పంచాయతీ నామినేషన్ల వేళ హింసకు కుట్ర: 66 మంది అరెస్టు.!
Published on: Mon Nov 23, 2026 8:11AM

పల్నాడులో పంచాయతీ నామినేషన్ల వేళ భారీ హింసకు కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీలోని వర్గ పోరు కారణంగానే ఈ కుట్రకు తెరలేపారని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా 66 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 22 కార్లు, కొడవళ్లు, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ కూడా ఉన్నారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపురంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు), స్థానిక టీడీపీ నేత పావులూరి శ్రీనివాసరావు వర్గీయులు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే ప్రత్యర్థి వర్గాన్ని బెదిరించేందుకు వీరు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు నుంచి సుమారు 100 మందిని 22 కార్లలో శ్రీనివాసరావు తిమ్మాపురం గ్రామానికి తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్: డిసెంబర్ 2న పోలింగ్.!
స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో వారికి మద్యం, భోజన వసతి కల్పించి, వారిలో కొందరికి మారణాయుధాలు, కర్రలు ఇచ్చారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి వాహనశ్రేణిని అడ్డగించారు.

మొత్తం 66 మందిని అదుపులోకి తీసుకుని నాదెండ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో టీడీపీలోని వర్గ విభేదాల కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
మీకు నచ్చవచ్చు: ఏపీలో మోగిన స్థానిక సమర భేరి.. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.!
ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.!
[Panchayat, Nominations, Palnadu, Violence, Conspiracy, Arrest, TeluguOne]


