ఆమెతో వివాహేతర సంబంధం నిజమే.. సంచలన విషయం అంగీకరించిన ఎన్విడియా సీఈఓ.!
Published on: Mon Nov 9, 2026 8:42AM

ప్రపంచాన్ని తన టెక్నాలజీ ఆవిష్కరణలతో శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా (Nvidia) సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర సంచలనంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామిగా నిలిచి, కంపెనీ మార్కెట్ విలువను అత్యున్నత శిఖరాలకు చేర్చిన 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్.. చైనా నిఘా వర్గాల రాడార్‌లో పడినట్లు నివేదికలు రావడంతో టెక్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది.
సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ డేటా సెంటర్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న ఆలిస్ హువాంగ్ అనే మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని ఆయన బహిరంగంగా అంగీకరించారు. తన కుటుంబానికి, భార్యకు తాను నమ్మకద్రోహం చేశానని పేర్కొంటూ ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ తప్పిదానికి ఎలాంటి సమర్థన లేదని చెబుతూ, తన ప్రవర్తన పట్ల పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన సందేశంలో ఆయన స్పష్టం చేశారు.
ఈ వ్యక్తిగత వ్యవహారం కేవలం కుటుంబ సమస్యగానే ఆగిపోకుండా, అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న 'చిప్ వార్' జాతీయ భద్రతా కోణానికి మలుపు తిరగడం గమసార్హం. అమెరికా నిఘా వర్గాల ఎలక్ట్రానిక్ నిఘాలో భాగంగా బయటపడిన ఈ కమ్యూనికేషన్లలో, ఆలిస్ హువాంగ్ను చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ (MSS) ఒక ఆపరేటివ్‌గా రిక్రూట్ చేసుకుందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.
అమెరికా కఠినమైన ఎగుమతి నిబంధనలను, ఆంక్షలను ధిక్కరించి చైనాకు అధునాతన ఏఐ చిప్స్ చేరవేయడంలో ఈ నెట్వర్క్ కీలకంగా వ్యవహరించిందనే ఆరోపణలతో ఈ ఉదంతం మరింత క్లిష్టతరమైంది. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ వ్యయం జరుగుతున్న తరుణంలో, ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ గతంలో 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నప్పటికీ, ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ భవిష్యత్తు మరియు భద్రతా నిబంధనలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ఈ పరిణామాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్విడియా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ రంగంలోకి దిగింది. జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత ప్రవర్తన విదేశీ నిఘా సంస్థల ప్రమేయంపై ఒక సమగ్రమైన స్వతంత్ర విచారణకు (Independent Probe) ఆదేశించినట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

అయితే, ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా జాతీయ భద్రతకు లేదా ఎన్విడియా కంపెనీ రహస్యాలకు ఎటువంటి భంగం వాటిల్లలేదని బోర్డు స్పష్టం చేసింది. జెన్సన్ హువాంగ్ స్వయంగా ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తానని హామీ ఇవ్వగా, ఆయన నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
అయినప్పటికీ, అమెరికన్ రాజకీయ వర్గాలలో కాంగ్రెస్‌లో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విచారణ జరగాలని రిపబ్లికన్ అగ్రనేతలు డిమాండ్ చేస్తుండటంతో, టెక్ దిగ్గజం జెన్సన్ హువాంగ్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన రాజకీయ, వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు.. కూకట్‌పల్లిలో మూడు కంపెనీలు దగ్ధం.!
[ Nvidia CEO Jensen Huang, Jensen Huang affair, Alice Huang, Nvidia independent probe, AI chips, tech news Telugu, Telugu One, Telugu News ]


