TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గజల్ శ్రీనివాస్ కు విశ్వ సంగీత శాంతి దూత పురస్కారం: స్వయంగా ప్రదానం చేసిన మారిషస్ అధ్యక్షుడు.!

Published on: Thu Sep 24, 2026 12:25PM

ప్రముఖ గజల్ గాయకుడు, ట్రిపుల్ గిన్నీస్ రికార్డు  గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్‌కు మారిషస్ గడ్డపై అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ రాజధాని పోర్ట్ లూయిస్‌లోని ప్రసిద్ధ హరి హర దేవస్థాన ప్రాంగణంలో ఆయనను  విశ్వ సంగీత శాంతి దూత పురస్కారంతో ఘనంగా సత్కరించారు. పోర్ట్ లూయిస్‌లోని ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో 108 అడుగుల ఎత్తైన భారీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కొలువై ఉన్న పవిత్ర ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ స్వయంగా ఈ పురస్కారాన్ని గజల్ శ్రీనివాస్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా   ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడుతూ..  గజల్ శ్రీనివాస్..   ప్రపంచ భాషలలో గీతాలు ఆలపిస్తూ సనాతన ధర్మం, అహింస, సత్యాగ్రహ సూత్రాలను ప్రచారం చేయడం  అభినందనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తున్న ఆయన సేవలు యువతకు   స్ఫూర్తిదాయకమన్నారు.

హరి హర దేవస్థానం నిర్వహణ కమిటీ ప్రతిష్టాత్మకంగా అందించే ఈ పురస్కారానికి డాక్టర్ గజల్ శ్రీనివాస్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని పేర్కొన్న మారిషస్ అధ్యక్షుడు  గజల్ శ్రీనివాస్ చేస్తున్న సంగీత సేవ భారత సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు.

వివిధ దేశాలలో భారత కళలు, సాంస్కృతిక వైభవాన్ని తన గాత్రం ద్వారా చాటి చెబుతున్న గజల్ శ్రీనివాస్‌కు దక్కిన ఈ  గుర్తింపు తెలుగువారందరికీ గర్వకారణం అనడంలో సందేహం లేదు.  . ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని గజల్ శ్రీనివాస్ ను అభినందనల్లో ముంచెత్తారు.  

కాగా విశ్వసంగీత శాంతి దూత పురస్కారంతో  గజల్ శ్రీనివాస్ అంతర్జాతీయ వేదికలపై భారత సంగీతానికి, శాంతి సందేశానికి చేస్తున్న సేవకు తగిన గుర్తింపు లభించిందని సంగీతాభిమానులు అంటున్నారు.   భవిష్యత్తులోనూఆయన మరిన్ని   కార్యక్రమాల ద్వారా   ప్రపంచ వ్యాప్తంగా సంగీత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


[Ghazal Srinivas, Mauritius Award, Global Music Peace Ambassador, Hari Hara Devasthanam, Sridharam Beer Gokul, Telugu One]