TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాషాయం నుంచి కషాయం వరకూ: కేంద్రంపై అన్నామలై నిప్పులు.. మోడీ విధేయుడి ధిక్కార స్వరం.!

Published on: Thu Oct 22, 2026 2:57PM

తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి  అన్నామలై కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒక్కప్పుడు ప్రధాని మోడీకి అత్యంత విధేయుడు, కరడుగట్టిన బీజేపీ కార్యకర్త, అయిన అన్నామలై  బీజేపీకి గుడ్ బై చెప్పి..  వి ది లీడర్ అనే పేరుతో ఒక కొత్త స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. అయితే సొంత కుంపటి పెట్టిన అన్నామలై ఇంత వరకూ కేంద్రంపై కానీ, కేంద్ర విధానాలపై కానీ ఘాటు విమర్శలు చేసిన సందర్భం లేదు. అటువంటి అన్నామలై, ఇప్పుడు..  ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా, అలాగే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా సీజేపీ చేస్తున్న ఆందోళనకు బాహాటంగా మద్దతు పలికారు.  

దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ఎస్‌ఐఆర్  వివాదాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా డిమాండ్లు, అలాగే విపక్షాలు,  యువత చేపడుతున్న ఆందోళనలను కేంద్రం అణచివేయాలని చూడటాన్ని అన్నమలై తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి రాసిన సుదీర్ఘ లేఖలో  ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు.

అప్పట్లో మోదీ చేసిన కామెంట్లను నేడు కేంద్ర ప్రభుత్వానికి అన్వయిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జంతర్ మంతర్ ప్రాంతాన్ని నిరసనలకు అనర్హమైనదిగా ప్రకటించడం, నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారాలు వంటి అనేక కీలక అంశాలను ఆయన తన   లేఖలో ప్రస్తావించారు. కేవలం  వాట్సాపిజం ఎదురుదాడి ధోరణిని ప్రదర్శించకుండా, ప్రజలు లేవనెత్తుతున్న   ప్రశ్నలకు కేంద్రం సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇవ్వాలని అన్నామలై తన లేఖలో డిమాండ్ చేశారు.   

సమస్యలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నామలై నిప్పులు చెరిగారు.    దసరా సందర్భంగా రావణ దహనంలో బొద్దింక దిష్టిబొమ్మను తగలబెట్టడం వంటి ఘటనలను సీజేపీకి ఉచిత ప్రచారం కల్పించడమేనని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా అన్నామలై కేంద్రంలోని మోడీ సర్కార్ ను నిలదీస్తూ కొన్ని ప్రశ్నలను సంధించారు.

 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఇప్పటికే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో అసలే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీకి, ఇప్పుడు నాటి మోడీ విధేయుడు సంధించిన ప్రశ్నాస్త్రాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లైందనడంలో సందేహం లేదు.  

[Annamalai Fires Center, Repression, Peoples Movement, BJP Central Government, Modi Old Comments, Tamil Nadu Politics, Annamalai We The Leader, Telugu One]