Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉద్యోగాలలో విజయం మహిళలదే
posted on: Mar 7, 2022 5:47PM
మహిళలకి ఉన్న ఉద్యోగ ప్రజ్ణకి సాటి లేదు అంటున్నారు పరిశోధకులు .ఇక భవిష్యత్తు వారిదే అని కూడా గట్టిగా చెబుతున్నారు. నిన్నటి దాకా మేధస్సు, అనుభవం , మాత్రమే కార్పొరేట్ కార్యాలయాలలో మంచి స్తితి లో ఉండటానికి ఉపయోగ పడతాయి అని నమ్మేవారు . అయితే ఈ మధ్య అమెరికాకు చెందిన " ఈగన్ జెండర్ " అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఆ రెండింటి కన్నా , ఉద్యోగంలో ప్రజ్న ఉన్నవారే గొప్ప విజయాలు సాధించగలరని తేలింది. సుమారు అయిదు వందల మందికి పైగా సీనియర్ ఎగ్సిక్యుటివ్ ల పనితీరుని పరిశీలించి న మీదట ఈ విషయం తెలిసింది. ఓ బృందంగా పని చేసేటప్పుడు పరస్పర సహకారం, కోప తాపాల నియంత్రణ , స్నేహంగా వుండటం, మొదలైన లక్షణాలు వున్నవారు ఉద్యోగం లో చక చకా పైకి ఎక్కుతున్నారుట.

అలా కాకుండా కేవలం ప్రతిభ , అనుభవాన్నే నమ్ముకున్నవారు వెనకపడుతున్నారుట. సో మహిళల సహజ లక్షణాలు అయిన స్నేహశీలత ,సహనం వంటివి వారి బలాలు గా మారి , వారిని ఉన్నత స్తాయికి చేరుస్తున్నాయి అని వీరు పరిశీలించి, పరిశోధించి , చెబుతున్నారు . అయితే వీరు ఒక సలహా కూడా చెబుతున్నారు ..వీరి అద్యయనం లో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం ఆశించిన స్తాయిలో లేకపోవటం, స్వతంత్రం గా వ్యవహరించటం లో తడబాటులని కూడా గమనించారుట. ఈ విషయాల మీద కాస్త ఫోకస్ పెట్టండి చాలు ..మీకు తిరుగు లేదు అని గట్టిగా చెబుతున్నారు. మరి ఆ రెండు అస్త్రాలని కూడా మన అమ్ముల పొదిలో చేర్చు కుంటే సరి ...


.gif)
.jpg)


