TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇకపై సంక్షేమ పథకాలు పొందాలంటే ఆ గుర్తింపు కార్డు ఉంటేనే అర్హత.!

Published on: Thu Nov 5, 2026 6:34PM

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం దేశవ్యాప్తంగా సంక్షేమ ఫలాలు అందాలంటే ఆధార్ కార్డు  తెల్ల రేషన్ కార్డులను మాత్రమే ప్రామాణికంగా పరిగణిస్తూ వచ్చారు. 

అయితే, ప్రస్తుత మారుతున్న కాలానికి అనుగుణంగా అర్హుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కేంద్రం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. తాజా పరిణామాల ప్రకారం, ఇకపై రేషన్ లేదా ఆధార్ కార్డుల స్థానంలో ఓటరు గుర్తింపు కార్డును ప్రధాన ప్రామాణికంగా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ సులభంగా ఉండటం  చాలా చోట్ల తేలికగా పొందగలుగుతుండటంతో కొన్ని లోపాలు తలెత్తుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.దీనివల్ల నిజమైన అర్హులకు లబ్ది చేకూర్చడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఓటరు ఐడీతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించాలని పరిశీలిస్తున్నారు.

ఈ కొత్త నిబంధన అమలైతే బోగస్ లబ్దిదారులకు అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ ధనం వృథా కాకుండా నేరుగా అర్హులకే చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.త్వరలోనే ఈ ప్రతిపాదనలపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం ఉందని, ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు కానున్న సంక్షేమ విధానాలపై భారీ ప్రభావం చూపనుంది.

 

 

[ Welfare scheme benefits Voter ID, Voter ID vs Aadhaar, Central government schemes, Indian government news, Telugu news updates, Indian government news, Telugu News, Telugu One ]