TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఐసీసీ సదస్సు వేదికగా పవన్ తో లోకేష్ భేటీ: రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై చర్చ.!

Published on: Thu Nov 12, 2026 10:41AM

ఆర్థిక రాజధాని విశాఖపట్నం వేదికగా  జరుగుతున్న 31వ సీఐఐ ( భాగస్వామ్య సదస్సులో   ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వంలో   కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ ఇద్దరు ప్రముఖ నాయకులు ఒకే వేదికపై కలుసుకోవడం, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై చర్చించడం  రాజకీయ,  పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆసక్తి  రేకెత్తించింది.

ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వివరించారు. దేశవిదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నాయన్న లోకేష్.. వివిధ కంపెనీలతో కుదురుతున్న ఒప్పందాలు, వాటి ద్వారా రాష్ట్ర యువతకు లభించబోయే ఉపాధి అవకాశాల గురించి విపులంగా వివరించారు.  

రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మంత్రి నారా లోకేశ్ చూపుతున్న చొరవను, ఆయన చేస్తున్న విశేష కృషిని ఈ సందర్భంగా   పవన్ కల్యాణ్ ఈ  అభినందించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరిన్ని దిగ్గజ పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి, నవ్యాంధ్రను పారిశ్రామికంగా అగ్రగామిగా నిలపాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంలోని అగ్రనేతల మధ్య పరస్పర సహకారం, రాష్ట్ర అభివృద్ధిపై ఉన్న స్పష్టత ఈ భేటీ ద్వారా మరోసారి స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

విశాఖ వేదికగా జరుగుతున్న ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థల నుంచి  12 లక్షల కోట్ల రూపాయల  పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.  

ఇది కూడా చదవండి: విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.!

రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక రూపురేఖలను మార్చేలా ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లకు ఈ సదస్సు ఒక చక్కని వేదికగా నిలిచింది. పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌ల ఈ సమావేశం ద్వారా ప్రభుత్వ నాయకత్వంలోని ఐక్యత, అభివృద్ధిపై ఉన్న దృఢ సంకల్పం స్పష్టంగా వెల్లడయ్యాయి. 

రాబోయే కాలంలో ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చి, ప్రతి ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ప్రజలు, పారిశ్రామిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

మీకు నచ్చవచ్చు:   లోకేశ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు


[Nara Lokesh,  Pawan Kalyan, ICCSummitt, Investments, TeluguOne]