పురుషులకూ పెటర్నటీ లీవ్: తమిళనాడు సర్కార్ నిర్ణయం.. సర్వత్రా హర్షం.!
Published on: Fri Nov 27, 2026 8:05AM

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురుష ఉద్యోగులకు తొలిసారిగా 15 రోజుల పితృత్వ సెలవును మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవజాత శిశువుల సంరక్షణతో పాటు తల్లులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో తండ్రుల పాత్రను గుర్తిస్తూ ఈ పితృత్వ సెలవు నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ ప్రకటన పరిపాలన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పురుషులకు పితృత్వ సెలవులు వర్తింప చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ఈ కొత్త సెలవు విధానాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవు వర్తిస్తుంది. చరిత్రలో ఈ విధంగా పితృత్వ సెలవు మంజూరు చేయడం ఇదే మొదటి సారి. భార్య ప్రసవం సమయంలో భర్త ఆమెకు దగ్గరగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు.
తమిళనాడు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసవం, ఆ తరువాత బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఏడాది సెలవు సౌకర్యం అమలు చేస్తున్నది. ఇప్పుడు పురుష ఉద్యోగులకు కూడా తమ భాగస్వామికి, నవజాత శిశువుకు అండగా నిలిచేందుకు 15 రోజుల ప్రత్యేక పితృత్వ సెలవులు కేటాయిస్తూ నిర్ణక్ష్ం తీసుకుంది. ఈ పితృత్వ సెలవు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నవజాత శిశువుల ఆలనా పాలనలో తండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రసవానంతరం కొన్ని రోజుల పాటు తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు శిశువు సంరక్షణకు కుటుంబ సభ్యుల తోడు తోడ్పాటు అవసరం ఈ కీలక సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు వృత్తిపరమైన ఒత్తిడి లేకుండా కుటుంబంతో గడిపేందుకు 15 ప్రత్యేక పితృత్వ సెలవు దోహదపడుతుందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: మహిళలతో సమానంగా పురుషులకూ పితృత్వ సెలవులు....
విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులలో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసూతి సెలవుల విషయంలో కుటుంబ అవసరాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న ప్రశంసలు వస్తున్నాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్ ఆయా రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తోంది. పితృత్వ సెలవు విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు, ఉత్తర్వులు తమిళనాడు సర్కార్ త్వరలో విడుదల చేయనుంది. పాలనా పరమైన నిబంధనలను రూపొందించిన తర్వాత ఇది అమలులోకి వస్తుంది.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ నిర్ణయాల్లో భాగంగా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి అడుగులు వేసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద పితృత్వ సెలవు విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమౌతోంది.
మీకు నచ్చవచ్చు: తల్లి కావాలని కోరుకునే మహిళలు తినాల్సిన ఆహారం ఇది!
ప్రెగ్నెన్సీ నుంచి ప్రసవం తర్వాత వరకు.. ఈ ఆహార జాగ్రత్తలు తప్పనిసరి!
[Paternity leave, Tamil Nadu Government, Twoweeks, CMVijay, TeluguOne]


