రోజుకు 4 నిమిషాలు: వారంలో వెయిట్ లాస్.. ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్న జపాన్ ఎక్సర్ సైజ్.!
Published on: Sun Oct 11, 2026 9:06AM

బరువు తగ్గాలంటే గంటల తరబడి జిమ్‌లో గడపాలా? ఖరీదైన పరికరాలు కావాలా? బిజీ షెడ్యూల్‌లో వ్యాయామానికి గంటల సమయం కేటాయించడం సాధ్యమేనా? అన్న సందేహాలతో పెరిగిపోతున్న శరీర బరువును చూసుకుంటూ ఇంక ఇంతే అంటూ గడిపేస్తున్న వారికి అవేం అవసరం లేదు.. రోజుకు నాలుగు నిముషాల సమయం కేటాయిస్తే చాలు వారంలో బరువు తగ్గుతారంటోంది ఓ జపాన్ ఎక్సర్ సైజ్.
ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది. రోజుకు కేవలం నాలుగు నిమిషాల పాటు ఈ ఎక్సర్ సైజ్ చేస్తే చాలు కేవలం వారం రోజుల్లో ఐదు కిలోల బరువు తగ్గిపోతారంటూ సమాజాక మాధ్యమ వేదికగా తెగ ప్రచారం అవుతోంది. ఇప్పుడిది నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎక్సర్ సైజ్ కంటే వారంలో ఐదు కిలోల బరువు అదే నండీ వెయిట్ లాస్ అన్న నినాదమే ఇందుకు కారణం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదానిని బట్టి, ఎలాంటి స్పెషల్ జిమ్ ఎక్విప్ మెంట్ లేకుండా శారీరక కదలికల తో నాలుగు నిముషాల పాటు చేస్తే ఈ ఎక్సర్ సైజ్ విశేషంగా ఆకట్టుకుంటున్నది. బిజీగా ఉండేవారికి, జిమ్‌కు వెళ్లేందుకు సమయం లేనివారికి ఇది సులభమైన మార్గమన్న భావన కలిగిస్తోంది. అయితే వీడియోలోని వ్యాయామాలను చూసి ఆకర్షితులవడం ఒకటైతే, అందులో పేర్కొన్న ఫలితాలు శాస్త్రీయంగా నిరూపితమయ్యాయా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు.
తబాతా వర్కౌట్‌గా ప్రచారంలో ఉన్న ఈ విధానంలో 20 సెకన్ల పాటు తీవ్రంగా వ్యాయామం చేసి, 10 సెకన్లు విశ్రాంతి తీసుకుంటారు. ఇలా ఎనిమిది రౌండ్లు చేస్తే నాలుగు నిమిషాల వ్యాయామం పూర్తవుతుంది. కేవలం నాలుగు నిమిషాల వ్యాయామంతోనే ప్రతి ఒక్కరూ వారంలో ఐదు కిలోల బరువు తగ్గుతారనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
అయితే బిజీ లైఫ్ లో ఎటువంటి శారీరక వ్యాయామం లేకుండా గడిపేసే కంటే.. రోజుకు నాలుగు నిమిషాలైనా వ్యాయామానికి కేటాయించడానికి ఈ జపాన్ ఎక్సర్ సైజ్ ప్రేరకంగా నిలుస్తోంది. అందుకే ఈ జపాన్ వర్కౌన్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
[Japanese exercise Shake Internet, 4minute Workout, Japanese Exercis, Tabata Workout, Weight Loss,Fitness, Healthy Lifestyle, Telugu One]


