ట్రంప్ నోట ఇండియాపై పొగడ్తలు: భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ ఫెడరల్ రిజర్వ్ కు సుద్దులు.!
Published on: Sat Nov 21, 2026 8:47AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై పొగడ్తల వర్షం కురిపించారు. అగ్రరాజ్య కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ విధానాలను తూర్పారపడుతూ.. ఇండియాను చూసి నేర్చుకోవాలని సూచించారు., వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్న ఫెడరల్ రిజర్వ్ తీరును తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఇండియా ఆర్థిక వృద్ధిని ఊదాహరణగా చూపుతూ, తక్కువ వడ్డీ రేట్లు, 7 శాతం జీడీపీ వృద్ధితో భారత్ ముందుకు సాగుతోందని ప్రశంసలు గుప్పించారు. అమెరికాలో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాలో మెరుగైన ఆర్థిక గణాంకాలు వెలువడుతున్నప్పటికీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతోందని ఆసహరం వ్యక్తం చేశారు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉండగా, ఫెడరల్ బ్యాంక్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫెడరల్ రిజర్వ్ రాజకీయ కోణంలో వ్యవహరిస్తోందని ఆరోపించిన ట్రంప్.. వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే అమెరికా జీడీపీ 14 నుంచి 20 శాతం వరకు చేరుకునే అవకాశం ఉందన్నారు.
వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా అమెరికా తన రుణభారాన్ని తగ్గించుకోగలదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ఇతర దేశాల ఆర్థిక పురోగతికి అమెరికాయే కారణమన్న ఆయన అటువంటి దేశంలో ప్రపంచంలోనే అత్యల్ప వడ్డీ రేట్లు ఉండాలనీ, అయితే ఆశ్చర్యకరంగా ఫెడరల్ బ్యాంగ్ వడ్డీ రేట్లను అధికంగా ఉంచిందని విమర్శించారు.

వడ్డీ రేట్ల విషయంలో వైట్‌హౌస్, ఫెడరల్ రిజర్వ్ అధికారుల మధ్య భిన్న వైఖరులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృద్ధి వేగాన్ని పెంచేందుకు తక్కువ వడ్డీ రేట్లు అవసరమని ట్రంప్ పట్టుబడుతుండగా, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠినమైన ద్రవ్య విధానం అవసరమని ఫెడరల్ రిజర్వ్ పట్టుబడుతోంది. ఇటీవల సెప్టెంబర్‌లో లక్షిత వడ్డీ రేటు శ్రేణిని 3.75–4 శాతానికి పెంచిన ఫెడ్, అక్టోబర్‌లో దానిని యథాతథంగా కొనసాగించింది.
ఇది కూడా చదవండి: మోడీ దెబ్బకు ట్రంప్ దిగివచ్చినట్లేనా?
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, దేశీయ ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో భారత్ ప్రస్తావన ట్రంప్ నోట రావడం, ముఖ్యంగా వృద్ధి రేటు, రుణ వ్యయాలపై భారత్ ను చూసి నేర్చుకోవాలంటూ తమ దేశ కేంద్ర బ్యాంకుకు ఆయన సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ద్రవ్య విధాన సమావేశం వచ్చే నెల 8, 9 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాక్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
మీకు నచ్చవచ్చు: దేశ గౌరవపతాక: జాతీయ జెండా: మోడీ చర్య పట్ల దేశం అందరూ ఫిదా.!
మోడీ ఇమేజ్ డ్యామేజ్.. కారణం ట్రంప్?
[US interest rates , Donald Trump, Praise. India, Federal Reserve, India economic growth, TeluguOne]


