ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక.!
Published on: Mon Nov 16, 2026 10:48AM
.webp)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అధ్యక్షుడిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జై షా మరో చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. ఐసీసీ బోర్డు సమావేశాల్లో భాగంగా ఆయనను రెండో దఫాకు ఏకగ్రీవంగా పునర్నియామకం చేస్తూ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు చేర్చడంలో ఆయన ప్రదర్శించిన అంకితభావం, పటిష్టమైన నాయకత్వ లక్షణాలే ఈ ఏకగ్రీవ ఎన్నికకు ప్రధాన కారణమని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం 38 ఏళ్ల వయస్సు గలిగిన జై షా, గతంలో ఐసీసీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ కీలక పరిణామంతో క్రికెట్ క్రీడను ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించడానికి, సరికొత్త ప్రేక్షకులను ఆకర్షించడానికి వాణిజ్యపరమైన వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ క్రీడల్లోకి క్రికెట్ పునరాగమనం చేస్తున్న తరుణంలో, ఈ కీలకమైన దశలో ఆయన నాయకత్వం కొనసాగడం క్రీడకు ఎంతో మేలు చేస్తుందని ఐసీసీ బోర్డు గట్టిగా విశ్వసిస్తోంది. సభ్య దేశాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే ఆయన ప్రత్యేక శైలి అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఎంతో లాభసాటిగా మారుతోందని పలువురు సభ్య దేశాల ప్రతినిధులు ప్రశంసించారు.
భారత్ తరఫున ఐసీసీ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఐదో ప్రముఖుడిగా జై షా రికార్డు సృష్టించారు. అంతకుముందు దిగ్గజాలు జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్. శ్రీనివాసన్, శశాంక్ మనోహర్ మాత్రమే ఈ ఘనత సాధించగా, ఆ జాబితాలో జై షా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. బీసీసీఐ గౌరవ కార్యదర్శిగా, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా ఆయన అందించిన అద్భుతమైన సేవలు భారతీయ క్రికెట్ రూపురేఖలనే పూర్తిగా మార్చివేశాయి.

ఆయన హయాంలోనే ఐపీఎల్ మీడియా హక్కుల ఒప్పందాలు రికార్డు స్థాయికి చేరడం, మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభం కావడం, అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు వంటి ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. తనపై ఉంచిన అపారమైన నమ్మకానికి, మద్దతు తెలిపిన ప్రతి ఒక్క బోర్డు డైరెక్టర్‌కు జై షా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఐసీసీ ఛైర్మన్‌గా సేవనందించడం కేవలం గౌరవం మాత్రమే కాదని, అది ఎంతో పెద్ద బాధ్యత అని ఆయన అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక తొలి సోమవారం..పోటెత్తిన శివ భక్తులు.!
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి అన్ని సభ్య దేశాలతో కలిసి సమన్వయంతో పనిచేస్తానని పునరుద్ఘాటించారు. ఆటగాళ్లు, అభిమానులు మరియు వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే కాలంలో క్రికెట్‌కు బలమైన, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ చైర్ రిచ్‌సన్ థాంప్సన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెట్‌కు ఇది చాలా కీలకమైన తరుణమని, ఈ సమయంలో జై షా నాయకత్వం కొనసాగడం శుభపరిణామమని కొనియాడారు.
ఆట యొక్క సంప్రదాయాలను కాపాడుతూనే, నూతన ఆవిష్కరణలు మరియు వాణిజ్య మార్పులకు అనుగుణంగా ముందుకు సాగడంలో ఆయన దార్శనికత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జింబాబ్వే క్రికెట్ చైర్ తవెంగ్వా ముకుహ్లానీ సైతం జై షా నాయకత్వ పటిష్టతను కొనియాడుతూ, అందరినీ కలుపుపోయే ఆయన విధానం గ్లోబల్ క్రికెట్‌ను బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ బోర్డు మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టడం, సరికొత్త దేశాల్లో క్రికెట్ మార్కెట్‌ను విస్తరించడం వంటి ప్రతిష్టాత్మక ప్రణాళికలను ఆయన విజయవంతంగా అమలు చేస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే రెండేళ్ల కాలంలో ఆయన నాయకత్వంలో క్రికెట్ ప్రపంచం మరిన్ని నూతన మైలురాళ్లను తాకడం ఖాయమని అభిమానులు క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లిన ఇండిగో మహిళా ఉద్యోగిని దారుణ హత్య.!
[ Jay Shah unanimously elected as ICC Chairman, ICC Re-election, Cricket News, BCCI Secretary, International Cricket Council, BCCI]


