నారా వారి కుటుంబం: అందరూ సమానమే.. ఎవరి బాధ్యతలు వారివి.!
Published on: Tue Nov 10, 2026 1:53PM

రాజకీయాలు కుటుంబ సభ్యుల మధ్యే అడ్డంకులను సృష్టించే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇందుకు వైఎస్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం ఉదాహరణలుగా చెప్పవచ్చు. కుటుంబంలోనే రాజకీయాలలో ఆధిపత్యం కోసం కుమ్ములాటలూ, తగాదాలు, విభేదాలు. అటువంటి కారణాలతోనే కేసీఆర్ కుటుంబం నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) ఏర్పాటు చేశారు.
సరిగ్గా అటువంటి తాగాదాలతోనే వైఎస్ రాజశఖరరెడ్డి కుమార్తె, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చెల్లెలు అయిన వైఎస్ షర్మిల అన్నతో వేరుపడి సొంత బాటలో నడుస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఇగో సమస్యలు, పైచేయి కోసం ఆరాటాలు ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, నారా లోకేష్ చెప్పారు. తన తండ్రి, ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు.. కుటుంబ సభ్యులందరికీ వారి వారి బాధ్యతలను స్పష్టంగా విభజించారు. తామందరం ఆయన మాటను శిరసావహిస్తున్నామని లోకేష్ ఆ ఇంటర్యూలో చెప్పారు.
తమది చాలా సన్నిహితమైన ఉమ్మడి కుటుంబమని వివరించిన నారా లోకేష్.. కుటుంబంలో, బంధాలు, బాధ్యతలు అన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటామన్నారు. చంద్రబాబుతమ బాధ్యతలను స్పష్టంగా విభజించారనీ, ఆ బాధ్యతలను తాము చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధిగా నెరవేరుస్తున్నామనీ వివరించారు. కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక విషయాలను చూసుకునే బాధ్యత బ్రహ్మణిది అని చెప్పిన లోకేష్, బ్రహ్మణి ఆరోగ్యం, ఆదాయం, వ్యయాలకు సంబంధిచిన వ్యవహారాలు పర్యవేక్షిస్తారనీ, ఇక అమ్మ భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ను నిర్వహిస్తారనీ చెప్పారు.

కుటుంబ భద్రత, లాజిస్టికల్ వ్యవహారాలు, అలాగే రాజకీయ వ్యూహాలకు సంబంధించిన బాధ్యతలు తనపై ఉన్నాయని లోకేష్ చెప్పారు. కుటుంబ సభ్యులందరికీ బాధ్యతలను సమానంగా విభజించడమే కాకుండా, ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు రూపొందించిన వ్యవస్థ వల్ల కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
ఇది కూడా చదవండి: కనకదుర్గమ్మకి చంద్రబాబు కుటుంబం పట్టువస్త్రాల సమర్పణ!
తమ కుటుంబంలో ఎలాంటి అభద్రతా భావాలు, ఈగో క్లాష్‌లు, అభిప్రాయ భేదాలకు తావులేకుండా మా మా బాధ్యతలకు కట్టుబడి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని వ్యాపార లావాదేవీలు, వ్యక్తిగత విషయాలను పరస్పరం పంచుకుంటామని వివరించారు. ఈ కారణంగానే కుటుంబంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సజావుగా సాగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబంలో ఎవరికి ఏ బాధ్యత ఎవరిదన్న దానిపై స్పష్టత ఉండటం వల్ల ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటామన్నారు. రాజకీయ రంగంలో తాను బిజీగా ఉంటూనే, కుటుంబ పరమైన వ్యాపార వ్యవహారాలను, ఇతర సామాజిక కార్యక్రమాలను అందరూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. రాజకీయాలతో పాటు కుటుంబ పరంపరను, వ్యాపారాలను ఒక క్రమపద్ధతిలో నడిపించడంలో చంద్రబాబు దూరదృష్టి ఎంతగానో దోహదపడుతోందని లోకేష్ చెప్పారు.

రాష్ట్ర రాజకీయాలలో బిజీగా గడుపుతూనే కుటుంబ వ్యవహారాలను ఇంత పకడ్బందీగా సమన్వయం చేసుకోవడంపై నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కుటుంబ వ్యవస్థ పట్ల, బాధ్యతల పట్ల నారా కుటుంబం అనుసరిస్తున్న విధానం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మీకు నచ్చవచ్చు:
నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు కుటుంబం
ది లెజండ్.. ది విజనరీ.. ది లీడర్.. ఒకే ఒక్కడు చంద్రబాబు
[Nara Lokesh Family Responsibilities, Chandrababu Naidu, Nara Brahmani, Nara Bhuwaneswari, Lokesh, Interview, Politics And Family, Telugu One]


