అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఏపీ నంబర్ 2: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడి.!
Published on: Tue Nov 10, 2026 3:38PM

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమ రంగాలలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జాతీయ స్థాయిలో విడుదలైన తాజా యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. తలసరి ఆదాయం పరంగా రాష్ట్రం కొంత వెనుకబడి ఉన్నప్పటికీ, ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడంలో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో అనితర సాధ్యమైన ఫలితాలను సాధించిన ఆంధ్రప్రదేశ్ ఈ ఘనతను సొంతం చేసుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు అన్నీఇన్నీ కావు. రాజధాని నిర్మాణం నుంచి మౌలిక వసతుల కల్పన వరకు అనేక ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ప్రభుత్వం ముందుకు సాగింది. అలా రాష్ట్రం గాడిలో పడుతున్న తరుణంలో రాష్ట్రంలో అధికారం మారింది. 2019 ఎన్నికలలో విజయం సాధించి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్ సీఎం అయ్యారు. అంతే అక్కడితో ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణం దాదాపు నిలిచిపోయింది.
ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. చంద్రబాబునాయుడు మళ్లీ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టారు. నిలిచిపోయి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.

సంపద సృష్టి జరుగుతోంది. అయితే, కేవలం సంపదను సృష్టించడం మాత్రమే కాకుండా, ఆ సంపదను ప్రతి ఒక్కరికి సమానంగా అందేలా చేయడమే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు తన పాలన ద్వారా నిరూపిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష తార్కాణమే యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం. ఈ యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెలువడిన తర్వాత రాజకీయ, ఆర్థిక వర్గాలలో దీనిపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ భేటీలో సంబరాలు..సీఎం, డిప్యూటీ సీఎంలకు స్వాగతం.!
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అట్టడుగు వర్గాలకు అందుతున్న సేవలు, విద్యా, వైద్య రంగాలలో కల్పిస్తున్న సమాన అవకాశాల కారణంగానే ఏపీకి ఈ ర్యాంక్ సాధ్యమైందని నిపుణులు, పరిశీలకులూ విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న సంస్కరణల విధానం, పాలనా దక్షత రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలిచాయంటున్నారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, ప్రణాళికాబద్ధమైన విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో రాష్ట్రం విజయవంతమైందని సోదాహరణంగా వివరిస్తున్నారు.

ఈ గుర్తింపు ద్వారా ఏపీ పట్ల పెట్టుబడిదారులలో, జాతీయ సంస్థలలో సానుకూల దృక్పథం మరింత పెరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం కూడా సమాజ అభివృద్ధికి ఏపీ ఇస్తున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతకు ఈ నివేదిక నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలను అమలు చేయడం ద్వారా మొదటి స్థానాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మీకు నచ్చవచ్చు: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!
[AP Number 2 in Developement and Welfare, Access Equality Index Reval, AP ranks second, Access Equality Index, CBN Governance, AP Government, TeluguOne]


