ప్రధాని మోదీ తిరుపతి పర్యటనకు మూడు రోజుల షెడ్యూల్ ఖరారు.!
Published on: Sun Nov 29, 2026 2:18PM
.webp)
తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన మూడు రోజుల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న 61వ అఖిల భారత పోలీస్ ఉన్నతాధికారుల సదస్సును డిసెంబర్ 4న ప్రధాని ప్రారంభించనున్నారు.
ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్‌తో పాటు దేశవ్యాప్తంగా సుమారు 200 మంది ఐపీఎస్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దేశ అంతర్గత భద్రత, పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు.
ముఖ్యంగా సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాద ముప్పులు, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేకంగా సమీక్షించనున్నారు. పోలీసు వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలపైనా చర్చలు జరగనున్నాయి.
షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 4న రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఐసర్ కేంద్రానికి వెళ్లి రాత్రి అక్కడే బస చేయనున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలకనున్నారు.
ఇది కూడా చదవండి: మాజీ డిప్యూటీ మేయర్ హత్యకు భారీ కుట్ర.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు.!
డిసెంబర్ 5న ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ ఉన్నతాధికారుల సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఇక డిసెంబర్ 6న మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఐసర్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుపతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, వసతి, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత.!
మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల కసరత్తు: స్టాలిన్, శరద్ పవార్‌లతో ఇండియా కూటమి నేతలు భేటీ.!
[ PM Modi Tirupati Tour, Narendra Modi, Amit Shah, Ajit Doval, All India DGP Conference, Tirumala ]


