బీసీలకు రాజ్యాధికారం.. హైదరాబాద్‌పై గురి.. తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Published on: Tue Nov 24, 2026 8:02PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు. తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి ఇంటర్వ్యూలో ఆయన పలు రాజకీయ అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.
ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన అధికారిక ప్రోమో తాజాగా విడుదలైంది. బీజేపీ–బీఆర్ఎస్ రాజకీయ సంబంధాలు, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు, ఓటు హక్కులు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలకు ఆయన ఇచ్చిన ఘాటైన సమాధానాల తళుకులు ప్రోమోలో కనిపిస్తున్నాయి.
ఇప్పుడే చూడండి.. సంచలన ప్రోమో!

తాజాగా విడుదలైన ఈ టీజర్లో మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపక్షాల విమర్శలను నేరుగా తిప్పికొడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పనితీరును సమర్థించడం కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న పలు కీలక అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఇంటర్వ్యూపై ఆసక్తిని పెంచుతున్నాయి. పూర్తి ఇంటర్వ్యూ బుధవారం రాత్రి 7 గంటలకు తెలుగు వన్ న్యూస్ – ద జర్నలిస్ట్‌లో ప్రసారం కానుంది. ఈ ప్రత్యేక ముఖాముఖిని తప్పక వీక్షించండి.
మీకు నచ్చవచ్చు: మూసీ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ స్పీడ్.. జనవరిలో ఫేజ్-1 పనులు ప్రారంభం.!
మీకు నచ్చవచ్చు: తూర్పు గాలుల ద్రోణి ప్రభావం..ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.!
[ TPCC Chief Mahesh Kumar Goud, Telangana Congress, TPCC Chief, Revanth Reddy, Congress Strategy, BC Reservations, 52 Percent BC Representation, Tone News The Journalist Interview ]


