మిస్ యూనివర్స్ 2026 విజేతగా జెన్నిఫర్ బారెటో..తొలి వివాహితగా చరిత్ర.!
Published on: Wed Nov 25, 2026 2:55PM

ప్రపంచ అందాల పోటీల చరిత్రలో కీలక మలుపు చోటు చేసుకుంది. తొలిసారిగా వివాహిత, ఒక బిడ్డకు తల్లి అయిన మహిళ విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్‌లో నిర్వహించిన 75వ మిస్ యూనివర్స్ 2026 పోటీల్లో ఆతిథ్య దేశానికి చెందిన 27 ఏళ్ల జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచారు.
మొత్తం 116 దేశాల పోటీదారులతో హోరాహోరీగా సాగిన ఈ వేడుకలో, ఏడేళ్ల కుమార్తెకు తల్లి అయిన జెన్నిఫర్ తన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను మెప్పించారు. మానసిక ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో పనిచేస్తున్న ఆమె, సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సైకాలజీ, క్లినికల్ సోషల్ వర్క్‌లో రెండు మాస్టర్స్ డిగ్రీలు కలిగిన ఆమె విజయం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఈ విజయంతో ప్యూర్టోరికో ఖాతాలో ఆరో మిస్ యూనివర్స్ కిరీటం చేరింది. 2006లో జులేకా రివెరా తర్వాత ఆ దేశానికి దక్కిన తొలి టైటిల్ ఇది కావడం విశేషం. స్వదేశంలో జరిగిన పోటీల్లో ప్యూర్టోరికో సుందరి విజేతగా నిలవడం ఇది రెండోసారి. మరోవైపు, భారత్ తరపున బరిలోకి దిగిన కజియా లిజ్ మెజో టాప్ 30 వరకు చేరుకున్నప్పటికీ తదుపరి దశకు అర్హత సాధించలేకపోయారు.
దశాబ్దాల పాటు మిస్ యూనివర్స్ పోటీల్లో కఠిన నిబంధనలు అమల్లో ఉండేవి. పెళ్లయిన మహిళలు, తల్లులకు ఈ వేదికపై అవకాశం ఉండేది కాదు. అయితే 2023 నుంచి అర్హత నిబంధనలను సవరించడంతో వివాహితులు, తల్లులు కూడా పోటీల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది.
ఇది కూడ చవండి: చిన్న ఇస్త్రీ షాపు నుంచి లక్షల టర్నోవర్ దాకా..ముంబయి యువకుడి సక్సెస్ స్టోరీ.!
ఈ మార్పు తర్వాత గత కొన్నేళ్లుగా పలువురు తల్లులు అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా వివాహిత, తల్లి అయిన జెన్నిఫర్ విజేతగా నిలవడంతో, అందాల పోటీల నిర్వచనంపై ప్రపంచవ్యాప్తంగా సానుకూల చర్చ జరుగుతోంది. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కలలను సాకారం చేసుకోవచ్చనే సందేశం ఈ గెలుపుతో బలపడింది.
.webp)
రాబోయే రోజుల్లో ఇతర అంతర్జాతీయ అందాల పోటీలు కూడా ఇదే తరహా సంస్కరణల వైపు అడుగులు వేసే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత లక్ష్యాల మధ్య సమతూకం సాధించే మహిళలకు ఈ విజయం మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్ క్షమాపణలు ఎందుకంటే.!
మీకు నచ్చవచ్చు: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ చేంజ్.. సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.!
[ Jennifer Barreto, Miss Universe 2026, First married woman Miss Universe, Puerto Rico Miss Universe, Beauty pageant rules change ]


