యలహంక ప్యాలెస్ విషయంలో: జగన్ చట్టపరంగా పై చేయి.. నైతికంగా ఘోర పరాజయం.!
Published on: Mon Nov 23, 2026 9:26AM

ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా ఉంటూ, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలిచిన వైఎస్ కుటుంబం, ఇప్పుడు విచ్ఛిన్నమైంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండాల్సిన కనీస ప్రేమ, ఆప్యాయతలు ఇసుమంతైనా కనిపించకపోవడం అటుంచి.. బద్ధ శత్రువుల్లా రోడ్డు కెక్కుతున్నారు. దీనికి నిదర్శనంగా, షర్మిల, విజయమ్మ తమ కుటుంబ సభ్యులతో కలిసి యలహంక ప్యాలెస్‌ను సందర్శించడానికి వీల్లేదంటూ కోర్టును ఆశ్రయించి మరీ వారిని జగన్ అడ్డుకోవడాన్ని చెప్పుకోవచ్చు.
కుటుంబ పెద్దగా జగన్ వైఫల్యానికి ఈ ఘటన పరాకాష్టగా చెప్పుకోవచ్చు. రక్తసంబంధం కంటే, ఆస్తులు, అధికారమే మిన్న అన్నట్లుగా జగన్ తీరు ఉందని పరిశీలకులు అంటున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన బాధ్యతలను,మాటలను విస్మరించి సొంత చెల్లెలు షర్మిల వాటా ఆస్తులనే కాకుండా, మేనకోడలు, మేనల్లుడి భవిష్యత్తు కోసం ఉద్దేశించిన ఆస్తులను కూడా లాగేసుకున్నారన్న విమర్శలు ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఆస్తుల పరంగా ఎవరి వాటాలు ఎవరికి దక్కాయి అనే చట్టపరమైన అంశాలు ఒకవైపు ఉన్నప్పటికీ, సొంత కుటుంబ సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుపై సామాన్య ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి, ఆవేదన వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఈ ఆస్తి తనదేనని, షర్మిల కుమార్తె అంజలి వివాహం కోసం అక్కడ అలంకరణ పనులు చేపట్టే హక్కు వారికి లేదని జగన్ కోర్టులో వాదించి, ముందస్తుగా కోర్టు ఉత్తర్వులను పొందారు. దీని ఫలితంగా, పోలీసులు వారిని విమానాశ్రయం వద్దే అడ్డుకుని, యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా సమీపంలోని హోటల్లో బస చేయాలని సూచించారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని మరో హోటల్లో బస చేయాల్సి వచ్చింది.

చట్టపరంగా చూస్తే, కోర్టు ఉత్తర్వులను పొందడంలో, పోలీసుల ద్వారా షర్మిల, విజయమ్మలను అడ్డుకోవడంలో జగన్ విజయం సాధించి ఉండవచ్చు. కానీ, సామాజిక కోణంలో, నైతిక కోణంలో ఆయన ప్రతిష్ఠ కోల్పోయారనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. ఆస్తి హక్కుల కోసం సొంత చెల్లి, తల్లి వీధుల్లోకి వచ్చి పోరాడాల్సి రావడం, ప్రజల దృష్టిలో జగన్ కుటుంబ బంధాలకు ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తిగా నిలబెడుతుందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ఇంత కంటే నీచం ఉంటుందా: ఇంత దిగజారుడుతనమా.. జగన్ పై షర్మిల ఫైర్.!
సొంత చెల్లెలి వివాహం సమయంలో జనగ్ వ్యవహరించిన తీరు పట్ల రాజకీయ వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ సొంత ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేలా కోర్టు ఉత్తర్వులను తీసుకురావడం, వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో ఒకింత వ్యతిరేకతను కారణమౌతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. షర్మిలను యలహంక ప్యాలెస్ లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంలో జగన్ చట్టపరంగా పై ఇప్పటికిప్పుడు పై చేయి సాధించి ఉండవచ్చు కానీ, నైతికంగా మాత్రం ప్రజల దృష్టిలో దిగజారిపోయారని అంటున్నారు. ఎందుకంటే.. సొంత చెల్లెలి కూతురి వివాహ సమయంలో జగన్ వ్యవహరించిన తీరు నైతికంగా ఇసుమంతైనా సమర్థనీయం కాదంటున్నారు.

అన్నిటికీ మించి వైఎస్ తరువాత ఆ కుటుంబానికి పెద్దగా ఉండాల్సిన జగన్ ఆ బాధ్యతను మరచి తోడబుట్టిన చెల్లితో ఆస్తుల కోసం పంచాయతీలు పెట్టడం, కోర్టులను ఆశ్రయించడం, బహిరంగ విమర్శలు చేయడం ఆయన ప్రతిష్ఠను మసకబార్చిందని అంటున్నారు. తాజా ఘటనతో జగన్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయారనీ, ఈ మచ్చను తుడిచివేసి, ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడం అంత సులువు కాదనీ అంటున్నారు.
మీకు నచ్చవచ్చు: షర్మిల కుమార్తె పెళ్లికి జగన్ బెంగళూరు ప్యాలెస్: అనుమతి నిరాకరించిన మాజీ సీఎం.!
యలహంక ప్యాలెస్ వద్ద ఉద్రిక్తత: బెంగళూరు చేరుకున్న షర్మిల.!
[Jagan Sharmila dispute, Yelahanka Palace, controversy, Ethicaldimensions, TeluguOne]


