TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ప్రతిష్ఠాత్మక ఎన్.జి. రంగా పురస్కారం.!

Published on: Fri Nov 6, 2026 4:32PM

ఆచార్య ఎన్.జి. రంగా 127వ జయంతి సందర్భంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌కు ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారం ప్రదానం చేశారు. అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జేకేసీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 6న గుంటూరులోని జేకేసీ కళాశాల ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆచార్య ఎన్.జి. రంగా 1933లో రచించిన 'హరిజన నాయకుడు' పుస్తకాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ ఆవిష్కరించారు. అనంతరం జమీన్ రైతు సంపాదకులు డోలేంద్ర ప్రసాద్‌ను ఆచార్య ఎన్.జి. రంగా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

జేకేసీ కళాశాల ప్రిన్సిపాల్ పరుచూరి గోపీచంద్ సభాధ్యక్షత వహించారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందిమళ్ల శివప్రసాద్, డాక్టర్ అశోక్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రచయితలు, విద్యావేత్తలతో పాటు సుమారు 500 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారు. ఆచార్య ఎన్.జి. రంగా ఆశయాలు, సామాజిక సేవ, రచనా వారసత్వాన్ని స్మరించుకుంటూ ఈ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.

Read Also:మందు కోసమే ఏకంగా 120 కోట్లు: వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో రికార్డు స్థాయి ఖర్చులు.!

 

 

[ Acharya N.G. Ranga, N.G. Ranga 127th Birth Anniversary, Dolendra Prasad, Jameen Rythu Editor, Acharya N.G. Ranga Award, Guntur, JKC College, Amaravati Institute of Social Sciences, Yelamanchili Sivaji, Dokka Manikya Varaprasad, Harijan Nayakudu Book, Vallamreddy Lakshman Reddy, Award Ceremony, Guntur News ]