రేవంత్ కేబినెట్ లో విజయశాంతికి స్థానం?.. కొండా సురేఖ ఊస్టింగేనా?
Published on: Fri Aug 28, 2026 11:16AM

తెలంగాణ మంత్రివర్గంలో మార్పులూ, చేర్పులపై ఇప్పుడు చర్చ జోరందుకుంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్గాలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఓ రేంజ్ లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
గతకొద్ది రోజులుగా తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖపై చర్యలకుసిఫారసు చేస్తూ నివేదిక కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ స్థానంలో రేవంత్ తన కేబినెట్ లోకి ఎవరిని తీసుకుంటారన్న విషయంపై చర్చ జరుగుతోంది. సీనియర్లు, పార్టీ వర్గాలలో విజయశాంతి పేరు గట్టిగా వినిపిస్తోంది.
సామాజిక సమీకరణాలు, బీసీ మహిళా కోటాను వంటి అంశాలను పరిశీలిస్తే.. విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు. బిసి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడంతో పాటు, ఆమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా మహిళా ప్రాతినిధ్యంతో పాటు సామాజిక బ్యాలెన్స్ కూడా సాధించినట్లౌతుందని అంటున్నారు.
విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్ఠానం ఆమెకు మంత్రి పదవి హామీ ఇచ్చిందని ఆమె వర్గీయులు ఇఫ్పుడు గుర్తు చేస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీలను విజయశాంతి వర్గాలు గుర్తు చేస్తున్నాయి. హై కమాండ్ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు.
Changes in Revanth Cabinet, Konda Surekha, Vijayashanthi, Minister Post, Telangana Politics, Ramulamma, Telugu One


