డీలిమిటేషన్ బిల్లు మద్దతుపై ఉత్కంఠ: స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల భేటీ.!
Published on: Sun Nov 29, 2026 4:17PM

దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ఉమ్మడి వ్యూహం రూపొందించేందుకు ఇండియా కూటమి అగ్రనేతలు చెన్నైలోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు.
చెన్నై విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో స్టాలిన్ నివాసానికి చేరుకున్న నేతలకు ఆయన స్వయంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ బృందంలో ఉన్నారు.
వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీషన్, సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని స్టాలిన్‌ను కోరేందుకు కూటమి నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, ప్రయోజనాల దృష్ట్యా బిల్లును వ్యతిరేకించి విపక్ష ఐక్యతను నిలబెట్టాలని నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
.webp)
మరోవైపు, తమ డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించినందున మద్దతు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలను డీఎంకే ఇస్తోంది. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల దక్షిణాది సీట్ల వాటాపై ప్రభావం పడుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి నేతల విజ్ఞప్తిపై స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఈ భేటీ ఫలితాలు కూటమి సమీకరణాలు, దక్షిణాది రాజకీయాలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
మీకు నచ్చవచ్చు: డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల కసరత్తు: స్టాలిన్, శరద్ పవార్‌లతో ఇండియా కూటమి నేతలు భేటీ.!
మీకు నచ్చవచ్చు: 110 ఏళ్ల వయసులో ఓటేసిన బామ్మ.. సీఎం చంద్రబాబు అభినందనలు.!
[ Delimitation Bill, Sonia Gandhi, MK Stalin, India Alliance, Re-division of constituencies ]


