గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి ఊరట
Published on: Mon Sep 12, 2011 11:37AM
న్యూఢిల్లీ: గుల్బర్గా సొ
సైటీ ఊచకోత కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. ఈ కేసుపై తేల్చాల్సింది కింది కోర్టేనని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2002లో గుల్బర్గా సొసైటీ ఊచకోతపై కావాలనే నరేంద్ర మోడీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. గుజరాత్ అల్లర్ల సమయంలో గుల్బర్గా ఊచకోతలో కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు ఎషాన్ జాఫ్రీ మరణించారు. ఆయన భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో కేసు వేసింది.
గుల్బర్గా అల్లర్లలో 37 మంది మరణించారు. ఈ సంఘటనపై సిట్ దర్యాప్తు చేసింది. ఈ కేసులో నరేంద్ర మోడీకి సిట్ క్లీన్‌చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ న్యాయవాది రామచంద్రన్ ఆహ్మదాబాద్‌లో పర్యటించి నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించారు.


