను ఎదుర్కొనే ప్రతి ఒక్కరికీ బహిరంగ ప్రదేశాల్లో సమాన హక్కులు ఉండాలన్న సందేశాన్ని వినిపించారు. ఏళ్లు గడిచాయి.. నగరం మారింది.. జీవన విధానం మారింది.. కానీ రాత్రి వేళల్లో మహిళల స్వేచ్ఛ, భద్రత, సమాన హక్కుల ప్రశ్న మాత్రం ఇంకా చర్చకు వస్తూనే ఉంది. అందుకే మరోసారి నెక్లెస్ రోడ్డుపై అర్ధరాత్రి అడుగులు పడ్డాయి.కాలం మారినా.. ఈ గోస మారదా..?అడిగింది ఆడదే..దానం కాదు.. హక్కు కావాలని.! జాలి కాదు.. న్యాయం కావాలని.!ఆంక్షలు కాదు.. స్వేచ్ఛ కావాలని.! అర్ధరాత్రి నెక్లెస్ రోడ్డుపై వినిపించిన ఈ గొంతుక.. కేవలం ఓ రాత్రి నినాదం కాదు. నగరంలోని బహిరంగ ప్రదేశాలు ఎవరివి? మహిళలు రాత్రి వేళల్లోనూ భయంలేకుండా తిరిగే హక్కు ఎప్పుడు పూర్తిగా సాధ్యమవుతుంది? అనే కీలక ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చిన ఉద్యమం. [ Midnight March, Hyderabad, Necklace Road, Women Rights, Women Safety, Gender Equality, Reclaiming Public Spaces, LGBTQ Community, Queer Community, Women Empowerment, Public Spaces, Night Safety, Hyderabad Women, Gender Justice, Women's Freedom ]

Published on: Sun Oct 4, 2026 2:29PM

political-news-img

ఒక్కొక్కరికి రూ.1.10 లక్షల బోనస్: సింగరేణి కార్మికులకు దసరా బంపర్ బోనస్.!

తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది. బొగ్గు గనుల్లో నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ఈ ఏడాది లాభాల వాటా కింద ఒక్కో కార్మికుడికి రూ.1.10 లక్షల చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించింది. దసరా పండుగ సమీపిస్తున్న వేళ బోనస్ కోసం సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు ఈ బోనస్ ఆర్థికంగా ఉపయోగపడుతుందని కార్మికులు చెబుతున్నారు. సింగరేణి పరిధిలోని అర్హులైన కార్మికులకు ఈ బోనస్ అందనుంది. పండుగకు ముందే నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కార్మిక కుటుంబాల్లో ముందుగానే దసరా సందడి నెలకొంది. సింగరేణి సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ప్రభుత్వం పేర్కొంది. వారి శ్రమకు తగిన గుర్తింపునిస్తూ లాభాల్లో వాటా అందించడం ద్వారా మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తోంది. బోనస్ ప్రకటనపై కార్మిక సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బోనస్ ప్రకటనతో కొత్తగూడెం, మణుగురు, గోదావరిఖని, మంచిర్యాల, భూపాలపల్లి తదితర సింగరేణి ప్రాంతాల్లో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ పలుచోట్ల మిఠాయిలు పంచుకున్నారు. కార్మికుల సంక్షేమంతో పాటు సింగరేణి సంస్థను మరింత లాభాల బాటలో నడిపించేందుకు ప్రభుత్వం భవిష్యత్తులోనూ చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. అలాగే తమకు సంబంధించిన ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. [ Singareni Bonus 2026, Singareni Workers Bonus, Singareni Dasara Bonus Telangana Govt Singareni Bonus,Singareni profit share bonus,SCCL, Kothagudem, Deputy cm Mallu Bhatti Vikramarka, Telugu One, Telugu News ]

Published on: Sun Oct 4, 2026 12:17PM

political-news-img

ప్రియుడిని నమ్మి వెళ్లింది: చివరకు శవమై తిరిగొచ్చింది.!

నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.! మూడు ముళ్లు, ఏడడుగుల బంధం ఇప్పటికే ఆమె జీవితంలో విషాదంగా ముగిసింది. భర్తను కోల్పోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో పుట్టింట్లో ఉంటున్న ఆ మహిళకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తనను ప్రేమిస్తున్నాడని నమ్మిన ఆమె.. అతడినే నమ్ముకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కానీ అదే వ్యక్తి చివరకు ఆమె ప్రాణాలు తీశాడు. నగలు కోసం మొదలైన ఒత్తిడి.. చివరకు హత్యకు దారితీసింది. అదృశ్యమైన మహిళ కోసం కుటుంబ సభ్యులు చేసిన గాలింపు.. చివరకు ఆమె విగతజీవిగా కనిపించడంతో విషాదాంతమైంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. చెల్లాపూర్ గ్రామానికి చెందిన అమృతమ్మ (34)కు కుల్కచర్లకు చెందిన గంధం భీమయ్యతో పెళ్లి జరిగింది. అయితే రెండేళ్ల క్రితం భర్త మృతి చెందడంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. అప్పుడప్పుడూ కుల్కచర్లలోని అత్తవారింటికి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మంగలి ఆనంద్ (28)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఇల్లు చూసి వస్తానని వెళ్లి..! సెప్టెంబర్ 18న కుల్కచర్లలోని ఇల్లు చూసి వస్తానని చెప్పి అమృతమ్మ చెల్లాపూర్ నుంచి బయలుదేరింది. కానీ ఎంతసేపటికీ తిరిగి రాలేదు. ఒకరోజు.. రెండు రోజులు.. ఇలా మూడు రోజులు గడిచినా ఆమె ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బంధువులు, తెలిసినవారి ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో సెప్టెంబర్ 29న కుల్కచర్ల పోలీసులను ఆశ్రయించారు.అదృశ్యం కేసు నమోదు చేసిన ఎస్‌ఐ రమేష్ దర్యాప్తు ప్రారంభించారు. అమృతమ్మతో సన్నిహితంగా ఉన్న పలువురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో మంగలి ఆనంద్‌పై అనుమానం బలపడింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అమృతమ్మ హత్యకు సంబంధించిన భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆభరణాల కోసం హత్య..! ఆనంద్‌తో సన్నిహితంగా ఉన్న సమయంలో అమృతమ్మ అతడి అవసరాల కోసం బంగారు, వెండి ఆభరణాలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాటిని తనఖా పెట్టిన ఆనంద్.. సుమారు రూ.2 లక్షలు తీసుకుని ఖర్చు చేశాడు. అయితే తన నగలు తిరిగి ఇవ్వాలని అమృతమ్మ పదేపదే అడగడం ప్రారంభించింది. దీంతో తన గుట్టు బయటపడుతుందనే భయంతో ఆమెను హత్య చేయాలని ఆనంద్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.సెప్టెంబర్ 18న కొత్తపల్లి వద్ద అమృతమ్మను కారులో ఎక్కించుకున్న ఆనంద్.. మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలం వెన్నాచెడ్ చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ చీర కొంగుతో ఆమె మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య తర్వాత ఆధారాల మాయం కోసం..! అమృతమ్మ చనిపోయిందని నిర్ధారించుకున్న అనంతరం ముందుగా తీసుకొచ్చిన డీజిల్‌ను మృతదేహంపై పోసి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో భయాందోళనకు గురైన ఆనంద్.. మృతదేహాన్ని మూటకట్టి కారులో తరలించాడు.తెలంగాణ-కర్ణాటక సరిహద్దు వైపు, రాయచూర్ మార్గంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని పడేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించారు. ప్రియుడిని నమ్మి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమృతమ్మ.. చివరకు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. పిల్లలను, కుటుంబాన్ని ఒంటరిగా వదిలి వెళ్లిన ఆమె.. తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అదృశ్యమైన మహిళ కోసం మొదలైన గాలింపు.. చివరకు హత్య కేసు ఛేదనకు దారితీసింది. కుల్కచర్ల పోలీసులు నిందితుడు ఆనంద్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. [ Amruthamma Murder, Kulkarla Murder Case, Vikarabad Crime, Telangana Crime, Woman Murder, Missing Woman Case, Lover Murder, Extramarital Affair, Mangali Anand, Kulkarla Police, Vikarabad Murder Case, Telangana Woman Murder, Crime News, Murder Investigation, Missing Woman Turns Murder Case ]

Published on: Sun Oct 4, 2026 11:48AM

political-news-img

Bollaram Army Camp: ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ట్విస్ట్..మరో 8 మంది అరెస్ట్.!

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ఛేదించారు. మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్ అలియాస్ రాజు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి వెల్లడించారు. నిందితుల నుంచి ఏకే-203 రైఫిళ్లు, ఇన్సాస్ రైఫిల్, పిస్టల్స్, మ్యాగజైన్లు, భారీగా బుల్లెట్లు, బైనాక్యులర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆగస్టు 31న బొల్లారం ఆర్మీ క్యాంప్‌లోని ఆయుధాగారం, మ్యాగజైన్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించి.. లెఫ్టినెంట్ కల్నల్ మయాంక్ గోవితిర్కర్ ఫిర్యాదుతో బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ, టాస్క్‌ఫోర్స్, ఇంటెలిజెన్స్ విభాగాలు కలిసి దర్యాప్తు చేపట్టాయి.సెప్టెంబర్ 11న ప్రధాన నిందితుడు మల్లేష్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి తండ్రి ఇంట్లో గన్నీ బ్యాగుల్లో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టు అనుమతితో మల్లేష్‌ను పది రోజుల పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో చోరీ వెనుక ఉన్న పూర్తి పథకం బయటపడిందని సీపీ సుమతి తెలిపారు. మల్లేష్ గతంలో మేఘాలయ, జమ్మూ, ఊటీ ప్రాంతాల్లో పనిచేసి.. 2025 వరకు అక్కడ విధులు నిర్వహించిన అనంతరం మద్రాస్ రెజిమెంట్‌కు బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. గతంలో అచ్చంపేటలో అతడిపై రెండు చోరీ కేసులు ఉన్నట్లు కూడా గుర్తించారు. మల్లేష్ మైండ్ సెట్ మొత్తం దొంగతనాలు చేయడమే... రిటైర్మెంట్ తర్వాత ఇల్లు, ఫ్లాట్ నిర్మాణం వంటి వాటికి ఖర్చులు కావడంతో మల్లేష్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పూర్తయ్యాక సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని తన తమ్ముడు మల్లికార్జున్‌తో కలిసి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మల్లేష్ రిచ్ కావాలని ఫిక్స్ అయ్యి తెఫ్ట్ చేశాడు. మల్లేష్, మల్లికార్జున్, నిరంజన్ కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, ధనికుల ఇళ్లలో భారీ దోపిడీలు చేయాలని స్కెచ్ వేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకుల్లో దొంగతనాలు ఎలా చేయాలనే అంశానికి సంబంధించిన వీడియోలను మల్లికార్జున్.. మల్లేష్‌కు పంపినట్లు సీపీ వెల్లడించారు. 2022లో కోల్‌కతాలో ఉన్న సమయంలో మల్లేష్‌కు అక్కడి సివిలియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. అదే సమయంలో బిర్బల్ షా, అవి డే అలియాస్ ఓబీతో పరిచయం ఏర్పడినట్లు చెప్పారు. బిర్బల్ షానే అవి డేను మల్లేష్‌కు పరిచయం చేసినట్లు వెల్లడించారు.అవి డేపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాల అవసరం ఉందని మల్లేష్ వారికి చెప్పినట్లు.. అనంతరం ఆర్మీ ఆయుధాలను తీసుకురావడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన మల్లేష్‌కు అక్కడి సిబ్బందితో పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలను ఉపయోగించుకుని కోట్ ఇన్‌చార్జ్ వినోద్ కుమార్, ప్రవీణ్, శేషులను తన పథకంలోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. కోట్ ఇన్‌చార్జ్‌గా ఉన్న వినోద్‌కు ఆయుధాగారం, సీసీ కెమెరాలు, సెంట్రీ డ్యూటీలు, క్యాంప్‌లోని కదలికలపై పూర్తి అవగాహన ఉండటంతో అతడి పాత్ర కీలకంగా మారిందని సీపీ తెలిపారు. వినోద్ సాధారణ సమయం కంటే ముందుగానే క్యాంప్‌ను సందర్శించేవాడని, ఈ విషయాలను కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. మల్లేష్ డబ్బు ఆశ చూపి వినోద్, ప్రవీణ్, శేషులను తనతో కలుపుకున్నట్లు తెలిపారు. జూలై 14 నుంచి ఆగస్టు 27 వరకు మల్లేష్, వినోద్ ఒకే లొకేషన్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. మల్లేష్ స్కూటీపై ఆర్మీ క్యాంప్‌లోకి వెళ్లి రాడ్‌తో ఆయుధాగారం తాళాలు పగులగొట్టి ఆయుధాలను చోరీ చేశాడు. చోరీ పూర్తయిన అనంతరం కామ్ హోగయా అంటే ప్రవీణ్‌కు మెసేజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.చోరీ అనంతరం మల్లేష్ తన వాట్సాప్ కాల్స్‌తో పాటు ఇతర కాల్ వివరాలను డిలీట్ చేసినప్పటికీ.. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లారు. మల్లేష్ నుంచి వినోద్‌కు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో రూ.లక్ష ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని సీపీ తెలిపారు. మరోవైపు ఒక పిస్టల్ కనిపించడం లేదంటూ వినోద్ ఫిర్యాదు చేయడం కూడా పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చినట్లు వెల్లడించారు. చోరీ చేసిన ఆయుధాలను కోల్‌కతాకు చెందిన ముఠాకు విక్రయించేందుకు ముందుగానే ప్రయత్నాలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కో పిస్టల్‌కు సుమారు రూ.3 లక్షలు, పెద్ద రైఫిల్‌కు రూ.5 లక్షల చొప్పున ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.బిర్బల్ షాకు మల్లేష్ ఆర్మీ నుంచి ఆయుధాలు తీసుకురానున్న విషయం ముందుగానే తెలుసని పోలీసులు తెలిపారు. అవి డే, బిర్బల్ షాల ద్వారా ఆయుధాల విక్రయానికి మార్గం ఏర్పడినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఎలాంటి ఉగ్రవాద లేదా తీవ్రవాద సంబంధాలు లేవని సీపీ సుమతి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయుధాలు చోరీ జరిగిన ప్రాంతంలో చాలా రోజుల నుండి సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిపారు. భారీ ఆస్తి నేరాలకు పాల్పడి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే మల్లేష్ ఆయుధాలను చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. అయితే నిందితుడు శేషు పాకిస్థాన్‌కు సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవుతున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. ఈ అంశంపై కూడా పరిశీలన చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఉగ్రవాద సంబంధాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేష్, సిపాయి కొండూరు శేషులు, నాయక్ వినోద్ కుమార్, హవల్దార్ కూచరకంటి ప్రవీణ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవి డే అలియాస్ ఓబీ, బిర్బల్ షా, మల్లేష్ బంధువు ఉప్పుతోళ్ల మల్లికార్జున్, కిరాణా వ్యాపారి చెమ్మకార నిరంజన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి నాలుగు ఏకే-203 రైఫిళ్లు, ఐదు మ్యాగజైన్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు మ్యాగజైన్లు, ఆరు 9ఎంఎం ఆటో పిస్టల్స్, 12 మ్యాగజైన్లు, ఒక సివిల్ 6.35 బోర్ పిస్టల్, మూడు బైనాక్యులర్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 1,156 9ఎంఎం పిస్టల్ రౌండ్లు, 720 ఏకే-203 రౌండ్లు, 36 ఇన్సాస్ రౌండ్లు, ఐదు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. [ Bollaram Army Camp, Army Weapons Theft, Former Havildar, 8 Arrested, Army Weapons, Bollaram Crime, Secunderabad Crime, Hyderabad Crime, Weapons Theft Case, Illegal Weapons, Army Camp Theft, Police Investigation, Arms Theft Case, Telangana Crime ]

Published on: Sat Oct 3, 2026 4:46PM

political-news-img

హోటళ్ల లైసెన్సులు రద్దు: ఒక ఫార్సేనా.. ఫుడ్ సేప్టీ అధికారులది ఉత్తుత్తి హడావుడేనా.?

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, నాణ్యత కొరవడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అన్నీ అని కాదు కానీ పలు హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలకు నీళ్లొదిలి, కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు. టీజీ సేఫ్ దాడులు, సీజ్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ప్రియులు స్వాగతించారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో ధైర్యంగా తినవచ్చని భావించారు. తమ ఆరోగ్యానికి ఢోకా ఉండదని అనుకున్నారు. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్సులు రద్దు చేసినా కొన్ని హోటళ్లు నేరుగా వినియోగదారులకు కనిపించకుండా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదికల ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. . లైసెన్సు రద్దయిన సంస్థలు ఆహార తయారీ, విక్రయ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు అధికారులు తనిఖీలను మరింత సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు కూడా చెల్లుబాటయ్యే ఆహార భద్రతా లైసెన్సులను ధ్రువీకరించే వ్యవస్థను పటిష్ఠం చేయాలని అంటున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం కనుక కేవలం దాడులు, సీజ్ లు లైసెన్సుల రద్దతో చేతులు దులిపేసుకోవడమే కాకుండా, లైసెన్స రద్దైన తరువాత కూడా ఆన్ లైన్ ద్వారా సరఫరాలు కొనసాగిస్తున్న వారిపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. [Telangana Food Safety, Cancellation Hotel Licenses, Telangana Hotels Restaurants, Food Safety Officials, TG SAFE, Farce, Telugu One]

Published on: Sat Oct 3, 2026 10:38AM

political-news-img

రిక్రూట్ మెంంట్లలో ఇండియాలోనే ఫస్ట్: హైదరాబాద్ బెస్ట్.. టెక్, నాన్ టెక్ రంగాల్లో.!

దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే ఉద్యోగాల నియామక ప్రక్రియలో హైదరాబాద్‌ బెస్ట్. ఈ విషయాన్ని ప్రముఖ సంఎంప్లాయిమెంట్ నివేదిక నివేదిక వెల్లడించింది. వివిధ రంగాల్లో కొత్త కొలువుల భర్తీ వేగవంతం కావడం, కార్పొరేట్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ఇందుకు కారణంగా ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే టెక్ మరియు నాన్-టెక్ రంగాలకు సంబంధించి ఆఫీసు రిక్రూట్ మెంట్లలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులకు నగరంలో లభిస్తున్న అవకాశాలపై వెలువడిన ఈ నివేదిక ప్రకారం, వివిధ రంగాల్లో నిపుణులైన అభ్యర్థుల కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో రిక్రూట్ మెంట్ కార్యకలాపాలు భాగ్యనగరంలో జోరందుకున్నాయి. గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. దేశంలోని ప్రతిష్టాత్మక జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తూ వెలువడిన ఈ నివేదిక మేరకు, . కంపెనీలు కొత్త ఉద్యోగులను చేర్చుకునే విషయంలో హైదరాబాద్‌ను ప్రథమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. స్థానిక ఉపాధి మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతుండటం, మౌలిక వసతులు అభివృద్ధి చెందుతుండటంతో ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ సానుకూల పరిణామాల వెనుక స్థానిక ఆర్థిక వాతావరణం, ప్రభుత్వ విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత దోహదం చేస్తున్నాయి. విదేశీ సంస్థలతో పాటు దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలను విస్తరిస్తూ భారీగా రిక్రూట్ మెంట్లు చేపడుతున్నాయి. కేవలం ఐటీ రంగమే కాకుండా నాన్ టెక్ రంగాల్లోనూ కర్యాలయాలలో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఉపాధి కల్పన మరింత ఊపందుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Hyderabad Appointments, Job Market Trends, Corporate Hiring Hyderabad, Employment, Telugu One]

Published on: Sat Oct 3, 2026 9:26AM

political-news-img

ఖైరతాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయం: తలసాని

రాష్ట్ర రాజధాని నగరంలోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటైన ఖైరతాబాద్‌లో జరగబోయే రాజకీయ పోరుపై గులాబీ పార్టీ శిబిరంలో సర్వత్రా ధీమా వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల్లో ఈ స్థానంలో తామే విజయం సాధిస్తామని, ఇక్కడ విజయం తమ పార్టీదేనని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, కార్యకర్తల కష్టమే తమ విజయానికి శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే ప్రత్యర్థులకు గెలుపు అవకాశాలు లేవని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బలం ఏంటో ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేస్తాయని ఆయన గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.గతంలో తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశాయని నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కూడలిలోనూ గులాబీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తున్నాయని, నాయకత్వమంతా సమన్వయంతో ముందుకు సాగుతోందని తలసాని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక సమస్యలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నామని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇప్పటికే అధికార పార్టీ పాలనపై విసిగిపోయిన స్థానిక ఓటర్లు ప్రతిపక్ష వైపే మొగ్గు చూపుతున్నారని తలసాని పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార వేగం పెంచుతామన్నారు.ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాల మధ్య అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రత్యర్థి శిబిరాల్లోని లుకలుకలు తమ విజయ మార్గాన్ని మరింత సులభం చేస్తాయని వారు అంచనా వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల సమస్యల పరిష్కారంలో తాము ఎప్పుడూ ముందున్నామని, అందుకే ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం ఉందని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొనైనా ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.రాబోయే రోజుల్లో ప్రచార సరళిని మరింత తీవ్రతరం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ గెలుపు ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి గులాబీ పార్టీ సత్తా చాటుతుందని, ఖైరతాబాద్ ఫలితం రాజకీయంగా ఎంతో కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. [ Telangana Politics, Khairatabad Elections, Talasani Srinivasa Yadav, BRS Party, Hyderabad Politics, KTR, Danam nagendhar, CM Revanth reddy, Telugu One, Telugu News ]

Published on: Fri Oct 2, 2026 6:23PM

political-news-img

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ దందా: గుట్టురట్టు.!

హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగులను పట్టుకుని వాటి దంతాలను కట్ చేయడంతో పాటు, వాటిని అక్రమంగా విక్రయించేందు కు ప్రయత్ని స్తున్నట్లుగా విశ్వసనీయమైన సమా చారం రావడంతో డీఆర్‌ఐ అధికారులు వెంటనే రంగంలోకి దిగి నిఘా పెట్టారు.ఈ నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులు ఏనుగు దంతాలు, ఐవరీ వస్తువులు తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చారు. విక్రయానికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా డీఆర్‌ఐ అధికారులు రంగంలోకి దిగి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 17 కిలోల బరువున్న నాలుగు ఏనుగు దంతాలు, వాటితో నైపుణ్యంగా చెక్కిన ఐవరీ వస్తువులు (ట్రోఫీలు) స్వాధీనం చేసుకున్నారు. వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972లోని సంబంధిత నిబంధనల ప్రకారం వాటిని అధికారులు సీజ్ చేశారు.ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన వస్తువులను విక్రయించడం, వ్యాపారం చేయడం లేదా వాటిని ఉపయోగించడం చట్టప్రకారం నిషేధం.దేశవ్యాప్తంగా వన్యప్రాణుల నేరాల నియంత్రణకు డీఆర్‌ఐ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అక్రమంగా వన్యప్రాణులను తరలించడం, రక్షిత జాతులకు చెందిన జంతువుల నుంచి తయారైన వస్తువులను అక్రమంగా రవాణా చేయడం లేదా వాటితో వ్యాపారం చేయడం వంటి వాటిపై నిఘా పెట్టి ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు మద్దతుగా, వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. [ Illegal sale of elephant tusks uncovered, Hyderabad, DRI officials, Wild Life Protection Act, CM Revanth reddy, Hyderabad police, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]

Published on: Fri Oct 2, 2026 12:37PM