సొంత పార్టీ ఎమ్మెల్సీపై అసద్ సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే?
Published on: Sat Aug 29, 2026 9:18AM

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం... మజ్లీస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. ఏఐఎమ్ఐఎమ్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. .ఇటీవలి కాలంలో హిజాబ్ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బాహాటంగానే అసంతృప్తి అసహనం వ్యక్తి చేసిన సంగతి విదితమే.
మహిళల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ప్రకటనలుచేశారు. పలు వేదికలపై మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మాట్లాడారు. అయితే అదే సమయంలో.. సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
ముఖ్యంగా మహిళా సంక్షేమం, గౌరవం గురించి రహమత్ బేగ్ వ్యవహారంపై పార్టీకి స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే అధినేత ఓవైసీ ఈ చర్య తీసుకున్నారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సందేశాన్నీ, సంకేతాన్ని అసదుద్దీన్ ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
{AIMIM MLC Suspended, Asaduddin Owaisi, Mirza Rahmath Baig, Hyderabad AIMIM Controversy, AIMIM Action on MLC, Telugu One}


