Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Peddi: పెద్ది మూవీ స్టోరీ ఇదే!
posted on: Feb 15, 2026 5:36PM

'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'(Peddi) సినిమా చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా 'పెద్ది' రూపొందుతోంది. అయితే అసలు ఈ చిత్ర కథ ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా సోషల్ మీడియాలో పెద్ది స్టోరీ ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు, ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళాడు అనే పాయింట్ తో 'పెద్ది' తెరకెక్కుతోందట. స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయట. ముఖ్యంగా కామెడీ, లవ్ స్టోరీ ఆకట్టుకుంటాయట. ఇక సెకండ్ హాఫ్ లో సినిమా ఎమోషనల్ టర్న్ తీసుకుంటుందని, నటుడిగా రామ్ చరణ్ కి 'రంగస్థలం' స్థాయి పేరు రావడం ఖాయమని చెబుతున్నారు.
'పెద్ది'పై రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నేడు(ఫిబ్రవరి 15) దర్శకుడు బుచ్చిబాబు పుట్టినరోజు సందర్భంగా చరణ్ చేసిన ట్వీట్.. ఆయన కాన్ఫిడెన్స్ ని తెలియజేస్తోంది.
"నా పెద్ది కెప్టెన్ బుచ్చిబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీ అభిరుచి, ప్రతి చిన్న విషయంపై చూపించే శ్రద్ధ, రూటెడ్ స్టోరీ టెల్లింగ్.. ప్రతిరోజూ సెట్‌లో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. మనిద్దరం కలిసి మరిన్ని మ్యాజికల్ స్టోరీలను సృష్టిద్దాం.
ఈ సంవత్సరం మీ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం మీకు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను." అని రామ్ చరణ్ ట్వీట్ చేశాడు.
బుచ్చిబాబుతో మరిన్ని సినిమాలు చేయడానికి రామ్ చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఆయన ట్వీట్ ని బట్టి అర్థమవుతోంది. ఇండస్ట్రీ వర్గాల్లోనూ దీని గురించి ఓ న్యూస్ వినిపిస్తోంది. బుచ్చిబాబు ప్రతిభకు ఫిదా అయిన చరణ్, మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడని.. పెద్ది విడుదల సమయంలో ఈ కాంబినేషన్ లో రెండో సినిమా అనౌన్స్ మెంట్ వస్తుందని టాక్.
https://x.com/AlwaysRamCharan/status/2022880527179772101?s=20





